భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

పతంజలి ఫూడ్స్ చేతికి ‘పతంజలి ఆయుర్వేద’కు చెందిన హెచ్ పీసీ: సీసీఐ ఆమోదం

Posted On: 09 OCT 2024 12:01PM by PIB Hyderabad

పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ (పీఏఎల్)కు చెందిన హోం అండ్ పర్సనల్ కేర్ (హెచ్‌పీసీ) డివిజనును పతంజలి ఫూడ్స్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్)లో కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదించింది. దీని ప్రకారం- పీఏఎల్ లోని హెచ్‌పీసీ బిజినెస్ డివిజన్ (ఆహారేతర వ్యాపారాలు)ను పీఎఫ్ఎల్ తనలో కలుపుకుంటుంది.

 

పీఎఫ్ఎల్ నూనె గింజల శుద్ధి, ఖాద్య సంబంధిత వినియోగం కోసం ముడి నూనెను శుద్ధి చేయడం, ఆయిల్ మీల్ ను ఉత్పత్తి చేయడం, సోయా నుంచి ఆహార ప్రధాన ఉత్పాదనలను రూపొందించడం, ఇంకా మరిన్ని ఆహార శుద్ధి ప్రక్రియలను అవలంబిస్తూ ఇతర విలువ జోడించిన ఉత్పాదనలను తయారు చేసే కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. ఈ వ్యాపార సంస్థ త్వరగా అమ్ముడు పోయే వినియోగ వస్తువుల, ఆరోగ్య సంబంధిత సరకుల వ్యాపారాన్ని కూడా చేస్తోంది. వీటిలో ప్రధానంగా ఆహార పదార్థాలు, బిస్కెట్లు, న్యూట్రాస్యూటికల్ ఉత్పాదనలు ఉన్నాయి. వీటికి తోడు పవన శక్తి నుంచి విద్యుత్తు ఉత్పాదన, ఇంకా వివిధ ఉత్పాదనల వ్యాపారంలో కూడా పీఎఫ్ఎల్ పాలుపంచుకొంటోంది.

 

పీఏఎల్ ఆయుర్వేద మందుల తయారీ, వ్యాపారం, ప్యాకింగ్, ఇంకా లేబిలింగ్ సంబంధిత వ్యాపారాలను (మూలికలతో కూడి ఉండే, ఖనిజాధారిత ప్రక్రియలు, మూలికలను, ఖనిజాలను సమ్మిళిత పరిచే ప్రక్రియల ద్వారా) నిర్వహిస్తోంది. 

ఇంకా గృహ సంరక్షణలో ఉపయోగపడే వస్తువులు, వ్యక్తిగత సంరక్షణకు ఉపయోగపడే వస్తువులు, పాల పదార్థాల వ్యాపారం, పెద్ద ఎత్తున బియ్యం వ్యాపారం వంటివి చేస్తోంది. పిఎఎల్ అనేక విధాలైన ఆయుర్వేద ఉత్పాదనలను, వ్యక్తిగత సంరక్షణతో పాటు హెల్త్ సప్లిమెంట్స్ ను కూడా అందిస్తోంది.

 

హెచ్‌పీసీ డివిజన్ వ్యాపార కార్యకలాపాలలో కేశ సంరక్షణ, చర్మ సంరక్షణ, దంత సంరక్షణ విభాగాలతో పాటు గృహ సంరక్షణ విభాగాల సంబంధిత ఉత్పాదనలు కలసి ఉన్నాయి.

 

సమగ్ర ఉత్తర్వును కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్వరలో జారీ చేయనుంది.

****


(Release ID: 2063442) Visitor Counter : 49