ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024లో ట్రాకోమాను ప్రజారోగ్య సమస్యగా భావించి నిర్మూలించిన భారత్... ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఒ).


ఆగ్నేయాసియా ప్రాంతంలో ఈ మైలురాయిని అందుకున్న మూడో దేశంగా భారత్

Posted On: 08 OCT 2024 9:01PM by PIB Hyderabad

2024 లో ట్రాకోమాను ప్రజారోగ్య సమస్యగా భావించి భారత ప్రభుత్వం నిర్మూలించిందని, ఆగ్నేయాసియా ప్రాంతంలో ఈ మైలురాయిని సాధించిన మూడో దేశంగా నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతం, ప్రాంతీయ కమిటీ సమావేశంలో ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి మిషన్ డైరెక్టర్ శ్రీమతి ఆరాధన పట్నాయక్ కు డబ్ల్యుహెచ్ఒ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి సైమా వాజేద్ అందజేశారు.


ట్రాకోమా అనేది కళ్ళను ప్రభావితం చేసే బాక్టీరియా సంక్రమణ వ్యాధి. ఇది క్లామిడియా ట్రాకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ట్రాకోమా అంటువ్యాధి కిందకు వస్తుంది. ఇది సోకిన వ్యక్తుల కళ్ళు, కనురెప్పలు, ముక్కు లేదా గొంతు స్రావాల ద్వారా వ్యాపిస్తుంది, చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది.

ట్రాకోమాను నిర్లక్ష్యం చేసిన ఉష్ణమండల వ్యాధిగా డబ్ల్యుహెచ్ఒ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ల మంది ట్రాకోమాతో బాధపడుతున్నారని, వారిలో 6 మిలియన్ల మంది అంధత్వం లేదా దృష్టి లోపంతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనాలు సూచిస్తున్నాయి.

1950-60 మధ్య కాలంలో దేశంలో అంధత్వానికి ట్రాకోమా ప్రధాన కారణం. భారత ప్రభుత్వం 1963 లో జాతీయ ట్రాకోమా నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  తరువాత ట్రాకోమా నియంత్రణ ప్రయత్నాలను భారతదేశ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం (నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్ నెస్ - ఎన్ పిసిబి) లో విలీనం చేశారు.

1971 లో, ట్రాకోమా కారణంగా అంధత్వం 5% ఉండగా, నేడు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్ నెస్ అండ్ విజువల్ ఇంపెయిర్మెంట్ (ఎన్ పిసిబివిఐ) కింద వివిధ జోక్యాల కారణంగా, ఇది 1% కంటే తక్కువకు పడిపోయింది.  డబ్ల్యూహెచ్ఓ దేశమంతటా సేఫ్ (ఎస్ ఎ ఎఫ్ ఇ) వ్యూహాన్ని అమలు చేసింది, సేఫ్ లో ఎస్ అంటే సర్జరీ (శస్త్రచికిత్స) ,  ఎ అంటే యాంటీబయటిక్స్ వాడకం, ఎఫ్ అంటే ముఖశుభ్రత,ఇ అంటే పర్యావరణ శుభ్రతను స్వీకరించడాన్ని సూచిస్తుంది. ఫలితంగా 2017లో భారత్ ఇన్ఫెక్టివ్ ట్రాకోమా నుంచి విముక్తి పొందింది.అయినా , 2019 నుంచి 2024 వరకు భారతదేశంలోని అన్ని జిల్లాల్లో ట్రాకోమా కేసులపై నిఘా కొనసాగింది.

2021-24 నుండి ఎన్ పి సి బివిఐ కింద దేశంలోని 200 వ్యాధి ప్రభావిత  జిల్లాల్లో నేషనల్ ట్రాకోమాటస్ ట్రిచియాసిస్ (టిటి మాత్రమే) సర్వే ను నిర్వహించారు. ఇది భారతదేశం ట్రాకోమాను ప్రజారోగ్య సమస్యగా పరిష్కరించినట్టు ప్రకటించడానికి డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ఆదేశం.

అన్ని నివేదికలను ఎన్ పిసిబివిఐ బృందం నిర్దిష్ట పత్రం రూపంలో  సంకలనం చేసి తుది పరిశీలన కోసం డబ్ల్యు హెచ్ ఒ భారత కార్యాలయంతో పంచుకుంది. ట్రాకోమాకు వ్యతిరేకంగా సంవత్సరాల తరబడి పోరాడిన తరువాత, చివరికి డబ్ల్యూహెచ్ఓ భారతదేశం ప్రజారోగ్య సమస్యగా  ట్రాకోమాను నిర్మూలించినట్టు ప్రకటించింది.


 

****


(Release ID: 2063341) Visitor Counter : 153