మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువ సంగమ్ (అయిదో దశ) లో పాల్గొనడానికి ఆన్‌లైన్ నమోదులు మొదలు రిజిస్ట్రేషన్లను 2024 అక్టోబరు 21 వరకు స్వీకరిస్తారు


యువ సంగమ్ వివిధ దశల్లోని 114 యాత్రల్లో దేశం నలుమూలల నుంచి

4790 మందికి పైగా యువత పాలుపంచుకొన్నారు

Posted On: 10 OCT 2024 4:25PM by PIB Hyderabad

ఏక్ భారత్శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్‌బీ)లో భాగంగా నిర్వహిస్తున్న ‘యువ సంగమ్’ అయిదో దశలో పాలుపంచుకోవడానికి పేర్లు నమోదు చేసుకునేందుకు ఓ పోర్టల్ ను విద్యాశాఖ ఈ రోజు ప్రారంభించింది. దేశంలో వివిధ రాష్ట్రాలకేంద్రపాలిత ప్రాంతాల యువతీ యువకుల మధ్య బంధాన్ని బలపరచాలన్న ధ్యేయంతో భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే యువ సంగమ్. 2023 లో ప్రారంభించిన ఈ విశిష్ట కార్యక్రమంలో రాబోయే దశలో 18-3ఏళ్ళ మధ్య ఉన్న యువతీ యువకులుప్రధానంగా విద్యార్థినీ విద్యార్థులుఎన్ఎస్ఎస్ఎన్‌వైకేఎస్ స్వయంసేవ కార్యకర్తలుఉద్యోగులుస్వయం ఉపాధిని పొందుతున్నవారుతదితరులు పాల్గొనేందుకు వారి పేర్లను యువ సంగమ్ పోర్టల్ మాధ్యమం ద్వారా నమోదు చేసుకోవచ్చురిజిస్ట్రేషన్లను 2024 అక్టోబరు 21 వరకు స్వీకరిస్తారుమరింత సమాచారం కోసం https://ebsb.aicte-india.org/  అన్న వెబ్ చిరునామాను సంప్రదించవచ్చు.


 

సర్దార్ వల్లభ్‌ భాయి పటేల్ జయంతిని స్మరించుకోవడానికి 2015 అక్టోబరు 31న రాష్ట్రీయ ఏకతా దివస్’ ను నిర్వహించిన సందర్భంగా విభిన్న ప్రాంతాల ప్రజల మధ్య దీర్ఘకాలికవ్యవస్థాగత సాంస్కృతిక బంధాన్ని ఏర్పరచాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావిస్తున్నారుఈ ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చేందుకు ఏక్ భారత్శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్ బీ)ని  2016అక్టోబరు 31న ప్రారంభించారు. ‘ఏక్ భారత్శ్రేష్ఠ భారత్’ ఏ విధంగా ఆరంభం అయిందీఏ రూపాలలో పురోగమిస్తున్నదీ ఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ప్రత్యేక ప్రచారోద్యమాల తీరుతెన్నులను గురించిన సమాచారం ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉంచిన పుస్తకం (https://ekbharat.gov.in/JourneySoFarCampaign/index.html)లో అందుబాటులో ఉంది.

ఈబీఎస్ బీలో భాగంగా మొదలు పెట్టిన యువ సంగమ్ పాంచ్ ప్రాణ్ లలోని రెండు తత్వాలను ప్రజల లోకి తీసుకు పోతుందిఏకత్వంలో ఉన్న శక్తివారసత్వాన్ని చూసుకొని గర్వించడం అన్నదే ఆ రెండు తత్వాలు. 2020 లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో కీలక ఇతివృత్తాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.  భారతదేశపు సుసంపన్న భరిత వైవిధ్యానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవంలోకి తెచ్చుకోవడంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతున్నదిఇది ఒక నిరంతర విద్యసాంస్కృతిక అనుభూతుల  సమాహారం.  దీనిలో పాల్గొనేవారు జీవనం తాలూకు వివిధ పార్శ్వాలను క్షుణ్ణంగా గ్రహించడంప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ నైసర్గిక ఆకృతులుఅభివృద్ధి చెందిన స్థలాలుఇంజినీరింగుకువాస్తు కళకు సంబంధించిన అద్భుతాలుఇటీవలి కార్యసాధనలుఆతిథ్యాన్ని ఇచ్చే రాష్ట్రంలోకేంద్ర పాలిత ప్రాంతంలో అక్కడి స్థానిక యువతీ యువకులతో మాటామంతీ నెరపిగాఢానుబంధాన్ని ఏర్పరచుకొనే అవకాశాన్ని అందుకొంటారు.

యువ సంగమ్ లో అయిదో దశ కోసం భారతదేశమంతటి నుంచి 20 ప్రముఖ సంస్థలను గుర్తించారుఆయా రాష్ట్రాల నుంచికేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పాల్గొనే వారు వారి రాష్ట్రం తాలూకుకేంద్ర పాలిత ప్రాంతం తాలూకు నోడల్ ఉన్నత విద్య సంస్థ (హెచ్ ఈఐ)ల నాయకత్వంలో వారికి జతగా ఎంపిక చేసిన రాష్ట్రాన్ని గానికేంద్రపాలిత ప్రాంతాన్ని గాని సందర్శిస్తారు.  

