రక్షణ మంత్రిత్వ శాఖ
ఎల్ఎస్ఏఎమ్ 12 (యార్డ్ 80) జల ప్రవేశం
प्रविष्टि तिथि:
11 OCT 2024 10:08AM by PIB Hyderabad
భారతీయ నౌకాదళం కోసం విశాఖపట్నం లోని ఎమ్ఎస్ఎమ్ఇ షిప్ యార్డ్- మెసర్స్ సీకాన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఎస్ఈపీ) నిర్మించిన పెద్ద నావ (బార్జ్)- ఎల్ఎస్ఏఎమ్ 12 (యార్డ్ 80)ని జల ప్రవేశం చేసింది. ‘మిసైల్ కమ్ ఎమ్యునిషన్ బార్జ్ ప్రాజెక్టులోని ఎనిమిది నావల్లో ఇది ఆరోది. నిన్న మహారాష్ట్రలోని మిరాభయందర్ ప్రాంతంలో గల- వినాయగా మెరైన్ పెట్రో సంస్థ- జల ప్రవేశ ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నావ జల ప్రవేశ కార్యక్రమానికి కొమోడర్ ఎమ్.వీ. రాజ్ కృష్ణ, సీఒవై (ఎమ్బీఐ) అధ్యక్షత వహించారు.
క్షిపణి, మందుగుండు సామానుల రవాణాకు ఉద్దేశించిన మొత్తం ఎనిమిది నావల నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ, ఎస్ఈసీఓఎన్ ఇంజినీరింగ్ ప్రాజెక్టుల సంస్థ 2021 ఫిబ్రవరి 19న ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ నావలు భారతీయ నౌకాదళ వేదికల వద్ద రేవు కట్టలు, ఇంకా ఔటర్ హార్బర్లలో రవాణాను, సరకులను ఎక్కించడాన్ని, సరకులను దించడాన్ని సులభతరం చేసే సేవలను అందించడం ద్వారా భారతీయ నౌకాదళానికి నిర్వహణ సంబంధిత బాధ్యతలను పూర్తి చేయడంలో ఈ తరహా నావలు తోడ్పడనున్నాయి.
ఈ నావలను ఇండియన్ రిజిస్ట్రర్ ఆఫ్ షిపింగ్ లోని సంబంధిత సముద్ర చట్టాలు, నిబంధనలను అనుసరిస్తూ దేశీయంగా తీర్చిదిద్ది ఈ నావల్ని తయారు చేస్తున్నారు. నావ నమూనా తయారీ దశలోనే విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. భారత ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతమైందని చెప్పడానికి ఈ నావలు ఒక ఉదాహరణగా నిలుస్తాయి.
(4)1NB1.jpeg)
(4)8L7V.JPG)
(1)35XZ.JPG)
(रिलीज़ आईडी: 2064087)
आगंतुक पटल : 144