రాష్ట్రపతి సచివాలయం
భారత రాష్ట్రపతిని కలిసిన జమైకా ప్రధాని
प्रविष्टि तिथि:
01 OCT 2024 8:49PM by PIB Hyderabad
జమైకా ప్రధాన మంత్రి శ్రీ ఆండ్రూ హోల్నెస్ ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు.
తొలిసారి భారత పర్యటనకు వచ్చిన జమైకా ప్రధాని శ్రీ హోల్నెస్‌ను సాదరంగా స్వాగతించిన రాష్ట్రపతి... భారతీయుల హృదయాల్లో జమైకా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. ముఖ్యంగా క్రికెట్, సంగీతం పట్ల మనకున్న పరస్పర ప్రేమ దీనికి కారణం అన్నారు. జమైకాలోని ప్రవాస భారతీయులు ఇరుదేశాల సంబంధాలలో చాలా కీలకంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
వాణిజ్య, ఆర్థిక రంగాలు సహా అన్ని రంగాలలో భారత్-జమైకా సంబంధాలు క్రమంగా పురోగతి సాధించడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.
పార్లమెంటరీ, విద్య, సాంస్కృతిక వినిమయంతో పాటు అంతర్జాతీయ వేదికలలో పరస్పర సహకారం ద్వారా వివిధ స్థాయుల్లో భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
భారత్ నిర్వహించిన ‘‘వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్’’ సదస్సు మూడు సమావేశాల్లోనూ పాల్గొన్న జమైకాను రాష్ట్రపతి అభినందించారు. ఐరాస భద్రతా మండలితో సహా బహుపాక్షిక సంస్థల సంస్కరణల కోసం ఇరు దేశాలు బలంగా తమ గళం వినిపిస్తున్నాయన్నారు. దీని సాధన కోసం ఎల్-69 వంటి గ్రూపులతో కలిసి పనిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ హోల్నెస్ పర్యటన ఇరు దేశాల మధ్య ఒప్పందాలను మరింత బలోపేతం చేస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2060990)
आगंतुक पटल : 96