సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0: ఫైళ్ళ వర్గీకరణ, ఏరివేత, చరిత్రాత్మక రికార్డుల సంరక్షణ కార్యక్రమాల తో పరిపాలక సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్ పీజీ) లో ‘అమలు దశ’కు నాందీప్రస్తావన

Posted On: 04 OCT 2024 1:31PM by PIB Hyderabad

ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవస్థ పరంగా ‘స్వచ్ఛత’ను పాటించే కార్యక్రమంతో పాటు చాలా కాలంగా పెండింగు పడ్డ వ్యవహారాలను కనీస స్థాయికి పరిమితం చేయడానికి కేంద్ర మంతి డాక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వంలో ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’ ను పరిపాలన సంబంధి సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం  (డీఏఆర్‌పిీజీ) మొదలుపెట్టింది.

ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0 ను రెండు దశల్లో ఆచరిస్తున్నారు;   ఒకటో దశ సన్నాహక దశ.  దీనిని కిందటి నెలలో 16న ప్రారంభించి, 30న ముగించారు. రెండో దశ అయిన అమలు దశను ఈ నెల 2న చేపట్టారు. ఈ దశను ఈ నెల 31వరకు కొనసాగించనున్నారు.  ఈ కింద ప్రస్తావించిన లక్ష్యాలను ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’లో పూర్తి చేయాలని డీఏఆర్‌పిీజీ సంకల్పించింది.

1.     పింఛన్ ఫిర్యాదు (పిజి) కేసులు – 800

2.   సమీక్ష అవసరపడే రికార్డులు- 4190 ఫైళ్లు

3.     స్వచ్ఛత ఉద్యమాన్ని చేపట్టవలసిన స్థలాలు - 4

4.     సరళీకరించవలసి ఉన్న  నియమాలు/ప్రక్రియలు - 1

‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’ లో అమలు దశను ఆచరణలో పెట్టే ఘట్టాన్ని డీఏఆర్ పీజీ కార్యదర్శి శ్రీ డి. శ్రీనివాస్ ప్రారంభించారు.  ఆయన నిన్న  డీఏఆర్ పీజీ  కార్యాలయంలో అన్నీ పర్యవేక్షించారు.  ఫైళ్ళ నిర్వహణ పద్ధతులను సమర్ధంగా నిర్వహించడానికి సంబంధించిన విధులలో పురోగతి ని కూడా ఆయన పరిశీలించారు.

మెరుగైన రీతిలో  రికార్డుల నిర్వహణ దిశలో ఈ రోజున శ్రీ వి. శ్రీనివాస్  డీఏఆర్ పీజీ లో స్వయంగా కొన్ని ఫైళ్ళ ఏరి వేతలో పాలుపంచుకొన్నారు.  డీఏఆర్ పీజీ   ఉన్నతాధికారులు సైతం ఈ ఫైళ్ళ ఏరివేత కార్యక్రమంలో చురుకుగా పాలుపంచుకొన్నారు. దీనితో కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచే విషయంలో నిబద్ధతకు మద్దతు లభించింది.  డీఏఆర్ పీజీ కూడా ఫైళ్ళ వర్గీకరణ, సంరక్షణ సంబంధిత పనులను సమీక్షించడం ఆరంభించింది.

***



(Release ID: 2062011) Visitor Counter : 7


Read this release in: English , Urdu , Hindi , Tamil