కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
క్వాంటం టెక్నాలజీ, అనుబంధంగా ఉన్న 5, 6వ తరం టెక్నాలజీల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన టీసీఓఈ-వీటీయూ-వీఆర్ఐఎఫ్
అత్యాధునిక సాంకేతికతలో భారత పురోగతిని వేగవంతం చేయడమే సీఓఈ లక్ష్యం
100-రోజుల కార్యక్రమంలో భాగంగా ఉన్న సీఓఈ
నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు, 2,000 మందికి పైగా పీహెచ్‌డీలు,
అనేక మంది పరిశోధకులకు సాధికారత కల్పించనున్న ఈ కేంద్రం
Posted On:
19 SEP 2024 7:23PM by PIB Hyderabad
సాంకేతిక ఆవిష్కరణలలో భారతదేశాన్ని మరింత బలోపేతం చేసే ముఖ్యమైన చర్యల్లో భాగంగా, భారత టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (టీసీఓఈ), విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ (వీటీయూ), విశ్వేశ్వరయ్య రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (వీఆర్ఐఎఫ్)లు ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. క్వాంటమ్ టెక్నాలజీ, అనుబంధ 5వ తరం, 6వ తరం సాంకేతికతలు అలాగే పరిశోధన, అభివృద్ధి సంబంధిత అత్యాధునిక రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటు కోసం ఈ అవగాహన ఒప్పందం జరిగింది. బెంగళూరులోని వీటీయూ-వీఆర్ఐఎఫ్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉండే ఈ సీఓఈ, కీలక రంగాలలో భారత పురోగతిని వేగవంతం చేయడం లక్ష్యంగా పనిచేయనుంది. ఇది 100-రోజుల కార్యక్రమంలో భాగంగానూ ఉంది.
వీటీయూ-వీఆర్ఐఎఫ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విద్యా శంకర్ ఎస్, డీడీజీ (ఎస్ఆర్ఐ), డీఓటీ & టీసీఓఈ ఇండియా డైరెక్టర్ శ్రీ వినోద్ కుమార్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలికి చెందిన 200 మందికి పైగా ప్రతినిధులు, 228 వీటీయూ కళాశాలలకు చెందిన డీన్స్, హెచ్ఓడీలు, డీఓటీ నుండి పలువురు అతిథులు అలాగే ఆయా రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.
పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించే ప్రధాన కేంద్రం
వీటీయూ-వీఆర్ఐఎఫ్, టీసీఓఈ ఇండియాలతో ఆవిష్కరణలను ప్రోత్సహించే ప్రధాన కేంద్రంగా, కేంద్రీకృత వలయం (హబ్ అండ్ స్పోక్) నమూనా ఆధారంగా ఈ సీఓఈ రూపొందించబడింది. 228 వీటీయూ అనుబంధ కళాశాలల మేధోపరమైన, మౌళిక వసతుల బలాలను ఉపయోగించుకుంటూ, పరిశోధన, అభివృద్ధిలో సీఓఈ కీలకంగా పనిచేస్తుంది. ఈ నమూనా ద్వారా, సీఓఈ అత్యాధునిక పరిశోధనలను క్రమబద్ధీకరిస్తూ, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది అలాగే క్వాంటమ్, అనుబంధ 5, 6వ తరం సాంకేతికతల్లో ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది. నిరంతరం ఏకాగ్రతతో పనిచేసే ఆవిష్కరణ బృందాలను, అనుబంధ కళాశాలలకు చెందిన అత్యుత్తమ నిపుణులను ఈ కేంద్రం కలిగి ఉంటుంది.
టెలికాం ఇంజనీరింగ్ సెంటర్ (టీఈసీ), భారత్ 6 జీ అలయన్స్, టీఎస్డీఎస్ఐ, విద్యా సంస్థలు, అంకుర సంస్థలు వంటి టెలికాం ప్రామాణీకరణలో పనిచేసే కీలక సంస్థల మధ్య సమష్టి తత్వాన్ని ఈ సీఓఈ పెంపొదిస్తుంది. ఈ సీఓఈ నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు, 2000 మందికి పైగా పీహెచ్‌డీలు, అలాగే వీటీయూ వ్యవస్థ పరిధిలోని అనేక మంది పరిశోధకులకు- పరిశోధన, అభివృద్ధి క్రమబద్దీకరణ కోసం, వినూత్న ఆవిష్కరణల వాణిజ్యీకరణ కోసం సాధికారత కల్పిస్తుంది.
(Release ID: 2056961)
Visitor Counter : 82