రక్షణ మంత్రిత్వ శాఖ
డీఆర్డీవో, ఐఎన్ఏఈ సంస్థల నేతృత్వంలో హైదరాబాద్ లో 11వ ఇంజనీర్ల సదస్సు: నూతన సాంకేతికతలు, స్వదేశీకరణ పురోగతిపై చర్చ
Posted On:
26 SEP 2024 4:08PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత జాతీయ ఇంజనీర్ల అకాడమీ (ఐఎన్ఏఈ)ల ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లో11వ ఇంజనీర్ల సదస్సు ప్రారంభమయింది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానమైన వ్యూహాత్మక అంశాలైన- 3డీర ప్రింటింగ్ విధానంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, రక్షణ ఉత్పత్తుల్లో టెక్నాలజీలపై లోతైన చర్చలు జరుగుతాయి. డీఆర్డీవోకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్) లో నిర్వహిస్తున్న ఈ సదస్సు వేదికగా నూతన సాంకేతికతలు, స్వదేశీ ఉత్పత్తుల సాధనలో తాజా పరిణామాల గురించి చర్చించేందుకు ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు సమావేశమవుతున్నారు.
అణుశక్తి కమిషన్ మాజీ ఛైర్మన్ శ్రీ అనిల్ కాకోద్కర్, డీఆర్డీవో ఛైర్మన్, ప్రభుత్వ రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి డాక్టర్ వి. కామత్ సంయుక్తంగా ఈ సదస్సుని ప్రారంభించారు. డీఆర్డీఎల్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీ జి.ఏ. శ్రీనివాసమూర్తి, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల సంస్థ (మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్) డైరెక్టర్ జనరల్ శ్రీ యు. రాజబాబు, ఐఎన్ఏఈ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఇంద్రనీల్ మన్నా కార్యక్రమంలో ప్రసంగించారు.
(Release ID: 2059277)
Visitor Counter : 56