రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

థింక్ 2024 – ముగిసిన జోనల్ పోటీలు


థింక్ 2024- ది ఇండియన్ నేవీ క్విజ్ - ఆకాశం అంచులు దాటి వెళదాం!

Posted On: 18 OCT 2024 5:00PM by PIB Hyderabad

జాతీయ స్థాయిలో భారత నావికాదళం నిర్వహిస్తున్న థింక్ 2024 క్విజ్ పోటీల జోనల్ పోటీలు అక్టోబరు 14, 15 తేదీల్లో జరిగాయిముగింపుతో ఈ పోటీలు ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాయిమొత్తం నాలుగు జోన్‌ల (నార్త్సౌత్ఈస్ట్వెస్ట్నుంచి ప్రధాన జట్లు జోనల్ స్థాయిలో పోటీపడ్డాయిహోరాహోరీ పోటీల తర్వాతప్రతి జోన్ నుంచి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయిసెమీ ఫైనల్ పోటీలు ప్రీమియర్ నావికా శిక్షణ సంస్థభారత నౌకాదళ అకాడమీఎజిమలలో వచ్చే నెల 07న జరగనున్నాయిఈ 16 జట్లు పోటీపడే సెమీ ఫైనల్‌లో గెలిచిన ఎనిమిది జట్లు వచ్చే నెల 8న జరిగే ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి.

జోన్ వారీగా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించిన పాఠశాలల వివరాలు:-

నార్త్ జోన్

(a) ఢిల్లీ పబ్లిక్ స్కూల్గ్రేటర్ నోయిడా (ఉత్తర్ ప్రదేశ్)

(b) షిల్లాంగ్ హౌస్ స్కూల్ (ఉత్తర్ ప్రదేశ్)

(c) డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ సెంటర్అవధ్‌పురి (ఉత్తర్ ప్రదేశ్)

(d) సేఠ్ ఎమ్.ఆర్జైపురియా స్కూల్గోయల్ క్యాంపస్లక్నో (ఉత్తర్ ప్రదేశ్)

ఈస్ట్ జోన్

(a) శ్రీ శంకర విద్యాలయ (ఛత్తీస్‌గఢ్)

(b) తేజ విద్యాలయ (తెలంగాణ)

(c) ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాట్నా (బిహార్)

(d) జాన్సన్ గ్రామర్ స్కూల్ మల్లాపూర్ (తెలంగాణ)

 

సౌత్ జోన్

(a) అస్సిసి విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ఎర్నాకులం (కేరళ)

(b) విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్చెన్నై (తమిళ్ నాడు)

(c) ఎక్సెల్ పబ్లిక్ స్కూల్మైసూరు (కర్ణాటక)

(d) బి.విభవన్స్ రాజాలి విద్యాశ్రమ్చెన్నై (తమిళ్ నాడు)

 

వెస్ట్ జోన్

(a) ముష్తిఫండ్ ఆర్యాన్ హైయ్యర్ సెకండరీ స్కూల్ (గోవా)

(b) కేంబ్రిడ్జ్ కోర్ట్ హై స్కూల్ (రాజస్థాన్)

(c) జయశ్రీ పెరివాల్ హై స్కూల్ (రాజస్థాన్)

(d) సెయింట్ ఆంథోనీస్ ఎస్.ఆర్సెకండరీ స్కూల్ (రాజస్థాన్)

విస్తృతమైన 'వికసిత్ భారత్' ఇతివృత్తంతోథింక్ 24 క్విజ్ పోటీలు ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఇవి మేధోపరమైన వినిమయంపోటీల కోసం వేదికగా మారాయిఈ పోటీలకు అర్హత పొందిన విద్యార్థులు ఐఎన్ఏలోని అత్యాధునిక శిక్షణ సదుపాయాలను సందర్శించే ప్రత్యేక అవకాశం పొందుతారుఈ సవాలుతో కూడిన థింక్ 2024 క్విజ్ పోటీల్లో చివరి మజిలీ కోసం పోటీపడుతున్న అన్ని పాఠశాల జట్లకు భారత నావికాదళం శుభాకాంక్షలు తెలిపింది.

 

***



(Release ID: 2066257) Visitor Counter : 7


Read this release in: English , Urdu , Hindi , Marathi