రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దీపావళి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు ముమ్మరం చేసిన రైల్వే భద్రతా దళం.. ప్రయాణికులు పాటించాల్సిన భద్రతా చర్యలపై ప్రచారం

రోజువారీ ప్రయాణికులకు అదనంగా

దీపావళి, ఛత్ పూజ పండుగల వేళ పెరగనున్న రద్దీ

రైలు ప్రయాణికులకు దేశంలోని విస్తృత రైల్వే నెట్‌వర్క్ వ్యాప్తంగా సురక్షిత, ఆనందదాయకమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్న ఆర్‌పీఎఫ్.
పండుగ సీజన్‌లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ వారు పాటించాల్సిన భద్రతా చర్యలను ప్రచారం చేస్తున్న భారతీయ రైల్వే

ప్రమాదకరమైన, మండే స్వభావం గల వస్తువుల రవాణా గురించి సమాచారమివ్వాలని ప్రయాణికులకు ఆర్‌పీఎఫ్ విజ్ఞప్తి

Posted On: 30 OCT 2024 8:51PM by PIB Hyderabad

పండుగ రద్దీ దృష్ట్యాప్రజలకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికిఅవాంఛనీయ ఘటనలను నివారించడానికి భారతీయ రైల్వే కృషి చేస్తోందిదీపావళిఛత్ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా సవాలుతో కూడినదే అయినానవరాత్రిదుర్గా పూజ సందర్భంలో విజయవంతంగా పనిచేసిన అనుభవంతోభారతీయ రైల్వే ఇప్పుడు దీపావళిరాబోయే ఛత్ వేడుకల కోసం ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేర్చేందుకు పూర్తిగా సంసిద్ధమైంది.

 

రైల్వే ప్రాంగణాల్లో ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తేదయచేసి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబరు 139 కి కాల్ చేసి లేదా రైల్ మదద్ పోర్టల్‌ ఉపయోగించి వెంటనే రైల్వే భద్రతా దళం (ఆర్‌పీఎఫ్కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరుతున్నారుదీపావళి పండుగ సమయంలో దేశవ్యాప్తంగా కాంతిఆనందం వెల్లివిరియడంతో పాటు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగాసాఫీగా వారి గమ్యస్థానాలకు చేర్చడం కోసం ఆర్‌పీఎఫ్ పటిష్ఠ భద్రతా చర్యలను అమలు చేస్తోంది.

పండుగ సీజన్ సమయంలో ప్రజలకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకుఅగ్ని ప్రమాదాలను అరికట్టడానికిఅలాగే రైల్వే నెట్‌వర్క్‌లో ప్రమాదాలను నివారించడం కోసం అన్ని విధాలా సన్నద్ధమైన ఆర్‌పీఎఫ్ ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకుంటున్నది. ప్రయాణికులకు భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించే ప్రచారంలో భాగంగా రైల్వేలకు చెందిన ఆసక్తిదారుల సహకారంతోకరపత్రాల పంపిణీ, పోస్టర్లను ప్రదర్శించడంఆకట్టుకునే వీధి నాటకాలు (నుక్కడ్ నాటాక్‌లుప్రదర్శించడంఅలాగే బహిరంగ ప్రకటనలను ప్రసారం చేయడం వంటి ప్రచారాలను ఆర్‌పీఎఫ్ నిర్వహిస్తోందిప్రయాణికులందరినీ చేరుకునేలా సామాజికముద్రణఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోందిఈనెల 15 నుంచి చేపట్టిన తనిఖీల్లో భాగంగాఅగ్ని ప్రమాదాల నివారణ కోసం పోర్టబుల్ స్టవ్స్ (సిగ్రిస్ఉపయోగించే వర్తకవ్యాపారులతో పాటు ప్రయాణికుల సామాన్లుపార్శిల్స్ వంటి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు ప్రమాదకరమైనమండే స్వభావం గల వస్తువులను రవాణా చేస్తున్న 56 మందిపై రైల్వే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారురైళ్లలో ధూమపానం చేస్తున్న 550 మందికి జరిమానా విధించారుఅలాగే సిగరెట్లుఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (సీవోపీటీఏవివిధ నిబంధనల కింద 2,414 మందిపై కేసులు నమోదు చేశారు.

"దీపావళిఛత్ పండుగలు ఆనందంసమైక్యతకు ప్రతీకగా నిలిచే పండుగలు. ఈ పండుగల వేళ మా ప్రయాణికుల భద్రతే మాకు ప్రధానంఅని ఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ మనోజ్ యాదవ అన్నారు. "ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటూసురక్షితమైన ప్రయాణం కోసం మా సిబ్బందికి సహకరించాలని మేం కోరుతున్నాంఅని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రమాదాలునేరాలను నివారించే లక్ష్యంతోరైల్వే ప్రయాణికుల భద్రత కోసం ఆర్‌పీఎఫ్ సమగ్ర భద్రతాపరమైన హెచ్చరికలను జారీ చేసింది.

టపాసులుమండే స్వభావం గల వస్తువులుఅనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులను రైళ్లలో లేదా రైల్వే స్టేషన్లలో గమనిస్తేవెంటనే ఆర్‌పీఎఫ్/జీఆర్‌పీ సిబ్బందికి లేదా రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలి.

మీ విలువైన వస్తువులను మీ వద్దే భద్రంగా ఉంచుకోవాలి.

తక్కువ సామాన్లతో ప్రయాణించండిఅదనపు భద్రత కోసం డిజిటల్ చెల్లింపులను ఎంచుకోండి.

పిల్లల వెంట ఎల్లప్పుడూ పెద్దవారు తోడుగా ఉండేలా చూసుకోండి.

ప్రకటనలను శ్రద్ధగా వినండిఅలాగే రైల్వే సిబ్బంది సూచనలను పాటించండి.

పూర్తి స్థాయి భద్రతా చర్యలు:

·  ప్రధాన స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెంచడం

·  ఆర్‌పీఎఫ్ సిబ్బంది రైళ్లుస్టేషన్లలో తనిఖీలను ముమ్మరం చేయడం

·  నేరాలను సమర్థంగా నివారించేందుకు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్‌పీసహకారం

·  సామాన్లుప్రయాణికులను రెగ్యులర్‌గా తనిఖీ చేయడం.

· ప్రయాణికులు ఏవైనా భద్రతాపరమైన సమస్యల గురించి రైల్ మదద్ వెబ్ పోర్టల్ (https://railmadad.indianrailways.gov.inలేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా హెల్ప్ లైన్ నంబరు 139 కి కాల్ చేయవచ్చు.

 

*****


(Release ID: 2069797) Visitor Counter : 27