రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నావికాదళం నిర్వహణలో ‘థింక్ 2024’ క్విజ్ కార్యక్రమం ముగిసిన తొలి రౌండ్లు
Posted On:
28 SEP 2024 11:42AM by PIB Hyderabad
భారత్ నావికాదళం ఆధ్వర్యంలో జరుగుతున్న ‘థింక్ 2024’ క్విజ్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 10న తొలి ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. 12,655 పాఠశాలలకు చెందిన విద్యార్థి బృందాలు పోటీ పడ్డ ఈ జాతీయ స్థాయి క్విజ్.. తొలి మూడు రౌండ్లు సెప్టెంబర్ 25న ముగిశాయి.
అర్హత సాధించిన బృందాలు, అక్టోబర్ 14-15 తేదీల్లో వీడియో మాథ్యమం ద్వారా జరిగే ‘జోనల్’ స్థాయి పోటీల్లో పాల్గొంటాయి.
జూలై 15న నమోదు ప్రక్రియ ప్రారంభించిన ‘థింక్ 24’ క్విజ్... ఎలిమినేషన్ రౌండ్లు పూర్తి చేసుకుని పోటీ సగం దూరానికి చేరుకుంది. 2047 కల్లా భారత్ ను సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ఆశయానికి అనుగుణంగా ఈ ఏడాది క్విజ్ ఇతివృత్తాన్ని ‘వికసిత్ భారత్’గా నిర్ణయించారు. ఈ క్విజ్ లో కేవలం విద్యార్థుల సాధారణ అవగాహనను పరీక్షించడమే కాక, వారి మస్తిష్కాలకు పదును పెట్టి, జాతి నిర్మాణంలో తమ పాత్రను గురించిన అవగాహనను పెంచి, తద్వారా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం పోటీ లక్ష్యం.
ఇక నవంబర్ 7,8 తేదీల్లో కేరళలోని ఏళిమలలో జరిగే ‘థింక్ 24’ క్విజ్ సెమీఫైనల్స్, ఫైనల్ పోటీలను ఇండియన్ నేవల్ అకాడమీ వేదికగా సదరన్ నేవల్ కమాండ్ నిర్వహిస్తుంది.
***
(Release ID: 2059937)
Visitor Counter : 65