భారత పోటీ ప్రోత్సాహక సంఘం
మ్యాన్‌కైండ్ ఫార్మాలో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సీన్స్ విలీనానికి సీసీఐ ఆమోదం
Posted On:
02 OCT 2024 2:16PM by PIB Hyderabad
మ్యాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్ (మ్యాన్‌కైండ్) లో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సీన్స్(బీఎస్‌వీ) విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రతిపాదనలో బీఎస్‌వీకి సంబంధించిన నూరుశాతం వాటా మ్యాన్‌కైండ్ చేతికి వస్తుంది.
లిస్టెడ్ సంస్థ అయిన మ్యాన్‌కైండ్, వినియోగానికి సిద్ధంగా ఉన్న వివిధ రకాల ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల(ఎఫ్‌డీఎఫ్‌లు) అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ చేస్తుంది. వీటిలో తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సనందించే ఔషధాలతో పాటు కండోమ్‌లు, అత్యవసర గర్భనిరోధక మాత్రలు, గర్భనిర్ధారణ సాధనాలు, విటమిన్లు, మినరల్స్, పోషకాలు, యాంటాసిడ్స్, మొటిమలను నిరోధించే సాధనాలు ఉన్నాయి. అనుబంధ సంస్థల ద్వారా ఫార్మా ఉత్పత్తులు(ఏపీఐలు) ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తయారీ, విక్రయాల్లో మ్యాన్‌కైండ్ ఫార్మా నిమగ్నమై ఉంది
(ఎ) ఎఫ్‌డీఎఫ్‌లు, ఏపీఐలు, (బి) ఏపీఐల్లో బయోటెక్, బయోలాజికల్ ఫార్ములేషన్లు (సి) ఆహారం, ఆరోగ్య సప్లిమెంట్లు (డి) వైద్య పరికరాలు (ఈ) ఆయుర్వేద ఔషధాలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి, అనుమతులు, తయారీ, ఎగుమతులు, దిగుమతులు, మార్కెటింగ్, పంపిణీ వ్యవస్థలో బీఎస్‌వీ తన అనుబంద సంస్థలతో కలసి పనిచేస్తుంది. అలాగే మానవ వినియోగానికి సిద్ధంగా ఉన్న, గైనకాలజీ చికిత్సకు సంబంధించిన ఇన్ – విట్రో ఫెర్టిలైజేషన్, క్రిటికల్ కేర్ లేదా అత్యవసర ఔషధ విభాగాల్లో బీఎస్‌వీ తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. భారత్‌లో మహిళల ఆరోగ్యం, క్రిటికల్ కేర్, ఐయూఐ-ఐవీఎఫ్, అత్యవసర ఔషధాలకు సంబంధించిన బయోటెక్, బయోలాజికల్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌కు మాత్రమే బీఎస్‌వీ(పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, బీఎస్‌వీతో విలీన ప్రక్రియలో ఉన్న బీఎస్‌వీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్) కార్యకలాపాలు పరిమితమయ్యాయి.
కమిషన్ వెలువరించిన పూర్తి ఉత్తర్వులు త్వరలో విడుదలవుతాయి.
*****
(Release ID: 2061560)
Visitor Counter : 55