కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కార్మికుల కనీస వేతన రేట్లు పెంచిన కేంద్రం

Posted On: 26 SEP 2024 6:17PM by PIB Hyderabad

కార్మికుల కోసంప్రత్యేకించి అసంఘటిత రంగంలోని కార్మికులను ఆదుకోవడానికికేంద్ర ప్రభుత్వం వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (వీ.డీ.)ని సవరించిందిదీని ద్వారా కార్మిక కనీస వేతన రేట్లు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించిందిపెరుగుతున్న జీవన వ్యయాన్ని ఎదుర్కోవడంలో కార్మికులకు సహాయపడే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో భవన నిర్మాణంలోడింగ్అన్‌లోడింగ్వాచ్ అండ్ వార్డ్స్వీపింగ్క్లీనింగ్హౌస్ కీపింగ్మైనింగ్వ్యవసాయం వంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈ సవరించిన వేతన రేట్ల ద్వారా ప్రయోజనం కలుగుతుందికొత్త వేతన రేట్లు అక్టోబర్ 1వ తేదీ నుండి అమలులోకి రానున్నాయిచివరగా ఏప్రిల్ నెలలో ఈ రేట్లను కేంద్రం సవరించింది.

నైపుణ్యం లేనిపాక్షిక నైపుణ్యాలు గలనైపుణ్యం గల అనేస్థాయుల ఆధారంగా అలాగే భౌగోళిక ప్రాంతం ఆధారంగా ఈ కనీస వేతన రేట్లను A, BCలుగా వర్గీకరించారు.

ఈ సవరణ తరువాత“A” ప్రాంతంలోని నిర్మాణస్వీపింగ్క్లీనింగ్లోడింగ్ అండ్ అన్‌లోడ్ రంగాల్లో నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు రూ. 783 (నెలకు రూ. 20,358), పాక్షిక నైపుణ్యాలు గల కార్మికులకు రోజుకు రూ. 868 (నెలకు రూ. 22,568), క్లరికల్ఆయుధాలు లేని వాచ్ అండ్ వార్డ్స్ వంటి రంగాల్లో నైపుణ్యం గల కార్మికులకు రోజుకు రూ. 954 (నెలకు రూ. 24,084), అలాగే ఆయుధాలతో గల వాచ్ అండ్ వార్డ్స్ రంగాల్లో అధిక నైపుణ్యం గల కార్మికులకు రోజుకు రూ. 1035 (నెలకు రూ. 26,910) కనీస వేతనం లభించనుంది.    

పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీలో ఆరు నెలల సగటు పెరుగుదల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లుఏప్రిల్ 1, అక్టోబర్ నుండి అమలులోకి వచ్చే విధంగా వీ.డీ..ను సవరిస్తుంది.

రంగంవర్గంఅలాగే ప్రాంతం వారీగా కనీస వేతన రేట్లకు సంబంధించిన సవివరమైన సమాచారంభారత ప్రభుత్వ కార్మిక శాఖ ప్రధాన కమిషనర్ (కేంద్రంవెబ్‌సైట్ (clc.gov.in)లో అందుబాటులో ఉంది.



(Release ID: 2059517) Visitor Counter : 189