ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
బీటెక్, ఎంటెక్, పీహెచ్ డీ విద్యార్థులు, పరిశోధకులకోసం ఇండియా ఏఐ ఫెలోషిప్
నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు, పరిశోధకులు తమ నామినేషన్లను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30
Posted On:
24 SEP 2024 5:36PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం బీటెక్, ఎంటెక్ విద్యార్థులనుంచి ఇండియా ఏఐ- ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ ( ఐబీడీ) నామినేషన్లను ఆహ్వానిస్తోంది. అంతే కాక నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ( ఎన్ ఐ ఆర్ ఎఫ్) ర్యాంకు పొందిన 50 అగ్రగామి పరిశోధనా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇండియా ఏఐ సంస్థ ఆహ్వానిస్తోంది. కృత్రిమ మేధలో పరిశోధన చేసే నూతన పీహెచ్ డీ పరిశోధక విద్యార్థులు మాత్రమే ఈ ఇండియా ఏఐ ఫెలోషిప్ పొందడానికి అర్హులు.
బీటెక్, ఎంటెక్ విద్యార్థుల కోసం నామినేషన్లు
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రాజెక్ట్‌లను చేపట్టే బీటెక్, ఎంటెక్ విద్యార్థులు ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం నామినేషన్లను పంపాల్సిందిగా ఇండియా ఏఐ కోరుతోంది. ఇప్పటికే పొందుతున్న ఫెలోషిప్పులకు ఇది అదనం.బీటెక్ విద్యార్థులు ఒక ఏడాదిపాటు, ఎంటెక్ విద్యార్థులు రెండేళ్లపాటు ఫెలోషిప్ పొందవచ్చు.
విద్యార్థులు తమ నామినేషన్లను పంపడానికి వెబ్ లింక్ https://indiaai.gov.in/article/proforma-for-submission-of-nominations-for-indiaai-fellowship-under-the-indiaai-mission.
నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ ౩౦ నాటికి నామినేషన్లను పంపాలి.
అగ్రగామి సంస్థల్లోని ఏఐ పరిశోధకుల కోసం ఫెలోషిప్ అవకాశాలు
ఎన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకు పొందిన 50 అగ్రగామి పరిశోధనా సంస్థల్లో కృత్రిమ మేధపై పరిశోధన చేసే పరిశోధక విద్యార్థులకు ( ఫుల్ టైమ్) ఇండియా ఏఐ సంస్థ ఫెలోషిప్పులను అందిస్తోంది. ఇండియా ఏఐ ఫెలోషిప్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా యాభై అగ్రగామి సంస్థలకు ఇండియా ఏఐ - ఐబిడి ఆహ్వానం పలుకుతోంది. ఆయా సంస్థల్లో కృత్రిమ మేధపై పరిశోధన చేయడానికి ప్రవేశం పొందే నూతన పీహెచ్ డి పరిశోధక విద్యార్థులకు ఈ ఫెలోషిప్ వర్తిస్తుంది. ఇండియా ఏఐ పిహెచ్ డి ఫెలోషిప్ లో తమ పేరు నమోదు చేసుకునే సమయానికి ఈ పరిశోధక విద్యార్థులు ఇతర ఏ సంస్థనుంచి ఎలాంటి ఉపకార వేతనాన్ని, జీతాన్ని పొందకుండా ఉండాలి.
దేశంలోని 50 అగ్రగామి ఎన్ ఐఆర్ ఎఫ్ ర్యాంకు పొందిన సంస్థలు ఇండియా ఏఐ పిహెచ్ డి ఫెలోషిప్ మార్గదర్శకాల ప్రకారం నూతన పిహెచ్ డి విద్యార్థులను తీసుకుంటామని అంగీకరిస్తూ తమ అధికారిక లెటర్ హెడ్ మీద సంతకం చేసి, స్టాంప్ వేసిన ఆమోద ఉత్తరాన్ని ఈ నెల 30 నాటికి పంపాలి. ఈ ఆమోద ఉత్తరాన్ని శ్రీమతి కవిత భాటియా, సైంటిస్ట్ జి అండ్ జీసీ ( ఏఐ అండ్ ఈటీ) మెయిల్ అడ్రస్ kbhatia@meity.gov.in కు పంపాలి.
ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ
ఇండియా ఏఐ ఫెలోషిప్ ఇవ్వడంకోసం.. విద్యార్థుల ఎంపికను ఇండియా ఏఐ సంస్థ చేస్తుంది. అర్హత, పరిశోధన ప్రతిపాదన ఔచిత్యం, విద్యార్థి ప్రొఫైల్, జాతీయస్థాయిలో ఫెలోషిప్పుల లభ్యత మీద ఆధారపడి విద్యార్తులను ఎంపిక చేస్తారు.
ఇండియా ఏఐ సంస్థ గురించి..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ( డిఐసీ) కింద పని చేసే ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ ను ( ఐబీడీ) ఇండియా ఏఐ అంటారు. ఇది ఇండియా ఏఐ కార్యక్రమాన్ని అమలు చేసే సంస్థ. సమాజంలోని అన్ని వర్గాలవారికి ప్రజాస్వామికంగా కృత్రిమ మేధ ప్రయోజనాలు అందేలా చూడడమే ఈ సంస్థ లక్ష్యం. అంతే కాకుండా కృత్రిమ మేధ రంగంలో అంతర్జాతీయంగా దేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడం, సాంకేతికంగా దేశంలో స్వయం సమృద్ది పెంచడం,. నైతికంగా, బాధ్యతాయుతంగా కృత్రిమ మేధ వినియోగం జరిగేలా చూడడం ఈ సంస్థ ఇతర లక్ష్యాలు.
****
(Release ID: 2058459)
Visitor Counter : 48