శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అధునాతన పదార్థాల (అడ్వాన్స్డ్ మెటీరియల్స్) పరిశోధన - అభివృద్ధి ప్రోత్సాహానికి సంయుక్త ప్రకటనపై భారత్, జర్మనీ సంతకాలు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, చాన్స్ లర్ షోల్జ్ ల సమక్షంలో అవగాహనా ఒప్పందాల (ఎంఒయు) మార్పిడి: అడ్వాన్స్ మెటీరియల్స్ లో పరిశోధనకు అనుమతి
జర్మనీ విదేశాంగ మంత్రి బెటినా స్టార్క్-వాట్సింగర్ తో ద్వైపాక్షిక చర్చలకు నేతృత్వం వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్: పరస్పర ప్రయోజనాలను పొందడంపై నిబద్ధత
Posted On:
25 OCT 2024 6:59PM by PIB Hyderabad
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇండో-జర్మన్ సహకారాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ పై పరిశోధన-అభివృద్ధిలో సహకారం కోసం సంయుక్త అనుమతి ప్రకటనను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జర్మన్ ఫెడరల్ మంత్రి శ్రీమతి బెటినా స్టార్క్-వాట్జింగర్ పరస్పరం మార్చుకున్నారు. దీని ప్రయోజనాలను పొందడానికి పరస్పర నిబద్ధత ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద మార్పిడి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచవ్యాప్త సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంగా ఉన్న అత్యాధునిక పరిశోధనలకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడిస్తోంది.
ఇద్దరు దేశాధినేతల మధ్య ప్లీనరీకి ముందు డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీమతి స్టార్క్-వాట్సింగర్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగస్వామ్యం స్వర్ణత్సవ వేడుకలో కీలక భాగం.
భారత-జర్మన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నిరంతర మద్దతు ఇస్తున్నందుకు స్టార్క్-వాట్జింగర్‌కు డాక్టర్ జితేంద్ర సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. వ్యర్థాలనుంచి సంపద, సుస్థిర ప్యాకేజింగ్ వంటి రంగాలలో 2+2 ఉమ్మడి ప్రాజెక్టులను ప్రారంభించడం వంటి ఇటీవలి భాగస్వామ్య విజయాలను, అలాగే సుస్థిరతక కోసం కృత్రిమ మేధ లో కొత్త ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు ఆహ్వానాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
భారత ప్రధాని, జర్మన్ చాన్స్ లర్ల నేతృత్వంలో జరగబోయే ఇండో-జర్మన్ ప్రభుత్వ స్థాయి సమావేశంలో సంయుక్త అనుమతి ప్రకటనతో పాటు ఈ ప్రతిపాదనలను కీలక అంశాలుగా ప్రస్తావించనున్నట్టు మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఐజిఎస్టిసి) సంయుక్త పరిశోధనలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిందని, 50 కి పైగా ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చిందని, రెండు దేశాలకు చెందిన యువ పరిశోధకులను అనుసంధానించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.
ఐఐఎస్ఇఆర్ త్రివేండ్రం, వుర్జ్ బర్గ్ విశ్వవిద్యాలయం మధ్య ఇటీవల ఇంటర్నేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ గ్రూప్ (ఐఆర్టిజి) స్థాపన, సుప్రామోలిక్యులర్ మాధ్యమాల్లో ఫోటోల్యూమినిసెన్స్ పై కూడా చర్చల్లో దృష్టి పెట్టారు. ఇది రెండు దేశాల మధ్య ఆభివృద్ధి చెందుతున్న అధునాతన సహకార పరిశోధనకు ఉదాహరణగా నిలుస్తోంది.
డార్మ్‌స్టాడ్‌లోని యాంటిప్రోటాన్, అయాన్ పరిశోధన కేంద్రం (ఎఫ్ఎఐఆర్) వంటి దీర్ఘకాలిక అంతర్జాతీయ ప్రాజెక్టులపట్ల భారతదేశ నిబద్ధతను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్ట్‌లో భారత శాస్త్రవేత్తలు అధునాతన పదార్థాలు, కణ భౌతిక శాస్త్ర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఎలక్ట్రిక్ మొబిలిటీ, సుస్థిర వ్యవసాయం, అధునాతన మెటీరియల్స్ వంటి ప్రాధాన్య రంగాలలో పరిశోధన, అభివృద్ధిని పెంచడానికి ఉద్దేశించిన భారతదేశ అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఎన్ఆర్ఎఫ్), నేషనల్ క్వాంటమ్ మిషన్ వంటి జాతీయ కార్యక్రమాలను కూడా ద్వైపాక్షిక చర్చలలో ప్రముఖంగా ప్రస్తావించారు.
హైడ్రోజన్ ఇందనంలో సహకార అవకాశాలు గురించి కూడా ఇద్దరు మంత్రులు చర్చించారు, భారతదేశ జాతీయ హైడ్రోజన్ మిషన్ పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, సుస్థిర ఇంధన నిల్వలో ఆశాజనక ఉమ్మడి అవకాశాలను అందించగలదని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
చివరిగా, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ, హెల్త్ కేర్ వంటి రంగాలలో ఆవిష్కరణ, పరిశోధన ప్రయత్నాలను సమీకృతం చేయడానికి డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీమతి స్టార్క్-వాట్జింగర్ తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇండో-జర్మన్ భాగస్వామ్యం సుస్థిరమైన, దృఢమైన ప్రపంచ భవిష్యత్తు కోసం సృజనాత్మక పరిష్కారాలను కొనసాగిస్తుందని ప్రకటిస్తూ, విద్యా మార్పిడి, ప్రతిభను ప్రోత్సహించ వలసిన అవసరాన్ని ఇరువురు నాయకులు అంగీకరించారు.
***
(Release ID: 2068336)
Visitor Counter : 113