రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఏఎఫ్ మెయింటినెన్స్ ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఎయిర్ మార్షల్ అజయ్ కుమార్ అరోరా
Posted On:
01 NOV 2024 7:47PM by PIB Hyderabad
భారత వాయుసేన- మెయింటినెన్స్ ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఎయిర్ మార్షల్ అజయ్ కుమార్ అరోరా నేడు ఎయిర్ హెడ్ క్వార్టర్స్ (వాయు భవన్)లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన - దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల గౌరవార్ధం జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించారు.
ఎయిర్ మార్షల్ అరోరా... ఆగస్టు 1986న వాయుసేనలోని ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరారు. అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కళాశాల నుంచీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కళాశాల నుంచీ, అలాగే సికింద్రాబాద్ లోని డిఫెన్స్ మేనేజ్ మెంట్ కళాశాల నుంచీ ఆయన డిగ్రీలు తీసుకున్నారు. ప్రాథమికంగా ఆయన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పట్టభద్రులూ, ఐఐటీ ఖరగ్ పూర్ పూర్వవిద్యార్ధి. పూణే విశ్వవిద్యాలయం నుంచీ మేనేజ్ మెంట్ లో డాక్టరేట్ చేశారు. 38 ఏళ్ల వృత్తి జీవితంలో ఆయన కీలకమైన అనేక కమాండ్ అండ్ స్టాఫ్ పదవులను నిర్వహించారు. మెయింటినెన్స్ ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించక ముందు ఆయన డైరెక్టర్ జనరల్ (ఎయిర్ క్రాఫ్ట్) పదవిలో ఉన్నారు.
ఎయిర్ మార్షల్ అరోరా అందించిన అత్యున్నత సేవలకు గుర్తుగా ఆయన 2018లో విశిష్ట సేవా మెడల్ నూ, 2024లో అతి విశిష్ట సేవా మెడల్ ను పొందారు. శ్రీమతి సంగీత ఆయన అర్థాంగి కాగా, వారికి పుల్కిత్ అనే కుమారుడూ ఉన్నారు.
***
(Release ID: 2070253)
Visitor Counter : 65