రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాసిక్‌లో జరిగిన 40వ ఆర్పీఎఫ్ స్థాపనా దినోత్సవ కవాతులో పాల్గొన్న


రైల్వే మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందికి పురస్కారాల ప్రదానం

మహిళా సిబ్బందికి ప్రాధాన్యమిస్తూ ఆర్పీఎఫ్ జోనల్ శిక్షణ కేంద్రాలను మెరుగుపరిచేందుకు రూ.35 కోట్ల నిధుల విడుదల

Posted On: 04 OCT 2024 4:07PM by PIB Hyderabad

రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) 40వ వ్యవస్థాపనా దినోత్సవ కవాతులో కేంద్ర రైల్వేలుసమాచార ప్రసారాలుఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారునాసిక్‌లోని ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో ఈ కవాతు జరిగిందిఈ కార్యక్రమంలో 2023-24 సంవత్సరానికి గాను అత్యుత్తమ సేవలు అందించి ధైర్యసాహసాలతో ప్రయాణికుల ప్రాణాలను కాపాడి జీవన్ రక్షా మెడల్ అందుకున్న 33 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని కేంద్రమంత్రి సత్కరించారుజాతీయ రైల్వే వ్యవస్థకు భద్రత కల్పించడంలో వారు చేసిన సేవలను ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయిఅలాగే ఆర్పీఎఫ్ సహోద్యోగుల్లో స్ఫూర్తిని నింపి బాధ్యతలకు అంకితమయ్యేందుకు తోడ్పడతాయి.

భద్రతా ప్రమాణాలను పాటించేందుకు ఆధునిక టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ను మంత్రి మెచ్చుకున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బందికి రక్షణ కల్పించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లుమెరుగైన హెల్మెట్లు సహా అధునాతన భద్రతా పరికరాలు అందించనున్నట్టు ఆయన తెలిపారు ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రాలను ఆధునికీకరించేందుకు రూ.35 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారువీటితో మహిళా సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తారుదీనికి అదనంగా తమిళనాడులోని ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ జోనల్ శిక్షణ కేంద్రానికి మరో రూ.5.5 కోట్లు కేటాయించారుప్రత్యేక శిక్షణ వసతులను మెరుగుపరిచేందుకు ఈ నిధులు వినియోగిస్తారు.

క్రమశిక్షణనిబద్ధతను తెలియజేస్తూ సాగిన ఆర్పీఎఫ్ పరేడ్ లో కేంద్రమంత్రి గౌరవ వందనం స్వీకరించారుఈ కార్యక్రమంలో భాగంగా సాంగ్యాన్’ మొబైల్ అప్లికేషన్ హిందీ ఎడిషన్‌ను ప్రారంభించారుఇది ఆర్పీఎఫ్‌లో అంతర్గతంగా సాగే సమాచార ప్రసారాన్ని మెరుగుపరుస్తుందికొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేరచట్టాలపై  ఆర్పీఎఫ్ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు హిందీలో రాసిన ప్రామాణిక పుస్తకాలను విడుదల చేశారు.

భారత రైల్వేల్లో రూపుదిద్దుకుంటున్న కొత్త మార్పులకు మార్గదర్శకత్వం వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి.. శ్రీ వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారుగతేడాది 5300 కి.మీగత పదేళ్లలో 31,000 కి.మీ మేర కొత్త రైల్వే లైన్లను నిర్మించినట్లు మంత్రి వెల్లడించారుఅలాగే పదేళ్లలో 40,000 కి.మీ మేర రైల్వే లైన్లను విద్యుదీకరించామనిగడచిన 60 ఏళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు అని తెలిపారు

వందేభారత్అమృత్ భారత్ తరహా కొత్త తరం రైళ్ల ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైనవేగవంతమైన ప్రయాణాన్ని సరసమైన ధరల్లో అందించడమే భారతీయ రైల్వేల లక్ష్యమని మంత్రి వివరించారుకవచ్ లాంటి అత్యాధునిక సౌకర్యాలతో సురక్షితమైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తామన్నారుప్రజల సౌకర్యార్థం 12,500 జనరల్ కోచ్ లను తయారుచేస్తున్నట్లు తెలిపారు.

ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ మనోజ్ యాదవసెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్భూస్వాల్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ ధరమ్ వీర్ మీనాప్రధాన కార్యాలయంసెంట్రల్ రైల్వేకి చెందిన ఉన్నతాధికారులు ఈ 40వ వ్యవస్థాపనా దినోత్సవ కవాతులో పాల్గొన్నారు

ఆర్పీఎఫ్ సిబ్బందివారి కుటుంబ సభ్యులు ఈ వ్యవస్థాపన దినోత్సవాన్ని నిర్వహిస్తారుప్రజా శ్రేయస్సు పట్ల తమ నిబద్ధతను తెలియజేస్తూవారి ఆనందాన్ని పరస్పరం పంచుకునే రోజు ఇదిరైల్వే ఆస్తుల పరిరక్షణ మాత్రమే కాకుండా ప్రయాణికులురైళ్ల భద్రతా బాధ్యతలు కూడా ఆర్పీఎఫ్‌కు అప్పగించారురైల్వే సాయం కోరిన మహిళలుపిల్లలురోగులువృద్ధులుదివ్యాంగులతో సహా అవసరమైన వారికి భద్రత కల్పిస్తుందిరైల్వే ప్రయాణికులకు సురక్షితమైనసౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిచేందుకు ఈ రక్షణ దళం రోజంతా పని విధులు నిర్వర్తిస్తుందిరవాణా భద్రత కల్పించడంఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టడంమానవ అక్రమ రవాణాస్మగ్లింగ్‌తో సహా ఇతర నేరాలపై పోరాడటం, నేరాలను గుర్తించడంలో పోలీసులుఇతర చట్టపరమైన సంస్థలకు తోడ్పడటంశాంతి భద్రతల నిర్వహణ చర్యల్లో భాగం పంచుకోవడం, జాతీయరాష్ట్ర ఎన్నికల సమయాల్లో పటిష్ట భద్రత కల్పించడం తదితరమైన కార్యకలాపాల ద్వారా జాతీయ భధ్రతా వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఆర్పీఎఫ్ మారింది.

నిబద్ధతనిజాయతీతో పనిచేస్తూ  దేశానికిదేశ ప్రజలకు సేవ చేసేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనని తాను అంకితం చేసుకుందిసేవా హీ సంకల్ప్’ విధానాన్ని అవలంబించేందుకు ‘‘యశో లభస్వ (కీర్తిని పొందడంఅనే లోకోక్తి సాధన దిశగా ఆర్పీఎఫ్ అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది.

 

***


(Release ID: 2062276) Visitor Counter : 40