వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాణ్యతపై దృష్టి పెట్టి బ్రాండ్ ఇండియాను ప్రోత్సహించాలని పరిశ్రమలకు వాణిజ్య శాఖ మంత్రి విజ్ఞప్తి భారత్‌తో తయారీ కార్యక్రమంలో భాగంగా పీఎల్‌ఐ పథకాల ద్వారా


లబ్ధిపొందిన కంపెనీల సీఈఓలతో సంభాషించిన పీయూష్ గోయల్
నూతన ఆవిష్కరణలు తీసుకురావటం, కీలక రంగాల్లో భారత్‌ను

స్వయం సమృద్ధి చేయటం, ఉపాధి కల్పన విషయంలో కంపెనీలను అభినందించిన పీయూష్ గోయల్
పెట్టుబడులను ఆకర్షించడంలో, ఎగుమతులను పెంచడంలో పీఎల్ఐ పథకం గొప్ప విజయం సాధించింది: పీయూష్ గోయల్

Posted On: 29 SEP 2024 5:34PM by PIB Hyderabad

విప్లవాత్మక మార్పులకు ఉద్దేశించిన ‘భారత్‌లో తయారీ (మేక్ ఇన్ ఇండియా)’ కార్యక్రమానికి దశాబ్ధం నిండుతోన్న సందర్భాన్ని పురస్కరించుకొని.. "సున్నా ప్రభావంసున్నా లోపం (జీరో ఎఫెక్ట్జీరో డిఫెక్ట్)"తో భారత్‌లో తయారీ జరగాలన్న ప్రధాని దార్శనికతకు అనుగుణంగా సుస్థిరమైన పద్ధతుల ద్వారా అధిక-నాణ్యత గల వస్తువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి పెట్టి బ్రాండ్ ఇండియాను ప్రోత్సహించాలని భారత పరిశ్రమ ప్రతినిధులకు వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విన్నవించారు.

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐకింద వారు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ 140 పీఎల్‌ఐ ద్వారా లబ్ధి పొందిన కంపెనీల సీఈఓలతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కీలక రంగాల్లో వృద్ధిని పెంచడంలోఉద్యోగాలను సృష్టించడంలోతయారీ రంగంలో భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన పీఎల్‌ఐ ద్వారా లబ్ది పొందిన కంపెనీలు తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారుప్రపంచ అగ్ర కంపెనీలకు.. వారి అంకితభావానికిసృజనాత్మక వస్తువుల ఉత్పత్తిలో గణనీయమైన పెట్టుబడులు పెట్టినందుకుపీఎల్ఐ పథకాల ద్వారా ఉపాధి కల్పనలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

భారత్‌ స్వావలంబన సాధించడానికి తమ ఉత్పత్తులకు సంబంధించి దేశీయంగా విలువ జోడింపును పెంచడంపై దృష్టి పెట్టాలని సీఈఓలను కోరారుఈ విషయంలో దేశీయ తయారీదారులకు పరిశ్రమల రంగం మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

మూడు గంటల పాటు జరిగిన ఈ సంభాషణలో లబ్ధిదారులైన కంపెనీల సీఈఓలు పీఎల్ఐ పథకాలపై తమ దృక్పథాన్ని పంచుకున్నారుఅంతేకాకుండా వారి అనుభవాలువిజయగాథల గురించి వివరాలను తెలియజేశారుపథకాల ప్రభావాన్ని మెరుగుపరచడానికిఅమలును క్రమబద్ధీకరించడానికి పలు సూచనలు కూడా చేశారుపరిశ్రమ ప్రతినిధులుప్రభుత్వం మధ్య బహిరంగ సమాచార మార్పిడి కోసం ఈ చర్చ ప్రయోజనకరమైన వేదికగా మారిందిసులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు చట్టాల సరళీకరణ, నేర పరిధిలోకి వచ్చే నిబంధనలను నేర రహితంగా మార్చటంపై పరిశ్రమ పెద్దల నుంచి అభిప్రాయాన్ని మంత్రి తీసుకున్నారు.

విధానపరమైన మద్దతుభవిష్యత్తు వృద్ధికి అనువైన వాతావారణాన్ని సృష్టించే ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. డీపీఐఐటీ సహకారంతో ప్రాజెక్టులను అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖలువిభాగాలుసంబంధిత పీఎంఓల ద్వారా పరిశ్రమ ప్రతినిధులుప్రభుత్వం మధ్య నిరంతర చర్చలు జరగటాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారుసాంకేతికత బదిలీవిదేశీ సహకారాలను సులభతరం చేయడానికి పరిశ్రమ భాగస్వాములు.. ఇన్వెస్ట్ ఇండియానేషనల్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీలను సంప్రదించొచ్చని ఆయన పేర్కొన్నారు.

