ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘కేరళ పిరవి’ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 01 NOV 2024 9:03AM by PIB Hyderabad

   కేరళ ‘పిరవి’ (ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘కేరళ పిరవి (రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం) శుభాకాంక్షలు! సమ్మోహన పరిచే ప్రకృతి సౌందర్యం, సుసంపన్న సంప్రదాయాలు, శ్రమజీవులైన ప్రజలకు నెలవైన రాష్ట్రమిది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో కేరళ వాసులు తమదైన ముద్ర వేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ, నిరంతరం పురోగమించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

“കേരളപ്പിറവി ആശംസകൾ! മാസ്മരികമായ ഭൂപ്രകൃതിക്കും ഊർജസ്വലമായ പാരമ്പര്യത്തിനും കഠിനാധ്വാനികളായ ജനങ്ങൾക്കും പേരുകേട്ടതാണ് ഈ സംസ്ഥാനം. കേരളത്തിൽ നിന്നുള്ള ജനങ്ങൾ ലോകമെമ്പാടും, വിവിധ മേഖലകളിൽ തങ്ങളുടെ വ്യക്തിമുദ്ര പതിപ്പിച്ചിട്ടുണ്ട്. വരുംകാലങ്ങളിലും സംസ്ഥാനത്തെ ജനങ്ങൾ പുരോഗതി പ്രാപിക്കട്ടെ .”

 

 

 

***

MJPS/TS


(రిలీజ్ ఐడి: 2070043) సందర్శకుల సూచీ సంఖ్య : : 130