రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారంపై భారత, జర్మనీ రక్షణ మంత్రుల మధ్య టెలిఫోన్ సంభాషణ
Posted On:
08 OCT 2024 2:22PM by PIB Hyderabad
జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్‌తో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు (అక్టోబర్ 8) టెలిఫోన్ లో సంభాషించారు. రక్షణ రంగంలోని వాయుసేన, నౌకాదళ విభాగాల్లో కొనసాగుతున్న సంయుక్త కార్యకలాపాలపై క్లుప్తంగా సమీక్షించారు.
రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు, బలమైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ఉన్న మార్గాలను ఇద్దరు మంత్రులు చర్చించారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన ఒప్పందాలు, సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టులకు సమగ్ర రూపం తీసుకొచ్చేందుకుగాను త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించారు. భారత-జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణను కీలకమైన అంశంగా మార్చే లక్ష్యంతో ఈ సమావేశం జరగనుంది.
***
(Release ID: 2063210)
Visitor Counter : 70