రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మలబార్-2024 సముద్ర విన్యాసాల అధ్యాయం

Posted On: 15 OCT 2024 5:09PM by PIB Hyderabad

మలబార్ విన్యాసాలు’ పేరిట వివిధ దేశాల ఉమ్మడి నౌకాదళ విన్యాసాల సముద్రప్రాంత దశ అక్టోబర్ 14న విశాఖపట్నంలో ప్రారంభమయ్యింది.

బంగాళాఖాతంలో జరుగుతున్న విన్యాసాల్లో భాగంగా- ఆస్ట్రేలియాభారత్జపాన్అమెరికా దేశాలకు చెందిన యుద్ధనౌకలూహెలికాప్టర్లూసుదూరప్రాంతాల గస్తీ విమానాలూ చక్కని సమ్మేళనంతో కూడిన అత్యున్నత స్థాయి కౌశలాన్ని ప్రదర్శించాయి.

ప్రదర్శనలో భాగంగా- నీటిలోనేలపైనింగిల్లో వివిధ దేశాల దళాలుసముద్ర యుద్ధ ఘట్టాలను ఆవిష్కరించే అనేక విన్యాసాలను ప్రదర్శిస్తాయిసంక్లిష్టమైన ఈ విన్యాసాలు వివిధ దళాల మధ్య అవగాహననూసమన్వయాన్నీ పెంపొందించిసంయుక్త దళంగా రూపుదిద్దుకునేందుకు దోహదపడతాయిసముద్రజలాల్లో జరిగే విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన జలాంతర్గాములు సహాభాగస్వామ్య దేశాల ప్రత్యేక దళాల సంయుక్త ప్రదర్శనలూ ఉంటాయి.

ఈ దశ విన్యాసాలు భాగస్వామ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసిప్రాదేశిక భద్రతకూఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు దారితీయగలవని భావిస్తున్నారుఅక్టోబర్ 18న సముద్ర విన్యాసాల దశ ముగింపుతో, ‘మలబార్ 2024’ ముగుస్తుంది.

 

***


(Release ID: 2065167) Visitor Counter : 78


Read this release in: English , Urdu , Marathi , Hindi