సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
అపరిష్కృత అంశాలPAI అక్టోబరు 2-31 వరకు ప్రత్యేక ప్రచారం 4.౦: దివ్యాంగజనుల సాధికారిత కల్పన విభాగం
Posted On:
19 SEP 2024 12:38PM by PIB Hyderabad
స్వచ్ఛతను వ్యవస్థలో ఒక భాగంగా పాటించే సంప్రదాయాన్ని నెలకొల్పడానికి, ప్రభుత్వ కార్యాలయాలలో పరిష్కారం కాకుండా ఉన్న అంశాలను కనీస స్థాయికి చేర్చడానికి అక్టోబరు 2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం 4.0ను సామాజిక న్యాయం - సాధికారిత కల్పనల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని దివ్యాంగజనుల సాధికారిత విభాగం (డిఇపిడబ్ల్యుడి) అమలు పరచనుంది. ఈ నిర్ణయం పరిపాలక సంస్కరణలు, సార్వజనిక ఫిర్యాదుల విభాగం (డిఎఆర్‌పిజి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.
డిఇపిడబ్ల్యుడి తో పాటు ఆ విభాగంలోని సంస్థలు కూడా గత అక్టోబరు 2 -31 MADHYA అమలుపరిచిన స్పెషల్ క్యాంపెయిన్ 3.0 లో చురుకుగా పాల్గొన్నాయి. ఈ ప్రచారానికి నిర్దేశించుకొన్న లక్ష్యాలను 2023 అక్టోబరు 31న ప్రచారం ముగింపు రోజుకల్లా పూర్తి చేసేశారు. కిందటి ఏడాది అక్టోబరు 2-31 మధ్య కాలంలో డిజిటలీకరించిన, ఏరిపారేసిన ఫైల్స్/దస్తావేజు పత్రాలు మొత్తం 11,407గా లెక్క తేలాయి. దాదాపు 8472 చదరపు అడుగుల జాగాలో అక్కర లేని సామగ్రి నిండిపోతే ఆ సామగ్రిని తీసేసి, సరికొత్త వినియోగానికి అనువుగా మార్చారు. ఈ ప్రక్రియను అనుసరించడంతో 5,66,517 రూపాయల ఆదాయం లభించింది. ఈ విభాగంతో పాటు ఈ విభాగానికి చెందిన సంస్థలు దేశం అంతటా 50 అవుట్ డోర్, ఇన్ డోర్ స్వచ్ఛత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాయి.
ప్రత్యేక ప్రచారం 4.0ని రెండు దశలలో అమలు పరచనున్నారు. సన్నాహక దశ ను ఈ నెల 16న ప్రారంభించారు. ఈ దశను ఈ నెలాఖరు వరకు, అంటే సెప్టెంబరు 30 దాకా, అమలు చేయనున్నారు; అమలు దశ ను అక్టోబరు 2 నుంచి 31 వరకు చేపడతారు. డిఎఆర్‌పిజి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక ఉద్యమం 4.0ను నిర్వహించడానికి డిఇపిడబ్ల్యుడి సకల ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఈ విభాగంలో నోడల్ ఆఫీసర్ ను నియమించారు. విభాగం పరిపాలక నియంత్రణలో ఉన్న సబార్డినేట్ ఆఫీసర్ లు/అనుబంధిత అధికారులు అందరు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్న సంస్థలు వాటి వాటి నోడల్ ఆఫీసర్ లను నియమించుకోవాలని, అలాగే డిఎఆర్‌పిజి మార్గదర్శకాల ప్రకారం కార్యాలయాలలోని పెండింగ్ అంశాలను గుర్తించాలని సూచించారు.
దీనికి అదనంగా, డిఎఆర్‌పిజి మార్గదర్శకాల ప్రకారం డిఇపిడబ్ల్యుడితో పాటు ఈ విభాగం ఆధీనంలో పని చేస్తున్న సంస్థలు నెల నెలా సంబంధిత కార్యకలాపాలను నిర్వహిస్తూ, అవి సాధించిన ఫలితాలను 2023 నవంబరు మొదలు క్రమం తప్పక ఎస్‌సిడిపిఎమ్ పోర్టల్ లో అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాయి. ప్రత్యేక ప్రచారం 4.0ను భారీ స్థాయిలో విజయవంతం చేయాలని దివ్యాంగజనుల సాధికారిత విభాగం (డిఇపిడబ్ల్యుడి) కంకణం కట్టుకొంది. ఈ పరమార్థం నెరవేరేటట్టుగా సన్నాహక దశలో గుర్తించిన లక్ష్యాలను సాధించడానికి చిత్తశుద్ధితోను, అంకిత భావంతోను ప్రయత్నాలు చేయనున్నారు.
****
(Release ID: 2056644)
Visitor Counter : 74