సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అభిధమ్మ దివస్, పాళీని ప్రాచీన భాషగా గుర్తించిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Posted On: 15 OCT 2024 4:37PM by PIB Hyderabad

అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీభాగస్వామ్యంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ అభిధమ్మ దివస్‌‌ను నిర్వహించనుందిపాళీని ప్రాచీన భాషగా భారత ప్రభుత్వం ప్రకటించడాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2024 అక్టోబర్ 17న విజ్ఞాన్ భవన్ (ప్రధాన ప్లీనరీ హాల్)లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారుఅభిమ్మ దివస్ ప్రాముఖ్యతపాళీ భాష ప్రాముఖ్యతబౌద్ధ ధర్మానికి చెందిన మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికిప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రధానమంత్రి మాట్లాడనున్నారుకేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రత్యేక ప్రసంగం చేయనున్నారుకేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలుమైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీకిరణ్ రిజిజు కూడా హాజరవుతున్నారు.

అభిమ్మపై బుద్ధుని బోధనలు మొదట పాళీ భాషలో ఉన్నాయిఇటీవల మరో నాలుగు భాషలతో పాటు పాళీని ప్రాచీన భాషగా గుర్తించడంతో ఈ సంవత్సరం అభిమ్మ దివస్ వేడుకలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

33 
దేవీ దేవతల (తవతింస-దేవలోకంసన్నిధి నుంచి బుద్ధ భగవానుడు సంకస్సియాకు వచ్చినందుకు గుర్తుగా అభిమ్మ దివస్‌ను జరుపుకుంటారుసంకస్సియా అనేది ఉత్తర‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని ప్రస్తుత సంకిసా బసంతపూర్ఈ చరిత్రాత్మక ఘట్టానికి శాశ్వత చిహ్నమైన అశోక స్తంభం ఇక్కడే ఉంది. పాళీ గ్రంథాల ప్రకారం బుద్ధుడు మొదట అభిమ్మను తన తల్లి సారథ్యంలోని తవతింస స్వర్గంలోని దేవతలకు బోధించాడుతిరిగి భూలోకానికి వచ్చిన తర్వాత తన శిష్యుడైన సారిపుత్తుడికి ఈ సందేశాన్ని తెలియజేశాడుఈ పవిత్రమైన రోజు వర్ష ముగింపు (మొదటి)(రెయినీ రిట్రీట్), పావరణ ఉత్సవంతో కలిసి వస్తుంది.

ఈ కార్యక్రమంలో "భారతదేశ ప్రాచీన భాషగా పాళీ ప్రాముఖ్యత"పై ప్రత్యేక చర్చ ఉంటుంది. గౌరవనీయ బౌద్ధ బిక్కులచే ధర్మశాస్త్ర మాతిక మార్గం (పాలి ఉచ్చరణకూడా ఉంటుంది.

సాంకేతిక కార్యక్రమంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ మహాబోధి మైత్రి మహామండల్ చైర్మన్ మోస్ట్ వెన్ పాణ్యరఖిత ధర్మ బోధనలు చేయనున్నారురెండు అకడమిక్ సెషన్లలో '21వ శతాబ్దంలో అభిమ్మ ప్రాముఖ్యత', 'పాళీ భాష ఆవిర్భావంసమకాలీన కాలంలో దాని పాత్రఅనే అంశాలపై విశిష్ఠమైన పత్రాలను ప్రదర్శించనున్నారు


 

అంతర్జాతీయ అభిధమ్మ దివస్‌కు సుమారు 1000 మంది ప్రతినిధులు వస్తారని భావిస్తున్నారుఈ కార్యక్రమానికి 10కి పైగా దేశాల రాయబారులుహైకమిషనర్లు హాజరుకానున్నారుభారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి బౌద్ధ ధర్మంపై భారీగా యువ నిపుణులతో పాటు 14 దేశాల నుంచి ప్రసిద్ధ విద్యావేత్తలుబౌద్ధ భిక్షువులు పాల్గొంటారుబౌద్ధ బోధనల పట్ల యువతరానికి పెరుగుతున్న ఆసక్తిని ఇది తెలియజేస్తుంది.

 

***



(Release ID: 2065190) Visitor Counter : 20