రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ భద్రతా దళం 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీర సైనికుల సేవలకు కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రశంస
Posted On:
16 OCT 2024 11:37AM by PIB Hyderabad
ఈ రోజు జాతీయ భద్రతా దళం 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీర సైనికుల సేవలు, నిబద్ధతను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రశంసించారు.
‘‘జాతీయ భద్రతా దళం 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీర సైనికుల శౌర్యం, అంకితభావం, అచంచలమైన స్ఫూర్తికిదే మా వందనం. వారు చేస్తున్న ఎనలేని కృషి దేశ క్షేమానికి, భద్రతకు హామీ ఇస్తుంది. అన్ని రకాల ముప్పుల నుంచి దేశాన్ని కాపాడేందుకు వారు చేస్తున్న సేవలు, నిబద్ధతను గౌరవిస్తాం. జైహింద్’’ అని ఎక్స్ లో శ్రీ గడ్కరీ పోస్ట్ చేశారు.
(Release ID: 2065372)
Visitor Counter : 44