పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇన్ క్రెడిబుల్ ఇండియా కంటెంట్ హబ్, వెబ్‌సైట్‌ను ప్రారంభించిన పర్యాటక శాఖ

Posted On: 27 SEP 2024 2:59PM by PIB Hyderabad

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27న సరికొత్త రూపంలో తీసుకొచ్చిన ఇన్ క్రెడిబుల్ ఇండియా డిజిటల్ పోర్టల్(www.incredibleindia.gov.in)లో ఇన్ క్రెడిబుల్  ఇండియా కంటెంట్ హబ్‌ను పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సమగ్ర డిజిటల్ రిపాజిటరీ అయిన ఈ కంటెంట్ హబ్ లో  భారత్‌లో పర్యాటకానికి సంబంధించిన అధిక-నాణ్యత చిత్రాలు, సినిమాలు, బ్రోచర్లు, న్యూస్ లెటర్లకు  సంబంధించిన విస్తృత సమాచారం లభిస్తుంది.  ప్రయాణ సంస్థలు, పాత్రికేయులు, విద్యార్థులు, పరిశోధకులు, చలనచిత్ర నిర్మాతలు, రచయితలు, ఇన్ఫ్లూయెన్సర్లు, కంటెంట్ సృష్టికర్తలు, ప్రభుత్వ అధికారులు, రాయబారులతో సహా వివిధ భాగస్వాములు ఉపయోగించుకునే ఉద్దేశంతో ఈ హబ్‌ను తయారుచేశారు.

కొత్త రూపంలో తీసుకొచ్చిన ఇన్ క్రెడిబుల్ ఇండియా వెబ్‌సైట్‌లో భాగమైన కంటెంట్ హబ్..  మీడియా, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్ల తో పాటు  వ్యాపార, వృత్తిపరమైన కార్యకలాపాల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటించే వారికి భారత్ కు సంబంధించిన సమాచారం అంతా ఒకేచోట సులభంగా పొందే అవకాశం కల్పిస్తుంది. viప్రపంచవ్యాప్త ప్రయాణ వ్యాపారులకు(ప్రయాణ మీడియా, ప్రయాణ సంస్థలు, ట్రావెల్ ఏజెంట్లు) అవసరమైన సమాచారాన్ని ఒకేచోట అందిస్తుంది. తద్వారా వాళ్ల అన్ని మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాల్లో వీటిని ఉపయోగించి  భారత్‌పై అవగాహనను పెంచుకోవచ్చు.  కంటెంట్ హబ్‌లో 5,000 చిత్రాలు, బ్రోచర్లు, న్యూస్ లెటర్లు(కంటెంట్ అసెట్స్) ఉన్నాయి. పర్యాటక మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇతరులతో సహా వివిధ సంస్థలు సంయుక్త కలిసి వీటిని రూపొందించాయి.

ఇన్భా క్రెడిబుల్ ఇండియా పోర్టల్  దేశానికి వచ్చే సందర్శకులకు  ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి  తీసుకొచ్చిన వన్-స్టాప్ డిజిటల్ వేదిక. ఈ కొత్త వైబ్‌సైట్‌.. పర్యాటక ప్రాంతాల అన్వేషణ, పరిశోధన నుంచి ప్రణాళిక, బుకింగ్, ప్రయాణం, తిరుగు ప్రయాణం వరకు ప్రతి దశలో ప్రయాణికులకు అవసరమైన సమాచారం, సేవలను అందిస్తుంది.

వీడియోలు, చిత్రాలు, డిజిటల్ మ్యాప్స్ వంటి మల్టీమీడియా కంటెంట్‌ను ఉపయోగించి గమ్యస్థానాలు, పర్యాటక ఆకర్షణలు, హస్తకళలు, పండుగలు, ట్రావెల్ డైరీలు, ప్రయాణాలు, ఇలా చాలా సమాచారాన్ని ఇన్ క్రెడిబుల్ ఇండియా పోర్టల్ అందిస్తుంది. ఈ వెబ్‌సైట్‌లోని 'బుక్ యువర్ ట్రావెల్' ఫీచర్.. విమానాలు, హోటళ్లు, క్యాబ్‌లు, బస్సులు, స్మారక చిహ్నాల వద్ద టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. ఇది ప్రయాణికులు వివిధ సేవలను పొందటాన్ని సులభతరం చేస్తుంది. అదనంగా, ఏఐ ఆధారిత చాట్‌బాట్ వివిధ పశ్నలకు సమాధానం ఇస్తుంది, ప్రత్యక్ష(రియల్ టైం)సమాచారాన్ని ప్రయాణికులకు అందించే వర్చువల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. వాతావరణ సమాచారం, ప్రయాణ సంస్థల వివరాలు, నగదు మార్పిడి, విమానాశ్రయాల సమాచారం, వీసా గైడ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొత్త ఫీచర్లను తీసుకురావాటానికి, క్రౌడ్ సోర్సింగ్ ద్వారా అదనపు కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైబ్‌సైట్‌ను మెరుగుపరచటం, అభివృద్ధి చేయటాన్ని పర్యాటక శాఖ కొనసాగిస్తుంది.  అద్భుతమైన భారత్‌ను అన్వేషించాలని, పర్యటించాలని అనుకునే అందరికి నిరంతరం ప్రేరణ కలిగించే కేంద్రంగా ఉండేలా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దటానికి సంబంధింత సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవటంపై కూడా పర్యాటక శాఖ పనిచేయనుంది. 

 

***


(Release ID: 2059939) Visitor Counter : 48