పీఎల్ఐ పథకాల పరిధిలో పెట్టుబడులు పెడుతూఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ప్రపంచ అగ్ర కంపెనీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారుపీఎల్ఐ పథకంలోని పరిశ్రమలకు సంబంధించిన అన్ని అనుమతులను త్వరితగతిన ఇచ్చేందుకుఎక్కువ మార్కెట్‌‌ను చేరుకోవటంలో సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

పీఎల్‌ఐని అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖలువిభాగాలుప్రాజెక్టు నిర్వహణ సంస్థల (పీఎంఏ)కు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 14 రంగాలలో పీఎల్ఐ పథకం సాధించిన స్పష్టమైన ఫలితాలపై ఈ సంభాషణ దృష్టి సారించిందిపీఎల్ఐ పథకం ఆయా రంగాల్లో తయారీ పెరుగుదలకు దారి తీయటంతో పాటు ప్రపంచంలో భారత్‌‍ పోటీతత్వాన్ని మెరుగుపరిచింది.


 

మన్ కీ బాత్
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి 114వ మన్ కీ బాత్‌‌ కార్యక్రమాన్ని విన్నారుభారత్‌ను ఉత్పాదక శక్తిగా మార్చడంలో "భారత్‌లో తయారీకార్యక్రమం ఎంతగా దోహదపడిందో ప్రధాని వివరించారుదీని ఫలితంగా ఎలక్ట్రానిక్స్రక్షణవస్త్రాలువిమానయానంవాహనాలు తదితర రంగాలలో ఎగుమతులు పెరగడంతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలునిరంతరం పెరుగుతూనే ఉన్నాయని ఆయ అన్నారుదేశం ఇప్పుడు "నాణ్యతప్రపంచ స్థాయి ఉత్పత్తులు", "వోకల్ ఫర్ లోకల్స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించటంపై దృష్టి సారించిందని ప్రధానంగా చెప్పారు.

పీఎల్ఐ ప్రభావం

పీఎల్‌ఐ పథకాలు మొత్తంగా సాధించిన విజయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారుఅగస్టు 24 వరకు రూ.1.46 లక్షల కోట్ల వాస్తవ పెట్టుబడులు సాధించామనివచ్చే ఏడాదిలో ఇది రూ.2 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారుదీనివల్ల రూ.12.50 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తిఅమ్మకాలు జరిగాయని తెలిపారు. 9.5 లక్షల (ప్రత్యక్షపరోక్షమందికి ఉపాధి కల్పన జరిగిందనిత్వరలోనే ఇది 12 లక్షలకు చేరుకుంటుందని అంచనా ఉందన్నారుఎలక్ట్రానిక్స్ఫార్మాస్యూటికల్స్ఆహార శుద్ధి వంటి కీలక రంగాల నుంచి గణనీయమైన సహకారంతో ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు దాటాయన్నారు.

ఇప్పుడు దేశంలో మొత్తం ఎలక్ట్రానిక్స్ రంగం ఉత్పత్తిలో మొబైల్ ఫోన్ల తయారీ సగం వాటాను కలిగి ఉందివీటికి సంబంధించిన ఎగుమతులు 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి రెట్లు పెరిగాయిదేశీయంగా బల్క్ డ్రగ్స్క్లిష్టమైన జనరిక్స్ ఉత్పత్తిని పెంచటం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని ఫార్మాస్యూటికల్ పరిశ్రమ తగ్గించిందిఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలో ప్రఖ్యాత కంపెనీలు దేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాయిఆయా కంపెనీలు ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయిసీటీ స్కానర్లు వంటి కీలకమైన పరికరాల తయారీ కోసం కావాల్సిన సాంకేతికతల బదిలీ ద్వారా వైద్య పరికరాల పరిశ్రమ దేశీ ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. అదేవిధంగా ఆహార శుద్ధి రంగం.. సుస్థిర వ్యవసాయ పద్ధతులుచిరుధాన్యాలుసేంద్రీయ ఉత్పత్తుల ఉత్పత్తికి దోహదం చేసిందిడ్రోన్లు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల ఆదాయాలు ఏడు రెట్లు పెరిగాయిదీనికి ఎంఎస్‌ఎంఈలుఅంకురాలు ఎక్కువ దోహదపడ్డాయిసౌర వీపీ మాడ్యూల్ప్రత్యేక తరహా ఉక్కుకు సంబంధించిన పరిశ్రమలు కూడా గణనీయమైన పెట్టుబడులుస్థానిక ఉత్పత్తితో గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి.

 

***


(Release ID: 2060176) Visitor Counter : 52