ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేసిన టీసీఎస్/ టీడీఎస్ ల జమ కోరడం సులభతరం; చిన్న పిల్లల తరఫున టీసీఎస్ జమను వారి తల్లితండ్రులు కోరేందుకు వీలును కల్పిస్తూ ఆదాయ పన్ను నిబంధనలలో సవరణలను నోటిఫై చేసిన సీబీడీటీ

Posted On: 17 OCT 2024 2:55PM by PIB Hyderabad

ఆదాయపు పన్ను నియమావళిలో కొన్ని సవరణలను ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ మండలి (సీబీడీటీ) ప్రకటించింది. ఈ సవరణలు ఉద్యోగుల జీతాలలో నుంచి వసూలు చేసిన టీసీఎస్ ను/ లేదా వారికి అమలుచేసిన టీడీఎస్ ను తిరిగి జమ చేయాలని కోరేందుకు సంబంధించిన నియమాలను సరళం చేయడంతో పాటు, చిన్న వయసు పిల్లలకు వర్తింప చేసిన టీసీఎస్ ను  తల్లికి/తండ్రికి తిరిగి ఇవ్వాలని కోరేందుకు అనుమతిని ఇస్తున్నటువంటి సవరణలు.  

దీని కోసం ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 192 లో సబ్-సెక్షన్ (2బీ)ని  సవరించారు.  ఉద్యోగుల జీతంలో పన్ను తగ్గింపునకు వర్తించేలా చాప్టర్ XVII-B లేదా చాప్టర్ XVII-BB లోని నిబంధనల ప్రకారం పన్నును విధించే, లేదా మూలం (సోర్స్)లో పన్నును సేకరించేలా ఫైనాన్స్ (నంబర్ 2) యాక్ట్, 2024 (FA (No. 2)) ద్వారా సవరణను తెచ్చారు.

ఆదాయపు పన్ను నియమాలు, 1962 లో (‘నియమాలు’) ఫారమ్ నంబర్ 12బీఏఏ ను పరిచయం చేస్తూ, ఇంకొక సవరణను తీసుకు వచ్చారు.  ఇది చట్టంలోని 192 సెక్షన్ లో సబ్ సెక్షన్ (2బి) ప్రకారం చూపవలసిన వివరాల నిర్దిష్ట స్టేట్ మెంట్ గా ఉంటుంది. ఈ వివరాలను ఆదాయపు పన్ను నియమాలు, 1962 లోని సెక్షన్ 192 సబ్- సెక్షన్ (1) లో భాగంగా చెల్లింపులు జరపవలసిన వ్యక్తులు వారి యాజమాన్య సంస్థలకు అందించవలసి ఉంటుంది.  ఈ వివరాల ఆధారంగా యాజమాన్య సంస్థ తన వంతుగా జీతంలో టీడీఎస్ ను విధించాల్సి ఉంటుంది.

తల్లి లేదా తండ్రి ఆదాయంతో వారి మైనర్ సంతానం ఆదాయాన్ని కలిపి పన్ను లెక్కించే కేసులలో సంతానం తరఫున టీసీఎస్ ను వాపసు ఇవ్వాలని కోరే తల్లి కి లేదా తండ్రికి అలా వసూలు చేసిన మొత్తాన్ని జమ చేయడానికి అనుమతిస్తూ పైన ప్రస్తావించిన చట్టం లోని 206సీ సెక్షన్ సబ్-సెక్షన్ (4) ను కూడా సవరించారు.

పైన ప్రస్తావించిన నోటిఫికేషన్ లను  www.incometaxindia.gov.in   లో చూడవచ్చు.

 

 

***


(Release ID: 2066022) Visitor Counter : 49