బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా 1993 బ్యాచ్ (ఏజీఎంయూటీ) క్యాడర్ అధికారి, బాధ్యతలు స్వీకరించిన విక్రమ్ దేవ్ దత్
Posted On:
21 OCT 2024 1:39PM by PIB Hyderabad
బొగ్గు శాఖ కార్యదర్శిగా శ్రీ విక్రమ్ దేవ్ దత్ ఈ రోజు పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈయన ఐఏఎస్ లో 1993 బ్యాచ్ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరమ్, కేంద్రపాలిత ప్రాంతం (ఏజీఎమ్యూటీ) శ్రేణికి చెందిన అధికారుల్లో ఒకరు. శ్రీ విక్రమ్ దేవ్ దత్ ఇంతకు ముందు పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ లో.. (డీజీసీఏ)లో డైరెక్టర్ జనరల్ గా సేవలను అందించారు.
ఇప్పటి వరకు బొగ్గు శాఖ కార్యదర్శిగా ఉంటూ బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు చార్జిని నిర్వహిస్తూ ఉన్న శ్రీ వి.ఎల్. కాంతారావు స్థానంలో శ్రీ విక్రమ్ దేవ్ దత్ బొగ్గు శాఖ కార్యదర్శి పదవి బాధ్యతలను చేపట్టారు. శ్రీ వి.ఎల్. కాంతారావు కంటే ముందు, శ్రీ అమృత్ లాల్ మీనా బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేశారు.
(Release ID: 2066675)
Visitor Counter : 83