జాతీయ మానవ హక్కుల కమిషన్
ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
పాఠశాల పర్యవేక్షణలో సంఘటన జరగడం పట్ల ఆందోళన వెలిబుచ్చిన కమిషన్
సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ కు ఆదేశాలు జారీ
పోలీసు దర్యాప్తు, శవపరీక్ష పరిశోధనల యథాస్థితిని నివేదికలో చేర్చాలని ఆదేశాలు
प्रविष्टि तिथि:
25 OCT 2024 3:29PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రెడ్డిపాలెం పంచాయితీ పరిధిలోని ఒక ప్రైవేటు పాఠశాల హాస్టల్ లో, ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ళ విద్యార్ధిని అక్టోబర్ 23న ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్త ఆధారంగా, జాతీయ మానవహక్కుల కమిషన్ కేసును సుమోటో విచారణకు స్వీకరించింది.
మీడియా నివేదిక నిజమైన పక్షంలో బాధితురాలి మానవహక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడినట్లేనని కమిషన్ వ్యాఖ్యానించింది. పాఠశాల యాజమాన్య పర్యవేక్షణలో, హాస్టల్ లో నివసిస్తున్న బాలిక ఆత్మహత్యోదంతం ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ కు కమిషన్ ఆదేశాలు జారీ చేస్తూ, కూలంకషమైన దర్యాప్తు అనంతరం నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని పేర్కొంది.
మరణానికి గల కారణాలూ, పోలీసు దర్యాప్తు నివేదిక, పోస్టుమార్టం నివేదికల వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు విన్నవించాలని మానవహక్కుల కమిషన్ చెప్పింది. కేసుకు సంబంధించి ఇతరత్రా దర్యాప్తు చేపట్టినట్లయితే సంబంధిత నివేదికను కమిషన్ తో పంచుకోవాలని కూడా ఆదేశించింది.
***
(रिलीज़ आईडी: 2068295)
आगंतुक पटल : 92