గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రేపు జార్ఖండ్‌లో ₹83,300 కోట్ల విలువైన గిరిజన సంక్షేమ పథకాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం
హజారీబాగ్‌లో ఈ భారీ కార్యక్రమ ఏర్పాట్లపై కేంద్ర మంత్రి శ్రీ జుయల్ ఓరమ్ సమీక్ష
Posted On:
01 OCT 2024 6:56PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నిర్వహించే ‘‘ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’’ (డిఎజెజియుఎ) ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా ₹83,300 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సమాజాల బలోపేతానికి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కృషికి ఈ ప్రాజెక్టులు గణనీయంగా దోహదం చేస్తాయి.
రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి, ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక పరిస్థితుల్లో ప్రగతిశీల మార్పు లక్ష్యంగా ‘డిఎజెజియుఎ’ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు గిరిజన సంక్షేమంతోపాటు గ్రామీణ ప్రగతిపై ప్రభుత్వ నిబద్ధతను మరింత ఇనుమడింపజేస్తాయి.
ఈ కార్యక్రమానికి ప్రధాని రాక నేపథ్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరమ్ సెప్టెంబరు 30న హజారీబాగ్‌లో ఏర్పాట్లను సమీక్షించారు. ఆయనతోపాటు ఆ శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు కూడా నిర్దిష్ట రీతిలో పనులు సాగేవిధంగా పర్యవేక్షించారు.
ప్రధాని కార్యక్రమం సజావుగా సాగే విధంగా వేదిక నిర్మాణం సహా అవసరమైన ఇతర ఏర్పాట్లన్నిటినీ శ్రీ ఓరమ్ దగ్గరుండి పరిశీలించారు. అటుపైన స్థానిక అధికారులు, కార్యక్రమ నిర్వాహకులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.
****
(Release ID: 2061007)
Visitor Counter : 62