రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత తీరరక్షక దళం 26వ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిన డీజీ పరమేశ్ శివమణి

Posted On: 15 OCT 2024 11:13AM by PIB Hyderabad

భారత తీరరక్షక దళం 26వ డైరెక్టర్ జనరల్ గా డీజీ పరమేశ్ శివమణి బాధ్యతలు స్వీకరించారుమూడున్నర దశాబ్దాల ఉద్యోగ జీవితంలో ఫ్లాగ్ ఆఫీసర్ శివమణి అటు తీరప్రాంతాల్లోఇటు నీటిపైవివిధ హోదాల్లో అత్యున్నత స్థాయి సేవలందించారు.

నౌకాయానంనిర్దేశనాల్లో విశేష ప్రతిభ కలిగిన డీజీ పరమేశ్ శివమణి... భారత తీరప్రాంత రక్షకదళానికి చెందిన అత్యాధునిక గస్తీ నౌక సమర్, ‘విష్వస్త్’ సహా అన్ని భారీ నౌకలకు నేతృత్వం వహించారున్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కాలేజ్వెలింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీల్లో విద్యనభ్యసించిన ఆయనతూర్పుపశ్చిమ ప్రాంతాల కోస్ట్ గార్డుల్లో అత్యున్నత స్థాయి అధికారిగాఈస్టర్న్ సీబోర్డ్ కోస్ట్ గార్డ్ కమాండర్ గా సైతం సేవలందించారు.

2022 సెప్టెంబర్ లో అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన పరమేశ్ శివమణిఢిల్లీలోని తీరరక్షక దళ కార్యాలయానికి బదిలీ అయ్యారు. 2024 లో ఆయన కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు.

2022 సెప్టెంబర్-2024 ఆగస్ట్ మధ్య కాలంలో కోట్లాది రూపాయలు విలువ చేసే మాదకద్రవ్యాలూబంగారం పట్టివేతతీవ్రమైన తుఫాన్లలో చిక్కుకున్న నావికుల రక్షణవిదేశీ తీరరక్షక దళాలతో సంయుక్త సైనిక విన్యాసాలూఅడవి జంతువుల అక్రమ వేట నిరోధంతుఫాన్లుప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవతా సహాయంతీరప్రాంత భద్రతా చర్యల నిర్వహణల్లో భాగమై.... అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు.

అత్యుత్తమ స్థాయి సేవలందించినందుకు గుర్తింపుగా 2014 లో తత్రక్షక్’ పతకం2019 లో రాష్ట్రపతి తత్రక్షక్’ పతకాలను అందుకున్నారు. 2012లో డీజీ కోస్ట్ గార్డ్ పురస్కారం2009లో తూర్పు ప్రాంత ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ పురస్కారాన్నీ అందుకున్నారు.

 

***



(Release ID: 2065156) Visitor Counter : 16