ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
Posted On:
01 NOV 2024 9:06AM by PIB Hyderabad
ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాన మంత్రి ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వైభవోపేతమైన సంస్కృతి, సంప్రదాయాల అద్భుత సమ్మేళనంతో అలరారుతున్న ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగిపోతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను.’’
***
MJPS/TS
(Release ID: 2070041)
Visitor Counter : 46
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam