పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సబ్ కీ యోజన సబ్ కా వికాస్’ అభియాన్ లో చురుకుగా


పాలుపంచుకోవాలంటూ దేశంలోని గ్రామీణ ప్రాంత పౌరులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి

సంపూర్ణ అభివృద్ధి లక్ష్య సాధనలో ఏకత్వానికి ప్రాముఖ్యాన్ని ఇద్దాం: కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్;

ప్రజల ప్రణాళిక ప్రచార ఉద్యమంలో ఉత్సాహంగా పాలుపంచుకోండంటూ స్థానికులకు, పంచాయతీ సభ్యులకు, సర్పంచులకు వినతి

పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు (2025-26) లక్ష్యంగా

దేశ వ్యాప్తంగా ప్రజా ప్రణాళిక ప్రచార ఉద్యమం




కిందిస్థాయి నుంచీ ప్రణాళిక రూపకల్పనలో యువకుల ప్రాతినిధ్యం-

ఉన్నత్ భారత్ అభియాన్, పంచాయతీ రాజ్ శాఖల భాగస్వామ్యం


పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో దేశమంతటా 750 గ్రామ పంచాయతులలో ఈ రోజున ప్రత్యేక గ్రామ సభ, పునశ్చరణ/శిక్షణ కార్యక్రమం నిర్వహణ

Posted On: 02 OCT 2024 2:09PM by PIB Hyderabad

దేశమంతటా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నవారికిసంబంధిత వర్గాలకు రాతపూర్వకంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక విజ్ఞప్తి చేశారు.  ‘సబ్ కీ యోజన సబ్ కా వికాస్’ అభియాన్ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ (2024–25)లో చురుకైన పాత్రను పోషించవలసిందిగా ప్రధాని కోరారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి)ని 2025-26 సంవత్సర కాలానికి సిద్ధం చేయడంలో హుషారుగానిబద్ధతతో పాలుపంచుకోండంటూ ప్రధానమంత్రి నిన్నటి రోజున (2024 అక్టోబరు 1ఒక లేఖ విడుదల చేశారు.

వేదోక్తి ‘‘విశ్వం పృష్టం గ్రామే అస్మిన్ అనాతురమ్’’ నుంచి ప్రేరణను పొందుతూ,  స్వయం సమృద్ధియుక్తమైన గ్రామాలనుదీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే గ్రామాలను తీర్చిదిద్దాలనే దృష్టికోణాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ‘‘ఈ విశ్వం ఏ విధంగా అయితే తనలో అన్నింటినీ ఇముడ్చుకొని ఉందోఅలాగే మన పల్లెలు కూడా సమర్థమైనవిగాశక్తియుక్తమైనవిగాసమృద్ధంగా విలసిల్లాలి’’ అనేదే పైన ప్రస్తావించిన వేదోక్తికి అర్థంగ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపివారి వంతు తోడ్పాటు అందించడం ద్వారా ప్రతి ఒక్క పౌరుడుప్రతి ఒక్క పౌరురాలుసంబంధిత వర్గాలకు చెందిన వారు సమర్ధమైన పాత్రను పోషించాలనిగ్రామీణ భారత సంపూర్ణ సుస్థిర అభివృద్ధిలో కేంద్రీయ భూమికను జిపిడిపి పోషిస్తుందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

వృద్ధికిప్రగతికి కేంద్రాలుగా పంచాయతుల రూపురేఖలను తీర్చిదిద్దడంలో  పెద్ద సంఖ్యలో పాల్గొనాలనిఈ కార్యంలో ప్రతి ఒక్కరు వారి వంతు సాయాన్ని అందించాలని ప్రధాన మంత్రి తన సందేశంలో కోరారు.  అందరి దీర్ఘకాలిక ఎదుగుదలకు పూచీ పడాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమం సామూహిక ప్రయాసలతోనే సఫలం కాగలదని ఆయన చెప్పారుఈ సందేశాన్ని దేశంలో మారుమూలలకు చేరేటట్లు చూసి, ‘సబ్‌కీ యోజన సబ్‌కా వికాస్’ అభియాన్ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ లో అందరూ పాలుపంచుకొనేటట్లుగా స్ఫూర్తిని ఇచ్చిఒక బలమైనస్వయం-సమృద్ధియుక్తమైనఅభివృద్ధి చెందినమరింత సమృద్ధితో కూడిన భారతదేశం ఏర్పడడం కోసం చొరవ తీసుకోవాలని  పంచాయతీ రాజ్ సంస్థలకుగ్రామాల స్థానిక సంస్థలకు  పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ మనవి చేసింది.

ఈ ప్రచార ఉద్యమం లక్ష్యాలు.. అభివృద్ధి చెందిన (వికసిత భారత్), స్వయం సమృద్ధియుక్త భారతదేశం (ఆత్మనిర్భర్ భారత్దృష్టి కోణానికి సరిపోలినదిగా ఉన్నాయని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ స్పష్టం చేశారుసంపూర్ణ అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో ఏకత్వానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొంటూ ఈ ప్రచార ఉద్యమంలో ఉత్సాహంతో పాలుపంచుకోండి అంటూ స్థానికులకుపంచాయతీ సభ్యులకుసర్పంచులకు పిలుపునిచ్చారు.  అభివృద్ధి ప్రక్రియలో ప్రతి ఒక్కరి అభిప్రాయంఆలోచనలు ప్రముఖమైనవేనని కేంద్రమంత్రి అన్నారు.  ప్రజాస్వామ్యం పునాదులను బలపరచానికి ‘పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్’ (ప్రజలే ప్రణాళికను రచించే ప్రచార ఉద్యమం - ‘జన్ యోజన అభియాన్’ఒక విశిష్ట ప్రయత్నం అని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పిసింగ్ బఘేల్ అన్నారు.  పౌరులు వారి గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.  ‘వాస్తవిక అవసరాలను తీర్చిగలిగిన ప్రణాళికలను రూపొందించడానికి గ్రామసభలలో క్రియాశీలమైన రీతిన ప్రాతినిధ్యం వహించండి’ అంటూ ఆయన పౌరులను ఉత్సాహపరిచారుసుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్)  తో ఈ ప్రచార ఉద్యమానికి ఉన్న సంబంధాన్ని కూడా కేంద్ర సహాయ మంత్రి ప్రస్తావించారు.  సమగ్ర సమాచారాన్ని అందించడానికి గ్రామ సభలకు హాజరు కావలసిందిగా సూచిస్తూ ముందు వరుస కార్యకర్తలకు సంబంధిత వివిధ విభాగాలతో ఆహ్వానాన్ని అందించిన విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చారు

 ప్రజలే ప్రణాళికను రచించే ప్రచార ఉద్యమం’ (‘జన్ యోజన అభియాన్’ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్)ను 2025-26 సంవత్సరానికి పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల (పీడీపీ స్రూపకల్పన కోసం దేశమంతటా ఈ రోజు (అంటే అక్టోబరు 2)న మొదలుపెట్టారు. కీలకమైన ఈ ప్రచార ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకోవలసిందిగా దేశంలో అన్ని పంచాయతీలతో పాటు సంబంధిత వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ పిలుపునిచ్చింది.  ‘ప్రజలే ప్రణాళికను రచించే ప్రచార ఉద్యమం’ ఒక ముఖ్య కార్యక్రమం; ‘సబ్‌కీ యోజన సబ్‌కా వికాస్’ (‘అందరి అభివృద్ధికోసం అందరూ రూపొందించే ప్రణాళికస్ఫూర్తికి ప్రతీకగా ఇది నిలుస్తోంది. ప్రజాస్వామ్యం పునాదులను పటిష్ట పరచడంగ్రామీణ భారతావనిలో అభివృద్ధి ఫలాలను అందరి చెంతకు చేర్చడాన్ని ప్రోత్సహించడం ఈ ప్రచార ఉద్యమం ధ్యేయం. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రణాళిక రచన ప్రక్రియలో పల్లెల నివాసులు ఒక చురుకైన భూమికను పోషించివారి గ్రామాల భవిష్యత్తుకు రూపురేఖలను తీర్చిదిద్దుకొనేందుకు వారికి ఈ ఉద్యమం శక్తిని సమకూర్చుతుంది.

ఈ ప్రముఖ కార్యక్రమానికి అండదండలను అందించడానికి ఎంతో మంది ఉన్నతాధికారులు ముందుకు వచ్చిప్రజలు దీనిలో పెద్ద ఎత్తున పాలుపంచుకునేలా వారిని ప్రోత్సహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన దృశ్య మాధ్యమ ప్రధానమైన సందేశాలను (https://www.youtube.com/playlist?list=PLr1WFeVzpoLu2lw_Dq-SeCV7vujuKBXDWఅనే వెబ్ చిరునామా ద్వారా ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉంచారు. ఈ సందేశాల ద్వారా ఆయా ఉన్నతాధికారులు  ‘ప్రజలే ప్రణాళికను రచించే ప్రచార ఉద్యమం’ (జన్ యోజన అభియాన్)లో మనస్ఫూర్తిగా పాలుపంచుకోండంటూ ప్రజలకుపంచాయతీలకు ఉద్వేగభరితంగా పిలుపునిచ్చారు.

ఈ ఆశయాన్ని సాధించుదాం అంటూ గళమెత్తిన ఇతర ఉన్నతాధికారులలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ;  త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్డాక్టర్ మాణిక్ సాహాబీహార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కేదార్ ప్రసాద్ గుప్తలు ఉన్నారు.  పంచాయతీలుస్థానికులు చురుకుగా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి ఒక రాతపూర్వక సందేశంలో కోరారు.  పల్లె ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో నాయకుల నిబద్ధత ముఖ్యమని ఈ కార్యక్రమం ప్రత్యేకంగా సూచిస్తోంది.  శ్రీ విష్ణు దేవ్ సాయిభజన్ లాల్ శర్మశ్రీ కేదార్ ప్రసాద్ గుప్త లు  వారి రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్గ్రామ పెద్ద స్థాయిలో మొదలు పెట్టడం గమనించదగ్గది.  ఈ పరిణామం స్థానిక సుపరిపాలనలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని చాటిచెబుతోంది.

ఈ సంవత్సరంలో  ‘అందరి ప్రణాళికఅందరి అభివృద్ది కోసం’ అనే ఉద్యమం అనేక ముఖ్య సంఘటనలను గుర్తుకు తీసుకు వస్తోందివాటిలో భారత గణతంత్రం 75వ సంవత్సరాన్ని స్మరించుకోవడానికి ఈ రోజున (2024 అక్టోబరు 2ప్రత్యేకంగా నిర్వహించిన ‘గ్రామ సభలు’ అనే ఒక విశిష్ట కార్యక్రమం కూడా ఒకటిఆర్థిక సంవత్సరం 2025-26ను దృష్టిలో పెట్టుకొని పంచాయతీరాజ్ అభివృద్ధి  ప్రణాళికల (పీడీపీస్)ను రూపొందించే దిశలో గ్రామ పంచాయతీలను సిద్ధం చేయడమనే అంశంపై ఈ గ్రామ సభలు శ్రద్ధ తీసుకోనున్నాయిఈ క్రమంలోరెండు లక్షల ఏభై అయిదు వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఆరు వేల ఏడు వందల బ్లాకు పంచాయతీలతో పాటు 665 జిల్లా పంచాయతీలు పాలుపంచుకోనున్నాయి.  నిన్న జరిగిన విశిష్ట గ్రామ సభల నిర్వహణ తీరుతెన్నులను పర్యవేక్షించడానికి వివిధ రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల లోని ఎంపిక చేసిన గ్రామ పంచాయతులకు పంచాయతీరాజ్ శాఖ అధికారులనుసలహాదారులను పంపించారు.  వారు వారి విలువైన సూచనలనుసలహాలనుమార్గదర్శకత్వాన్ని అందించి అధిక ఫలప్రదం కాగల  పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడంలో మరింత సువ్యవస్థనుసమ్మిళితత్వాన్నినిర్మాణాత్మక ప్రక్రియ రూపకల్పనలోను తోడ్పడుతారన్న ఆశ ఉంది.

ఈ ప్రచార ఉద్యమంలో భాగంగా, 2 లక్షల 55 వేలకు పైగా గ్రామ పంచాయతీలలో విశిష్ట గ్రామ సభలను నిర్వహిస్తున్నారు.  ప్రత్యేకంగా ఏర్పాటు చేసినబాగా ఆలోచించి రూపొందించిన గ్రామ సభలు పౌరులకు వారి అభిప్రాయాలను చెప్పడానికివారి అవసరాలను తెలియజేయడానికివారు ఉండే ప్రాంతాల అభివృద్ధి సంబంధిత ప్రణాళికలో క్రియాశీలమైనటువంటి తోడ్పాటును అందించడానికి ఉపయోగ పడనున్నాయి.  ఈ ‘ప్రజలే ప్రణాళికను రచించే ప్రచార ఉద్యమం’ మన దేశంలో సమ్మిళితప్రాతినిధ్య పూర్వక గ్రామీణ అభివృద్ధి దిశలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తున్నది.  ప్రణాళిక ప్రక్రియలో గ్రామ ప్రాంతాల పౌరులలో వారి క్రియాశీల ప్రమేయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ఉద్యమం స్థానిక అవసరాలనుఆకాంక్షలను  ప్రతిబింబిస్తూతగిన అభివృద్ధి ప్రణాళికలకు రూపాన్ని ఇవ్వాలని ధ్యేయంగా పెట్టుకొంది.  ఈ కార్యక్రమం సఫలం కావాలంటే అందుకు పంచాయతీ రాజ్ సంస్థలగ్రామ ప్రాంతాల స్థానిక సంస్థల మద్దతుభాగస్వామ్యాలు కీలకం.  అలాగేదేశంలో గ్రామాల తాలూకు బలాన్ని పునాదిగా ఏర్పరచుకొన్నఅభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్దృష్టికోణం సాకారం కావాలన్నా ఈ అంశమే కీలకం.  ఈ ఉద్యమం ముందుకు సాగే కొద్దీగ్రామాల అభివృద్ధి ప్రక్రియలలో పల్లెవాసులలో వారికి కూడా కొంత పాత్ర ఉంది అనే భావనను పెంపొందింప చేసి 2025-26 సంవత్సరానికి సంబంధిత పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలకు స్థానికత్వాన్ని జోడించిమరింత ప్రభావశీలతను రంగరించ గలుగుతుందన్న భావన ఉంది.

ప్రజలే ప్రణాళికను రచించే ప్రచార ఉద్యమం’లో ఇదివరకు ఎన్నడూ ఎరుగని ఒక సహకారం తెర మీదకు రానుంది.  ఐఐటి ఢిల్లీ సమన్వయ బాధ్యతల స్వీకరణతో  ‘ఉన్నత్ భారత్ అభియాన్’ (యూబీఏఈ సంవత్సరంలో ఒక కీలక పాత్రను పోషించనుంది.  ఉన్నత విద్య సంస్థల (హెచ్ఈఐస్)కు చెందిన 15,000 మంది కి పైగా విద్యార్థులు దీనిలో పాల్గొననున్నారు.  వారు అక్టోబరు 2న విశిష్ట గ్రామ సభలో పాలుపంచుకోవడం ఒక్కటే కాకుండావివిధ గ్రామ పంచాయతీలలో జీపీడీపీల రూపకల్పనలో కూడా సాయ పడనున్నారు.  అట్టడుగు స్థాయిలో చోటు చేసుకొనే ప్రణాళిక రచన ప్రక్రియలో యువత భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టడానికి పంచాయతీ రాజ్ శాఖకుయూబీఏకు మధ్య ఈ తరహా భాగస్వామ్యం ఏర్పడడం ఈ ప్రచార ఉద్యమం చరిత్రలోనే ఇది మొదటి సారి.  అంతేకాదుప్రాజెక్ట్ ఫర్ క్రియేటింగ్ మోడల్ గ్రామ పంచాయత్ క్లస్టర్స్  (పీసీఎమ్‌జీపీసీస్లో పాల్గొనే యువతకు తోడుపీరామల్ ఫౌండేషన్ కు చెందిన ఫెలోస్ యాస్పైరేషనల్ భారత్ కొలాబరేటివ్ (ఏబీసీ), ట్రాన్స్‌ ఫార్మింగ్ రూరల్ ఇండియా ఫౌండేషన్ (టిఆర్ఐఎఫ్)ల ప్రతినిధులు అక్టోబరు 2న గ్రామ సభ నిర్వహణకు సహకరించనున్నారు.  వారు  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ (ఎల్ఎస్‌డీజీస్పూర్వ ప్రణాళిక పునశ్చరణలలో సర్పంచ్ కు దన్నుగా నిలిచిగ్రామ సభ సభ్యులకు పీడీఐ స్కోర్ లుఇంకా ఎల్ఎస్‌డీజీ ఇతివృత్తాల ఎంపిక విషయంలో మార్గదర్శనం చేయడంతో పాటు తగిన ప్రమేయాలను గుర్తించడంలో కూడా  సాయ పడనున్నారు.

దేశవ్యాప్తంగా 750 గ్రామ పంచాయతీలలో ఒక విశిష్ట గ్రామ సభ సంబంధిత పునశ్చరణ/శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పంచాయతీ రాజ్ శాఖ ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అక్టోబరు 2న మొదలు పెడుతోందిఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలపరచాలన్నమంచి నాణ్యతతో కూడిన పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రూపొందించేటట్లు చూడాలన్న మంత్రిత్వ శాఖ నిబద్ధతలో ఈ కార్యక్రమంలో ఒక భాగం అని చెప్పాలి. మన దేశం 75వ సంవత్సరంలో అడుగిడడం అనేక విధాలుగా ఒక చరిత్రాత్మక ఘట్టం. ఇది మన వయోవృద్ధులనుముఖ్యంగా 75 ఏళ్ళ వయస్సు వారుఅంతకు పైబడిన వయస్సు గల వారిని గౌరవించిగ్రామ సభలో పాలుపంచుకోవలసిందిగా వారిని ఆహ్వానించే సన్నివేశం. వారు వారి అభిప్రాయాలను తెలియజేసిమొత్తం 750 గ్రామ సభల రూపేణా గ్రామ స్వరాజ్’ ను ఆవిష్కరించడంలో తోడ్పడనున్నారు. అందరికీ మరింత ప్రాతినిధ్యం లభించే ఉజ్వల భవిష్యత్తుకు బాటను పరచడానికి అందరి జ్ఞానంసహకారంతో జరిపే ఈ వేడుకకు పౌరులంతా కలసికట్టుగా ముందడుగు వేయండంటూ మంత్రిత్వ శాఖ పిలుపునిస్తోంది.  ‘ప్రజలే ప్రణాళికను రచించే ఉద్యమం’ (జన్ యోజన అభియాన్)లో అతి ముఖ్యాంశంగా ఉన్న ఈ కార్యక్రమం అట్టడుగు స్థాయిలో సమ్మిళితమైనపారదర్శకత్వంతో కూడిన,  ప్రభావవంతమైన అభివృద్ధి ప్రధాన ప్రణాళిక రచనకు బాటను పరచేందుకు ఉద్దేశించింది.

