పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైద‌రాబాద్‌లో అక్టోబ‌రు 22న ‘‘పంచాయతీ సమ్మేళనం’’



గ్రామీణ భారతంలో ‘జీవన సౌలభ్యం’ మెరుగు దిశగా ఓ ముందడుగు

చివరి అంచె వరకూ మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా సదస్సు

Posted On: 20 OCT 2024 9:47AM by PIB Hyderabad

కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అక్టోబరు 22న హైదరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్’ (ఎన్ఐఆర్‌డి అండ్ పిఆర్‌ప్రాంగణంలో పంచాయతీ సమ్మేళనం’ ఏర్పాటు చేసింది. ‘‘జీవన సౌలభ్యంచివరి అంచె వరకూ మెరుగైన సేవలు’’ ఇతివృత్తంతో నిర్వహించే ఈ సదస్సును పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రారంభిస్తారుఆయనతోపాటు ‘ఎన్ఐఆర్‌డి అండ్ పిఆర్‌’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.నరేంద్ర కుమార్మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అలోక్ ప్రేమ్ నాగర్తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ డి.ఎస్.లోకేష్ కుమార్ కూడా ఇందులో పాలుపంచుకుంటారు.

ఈ సమ్మేళనంలో భాగంగా నాలుగు ప్రాంతీయ చర్చాగోష్ఠులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అక్టోబరు 22 నాటి తొలి గోష్టిలో ఆంధ్రప్రదేశ్తెలంగాణగుజరాత్జార్ఖండ్మధ్యప్రదేశ్మిజోరంఒడిషా రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారుఈ సందర్భంగా చిట్టచివరి అంచెలో సేవా ప్రదానంతో ముడిపడిన పంచాయతీ సిబ్బందిప్రజా ప్రతినిధులు ఈ అంశంలో సవాళ్లుఅవకాశాలుఅనుభవాలు వగైరాలను పంచుకుంటారుఇందులో భాగంగా భాషానువాదం కోసం ‘భాషిణి’సమాచార ఆదానప్రదానాలకు ‘యునిసెఫ్  ర్యాపిడ్‌ప్రో’ఆన్‌లైన్ సేవల కోసం ‘సర్వీస్‌ప్లస్‌’ వంటి సార్వజనీన డిజిటల్ ఉపకరణాల వినియోగం తదితర అంశాలపై చర్చిస్తారు.

చిట్టచివరి అంచెదాకా సేవా ప్రదానం విస్తరణ ద్వారా జీవన సౌలభ్యం మెరుగుదల లక్ష్యం దిశగా పంచాయతీ సమ్మేళనం ఓ కీలక ముందడుగుఆయా రాష్ట్రాల వ్యూహాలుఉత్తమ పద్ధతులుఆలోచనలను పంచుకోవాలన్నది ఈ సదస్సు ధ్యేయంచివరి అంచెదాకా సేవల లభ్యత మెరుగుదలసమర్థ పాలన సౌలభ్యాన్ని వేగిరపరచడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుందిముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలపై అంచనాలతోపాటు నాణ్యత పెంపుపై శ్రద్ధ వహిస్తుందివీటితోపాటు గ్రామీణ సేవలపై విస్తృత అంచనాల రూపకల్పన పరిజ్ఞానం గురించి ‘ఎన్ఐఆర్‌డి అండ్ పిఆర్‌’ అవగాహన కల్పిస్తుందిసేవా ప్రదానం మెరుగు దిశగా వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై అధ్యయనాల గురించి వాధ్వాని ఫౌండేషన్ సోదాహరణంగా వివరిస్తుంది.


(Release ID: 2066664)