రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆరో తరగతి పాఠ్యప్రణాళికలో 'జాతీయ యుద్ధ స్మారకం'పై ఒక కవిత, 'వీర్ అబ్దుల్ హమీద్'పై ఒక అధ్యాయాన్ని చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ

Posted On: 19 SEP 2024 5:57PM by PIB Hyderabad

జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్యకు సంబంధించిన జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ 2023కి అనుగుణంగా రూపొందించిన 'జాతీయ యుద్ధ స్మారకం’ అనే కవిత, 'వీర్ అబ్దుల్ హమీద్అనే అధ్యాయాన్ని ఈ ఏడాది నుంచి ఆరో తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యప్రణాళికలో చేర్చారుపాఠశాల పిల్లల్లో దేశభక్తినిర్వర్తించాల్సిన విధుల పట్ల అంకితభావంధైర్యంత్యాగం విలువలుదేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం పెంపొందించటమే లక్ష్యంగా రక్షణ మంత్రిత్వ శాఖవిద్యా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా దీనిని ప్రతిపాదించాయి.

 

పేరులో ఉన్నట్లుగానే జాతీయ యుద్ధ స్మారకందాని స్ఫూర్తిని ప్రతిఫలిస్తుంది. 1965లో భారత్-పాక్ యుద్ధంలో వీరోచిత పోరాటంతో ప్రాణ త్యాగం చేసి దేశ అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్ర (మరణానంతరంఅందుకున్న యోధుడు కంపెనీ క్వార్టర్ మాస్టర్‌ హవల్దార్ అబ్దుల్ హమీద్‌ను 'వీర్ అబ్దుల్ హమీద్పేరుతో ఈ పాఠం గౌరవిస్తుంది.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 ఫిబ్రవరి 25న డిల్లీ ఇండియా గేట్‌లోని ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా 'సీహెక్సాగాన్‌లోని జాతీయ యుద్ధ స్మారకాన్ని జాతికి అంకితం చేశారుప్రతి పౌరుడిలో నైతిక విలువలుత్యాగంజాతీయ స్ఫూర్తిఅనుబంధం పెంపొందించేందుకుదేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులకు తగిన నివాళి అర్పించేందుకు ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశారు.

 

జాతీయ యుద్ధ స్మారకాన్ని జాతీయ స్థాయిలో ప్రఖ్యాత కేంద్రంగా మార్చే దిశగా ప్రారంభించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగావిద్యా మంత్రిత్వ శాఖతో రక్షణ మంత్రిత్వ శాఖ కలిసి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యప్రణాళికలో దీనికి సంబంధించిన అంశాలను పాఠ్యపుస్తకంలో చేర్చారు.

***


(Release ID: 2056963)
Read this release in: Hindi , Urdu , English , Tamil