సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
01.07.2024 నుంచి బకాయిపడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, పింఛనుదారుల డీఆర్ అదనపు వాయిదాను చెల్లించేందుకు ప్రకటన జారీ చేసిన పించను, పించనుదారుల సంక్షేమ విభాగం
Posted On:
30 OCT 2024 7:28PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పించనుదారులకు 01.07.2024 నుండి చెల్లించాల్సిన కరవు భత్యం (డీఏ) కరవు సాయం (డీఆర్) అదనపు వాయిదాను 3 శాతం చొప్పున చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 30.10.2024వ తేదీన పించను, పించనుదారుల సంక్షేమ విభాగం (డీఓపీపీడబ్ల్యూ) పించనుదారులకూ, కుటుంబ పించనుదారులకూ సమాచారాన్నిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పించనుదారులు, కుటుంబ పించనుదారులు బేసిక్ పించను, కుటుంబ పించను (అదనపు పించను, కుటుంబ పించనుతో కలిపి)లో ప్రస్తుతం ఉన్న 50 శాతానికి బదులు 53 శాతం చొప్పున డీఏ, డీఆర్ పొందడానికి అర్హులవుతారు. 01.07.2024 నుంచి దీనిని పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ డీఆర్ రేట్లు వర్తించే వర్గాలు: (i) ఈ డిపార్ట్మెంట్ జారీ చేసిన 23.06.2017 నాటి ఆఫీస్ మెమో నెం. 4/34/2002-P&PW(D) Vol.II ప్రకారం 15 సంవత్సరాల కమ్యుటేషన్ కాలం గడిచిన తర్వాత పూర్తి పించను పునరుద్దరించే ఆదేశాలు వర్తించే ప్రభుత్వ రంగ సంస్థలు/స్వయం ప్రతిపత్తి సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పించనుదారులతో సహా సాధారణ కేంద్ర ప్రభుత్వ పించనుదారులు/ కుటుంబ పించనుదారులు (ii) సాయుధ దళాల పించనుదారులు/ కుటుంబ పించనుదారులు, డిఫెన్స్ సర్వీస్ నిధుల నుండి చెల్లింపులు అందుకునే సివిలియన్ పించనుదారులు/ కుటుంబ పించనుదారులు (iii) అఖిల భారత సర్వీస్ పించనుదారులు/ కుటుంబ పించనుదారులు (iv) రైల్వే పించనుదారులు/ కుటుంబ పించనుదారులు (v) తాత్కాలిక పింఛను పొందుతున్న పించనుదారులు.
***
(Release ID: 2069794)
Visitor Counter : 52