బొగ్గు మంత్రిత్వ శాఖ
బాధ్యతాయుత తవ్వకాల దిశగా బొగ్గు గనుల శాఖ చారిత్రక ముందడుగు: గనుల మూసివేత ధ్రువీకరణ పత్రాల జారీ
Posted On:
22 OCT 2024 4:39PM by PIB Hyderabad
పథాఖేడా ప్రాంతంలోని డబ్య్లూసీఎల్ సంస్థ నిర్వహించిన బొగ్గు గనుల మూసివేతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడం ద్వారా ఈ రంగంలో పర్యావరణ హిత మైనింగ్ పద్ధతులను అవలంబించే దిశగా బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ గొప్ప విజయం సాధించింది. ఈ రంగంలో చేపడుతున్న పర్యావరణ పునరుజ్జీవ ప్రయత్నాలలో ఇది ఒక ప్రధాన ముందడుగు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవదత్, కోల్ కంట్రోలర్ శ్రీ సజేష్ కుమార్ ఎన్., మంత్రిత్వ శాఖ, బొగ్గు నియంత్రణా సంస్థకు సంబంధించిన ఉన్నతాధికారులు, బొగ్గు, లిగ్నైట్ పీఎస్‌యూల సీఎండీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆమోదించిన మైనింగ్ ప్రణాళిక ప్రకారం తుది గనుల మూసివేత నిబంధనలకు అనుగుణంగా గనుల యజమాని చేపట్టిన రక్షణ, పునరుద్ధరణ, పునరావాస పనులకు ఈ ధ్రువపత్రం అందిస్తారు. బొగ్గు గనుల శాఖకు అనుబంధంగా పనిచేసే బొగ్గు నిర్వహణ సంస్థ ఈ ధ్రువపత్రాలను జారీ చేస్తుంది.
మూసివేత సర్టిఫికెట్లు అందుకున్న మూడు గనులు:
· పథాఖేడా గని సంఖ్య – II యూజీ: బేతుల్ జిల్లాలో ఎన్‌సీడీసీ యాజమాన్యం క్రింద జనవరి 1970లో ఈ గని ప్రారంభమైంది. బొగ్గు నిల్వలు అయిపోయిన కారణంగా దీనిని మూసివేశారు.
· పథాఖేడా గని సంఖ్య – I యూజీ: మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో 1963, మే 16న ప్రారంభమైంది. మూడు బొగ్గు పొరల్లో వెలికితీయగల నిల్వలు అయిపోయిన కారణంగా దీన్ని మూసివేశారు.
· సాత్పురా II యూజీ గని: జూన్ 1973లో బేతుల్ జిల్లాలో ఈ గనిని తెరిచారు. ఆమోదించిన ప్రాజెక్ట్ పరిమితుల ఆధారంగా బొగ్గు లభ్యత తగ్గడంతో దీన్ని మూసివేశారు.
గనుల మూసివేత తుది ధ్రువపత్రాలను డబ్ల్యూసీఎల్ సీఎండీ శ్రీ జేపీ ద్వివేది, డబ్ల్యూసీఎల్ జీఎం(భద్రత) శ్రీ దీపక్ రేవత్కర్, డబ్ల్యూసీఎల్ పథాఖేడా ప్రాంత జనరల్ మేనేజర్ శ్రీ ఎల్‌కే మహాపాత్ర స్వీకరించారు.
ప్రకృతి రమణీయతను పునరుద్ధరించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ బాధ్యతాయుతంగా, పర్యావరణహితంగా బొగ్గును వెలికి తీయడంలో బొగ్గు రంగం అంకింత భావం, నిబద్ధతను ఈ చర్య తెలియజేస్తుంది. భారత బొగ్గు గనుల చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ధ్రువపత్రాలను మంజూరు చేయడం కీలకమైన మైలురాయిగా గుర్తించారు.
***
(Release ID: 2067218)
Visitor Counter : 46