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు  సుస్థిర అభివృద్ధి మార్గంలో పయనించడంలో ఇటు యువతనుఅటు వయస్సు మళ్ళినవారిని పాలుపంచుకొనేటట్లుగా చూడటం పై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టిని సారిస్తుంది.  వయోవృద్ధులను ఆహ్వానించివారి విలువైన సూచనలనుసలహాలను తెలపాలని కోరడంతో పాటు వారిని గౌరవించడం ఒక విశిష్ట సంప్రదాయం.  గత కొన్ని దశాబ్దాల కాలంలో భారతదేశంలో జరిగిన పరివర్తనను కళ్ళారా చూసిన వారు వారి అభిప్రాయాలను వెల్లడించడం వల్ల పంచాయతుల దీర్ఘకాలిక అభివృద్ధినిభవిష్యత్తును తీర్చిదిద్దడంలో సాయం లభించనుందిప్రణాళిక రచన ప్రక్రియలో తల పండిన వారి ప్రమేయంగ్రామ పాలనలో ఇమిడిపోయిన విలువలకు తోడు తరాల జ్ఞానం కూడా అండదండలను అందించబోతోంది.  పంచాయతీ రాజ్ శాఖ లోని యువ అధికారులుటీఆర్ఐఎఫ్పిరమల్ ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు సంధానకర్తలు కూడా వారివైన పాత్రలను పోషించనున్నారుపాలనలో లోటుపాటులను గుర్తించడంలోను, ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ’ (లోకలైజేషన్ ఆఫ్ సస్టెయినబల్ డెవలప్ మెంట్ గోల్స్-ఎల్ఎస్‌డీజీస్)లోను వారు సుశిక్షణను అందించనున్నారు

కొన్ని ప్రత్యేక సదస్సులు అక్టోబరు 2న నిర్వహించే విశిష్ట గ్రామ సభ పునశ్చరణ/శిక్షణ కార్యక్రమంలో భాగం కానున్నాయి.  ఈ సదస్సులలో వయోవృద్ధులు ఒకటో పంచాయతీ ఎన్నికల ఘట్టం మొదలుకొని వర్తమాన పాలన విధానాల వరకు పంచాయతీలలో వచ్చిన మార్పులకు సంబంధించినటువంటి వారి యొక్క జ్ఞాపకాలను తెలియ జేయనున్నారు.  ఆ తరువాతస్థానిక పాలనలో ఇప్పుడు ఉన్న లోటుపాటుల పైనే కాక భావి లక్ష్యాల పైన కూడా శ్రద్ధను వహిస్తూ చర్చలను చేపట్టనున్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం సంబంధిత ప్రచార ఉద్యమాలు (‘తల్లి పేరిట ఒక మొక్కను నాటడం’ ఏక్ పేడ్ మా కే నామ్), స్వచ్ఛత పరిరక్షణకుదేహ దారుఢ్య పరిరక్షణకు పాటుపడుతాంమత్తుమందులకు తావు ఉండనటువంటి సమాజం ఆవిష్కరణకు కృషి చేస్తాం అనే సామూహిక ప్రతిజ్ఞల కార్యక్రమంఅంతేకాకుండాప్రభావవంతం అయిన  పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడానికి మూకుమ్మడి వచనబద్ధత ప్రధాన ప్రతినల కార్యక్రమం కూడా జరుగనుందిపాలన పరంగా పురోగామి ఆలోచన విధానానికి ఒక ప్రతీకగా ఈ కార్యక్రమం నిలవనుంది.

గ్రామీణ భారత సాధికారిత కల్పనతో పాటుదీర్ఘకాలం మనగలిగే అభివృద్ధి సాధనలపై ఈ విధానం దృష్టిని సారిస్తూనేసంప్రదాయానికి పెద్దపీటను వేయనుంది.  మన గణతంత్రం 75 వ సంవత్సరాన్ని మనం వేడుకగా జరుపుకొంటూఈ క్రమంలో 750 గ్రామ సభలను పెట్టుకొని వాటిలో ప్రజలకు స్థానాన్ని కల్పించడం ద్వారా ‘గ్రామ్ స్వరాజ్’కు పూచీ పడుదాంమరి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి అన్ని గ్రామ పంచాయతులుబ్లాక్ పంచాయతులుజిల్లా పంచాయతులుఇంకా సకల సముదాయాల వారు హుషారుగా ముందుకు రావలసిందిగా పంచాయతీ రాజ్ శాఖ పిలుపునిస్తోంది.

 

***


(Release ID: 2061712) Visitor Counter : 79