జతలుగా గుర్తించిన రాష్ట్రాలు: 

1.    మహారాష్ట్ర ఒడిశా

       2.   హర్యనా మధ్య ప్రదేశ్

       3. జార్ఖండ్ ఉత్తరాఖండ్

       4.   జమ్మూకాశ్మీర్ తమిళ నాడు

       5.   ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర్ ప్రదేశ్

       6.   బీహార్ కర్నాటక

      7.   గుజరాత్ కేరళ

      8.   తెలంగాణ హిమాచల్ ప్రదేశ్

     9.   అస్సామ్ ఛత్తీస్‌గఢ్

    10.   రాజస్థాన్ పశ్చిమ బెంగాల్

యువ సంగమ్ యాత్రలు కొనసాగే కాలంలోఅయిదు విస్తృత రంగాలకు (హిందీ లో పీ లుకు చెందిన (వీటిలో పర్యటనపరంపరప్రగతిపరస్పర సంపర్కం (పీపుల్టుపీపుల్ కనెక్ట్)ఇంకా ప్రౌద్యోగికీ అంటే సాంకేతిక విజ్ఞానం రంగాలు ఉన్నాయి) బహుళ పార్శ్వాలను గురించి అయిదు నుండి ఏడు రోజులలో (యాత్ర సాగే రోజులు మినహాయించిసందర్శక బృందం సభ్యులకు వివరిస్తారుయువ సంగమ్ లో ఇంతవరకు ముగిసిన దశలలో ఉత్సాహం వెల్లువెత్తిందిఆఖరి దశలో రిజిస్ట్రేషన్లు 44,000కు మించాయిఇంతవరకుదేశం నలుమూలల నుంచి 4,795 మంది యువతీ యువకులు యువ సంగమ్ వివిధ దశలలో భాగంగా (2022వ సంవత్సరంలో చేపట్టిన ప్రయోగాత్మక దశ కూడా కలుపుకొని) 114 యాత్రలలో పాల్గొన్నారు.

సంపూర్ణ ప్రభుత్వం’ దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తున్న యువ సంగమ్ ఉద్యమాన్ని  దీనిలో భాగస్వామ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖలువిభాగాలుఏజెన్సీలురాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తూ వస్తున్నారు.  వీటిలో హోం శాఖసాంస్కృతిక శాఖపర్యటన శాఖయువజన వ్యవహారాలు క్రీడల శాఖసమాచార ప్రసార శాఖఈశాన్య ప్రాంత అభివృద్ధి విభాగం (డీఓఎన్ఈఆర్)తో పాటు రైల్వేలు కలిసి ఉన్నాయిప్రతి ఆసక్తిదారుకూ వారివైన భూమికలుబాధ్యతలంటూ ఉన్నాయి.  ప్రతినిధుల ఎంపికయువ సంగమ్ యాత్రలను చివరికంటా నిర్వహించే బాధ్యత ఉన్నత విద్య సంస్థలదే (జాబితా అనుబంధం లో ఉంది.); ఇవి ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోతుంటాయి.


 


 

అనుబంధం

యువ సంగమ్ అయిదో దశ కోసం జతలుగా గుర్తించిన రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలుఉన్నత విద్య సంస్థలు. 

 

క్ర.సం.

ఒకటో రాష్ట్రం

ఉన్నత విద్య సంస్థ పేరు

రెండో రాష్ట్రం

ఉన్నత విద్య సంస్థ పేరు

1

మహారాష్ట్ర

ఐఐఎమ్ ముంబయి

ఒడిశా

ఐఐటీ భువనేశ్వర్

2

హర్యానా

సీయూ హరియాణా

మధ్య ప్రదేశ్

ఐజీఎన్‌టీయూ అమర్‌కంటక్

3

జార్ఖండ్

ఐఐటీ ధన్ బాద్

ఉత్తరాఖండ్

ఐఐటీ రూడ్ కీ

4

జమ్మూకాశ్మీర్

ఐఐఎమ్ జమ్ము

తమిళనాడు

ఎన్ఐటీటీటీఆర్ చెన్నై

5

ఆంధ్ర ప్రదేశ్

ఎస్ పీఏవిజయవాడ

ఉత్తర్ ప్రదేశ్

ఐఐటీ అలహాబాద్

6

బీహార్

సీయూ ఆఫ్ బిహార్గయ

కర్ణాటక

ఐఐటీ ధారవాడ

7

గుజరాత్

ఐఐటీ గాంధీనగర్

కేరళ

ఐఐటీ కొట్టాయం

8

తెలంగాణ

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ,

హైదరాబాద్

హిమాచల్ ప్రదేశ్

ఎన్ఐటీహమీర్ పుర్

9

అస్సాం

అసోమ్ యూనివర్సిటీసిల్ చర్

ఛత్తీస్ గఢ్

ఐఐఎమ్ రాయ్ పుర్

10

రాజస్థాన్

ఐఐటీ జోధ్ పుర్

పశ్చిమ బెంగాల్

ఐఐఈఎస్ టీశిబ్ పుర్

 

 

***


(Release ID: 2064088) Visitor Counter : 156