చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఏకకాలంలో ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం
Posted On:
18 SEP 2024 4:47PM by PIB Hyderabad
దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఏకకాల ఎన్నికలు: ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు
-
1951, 1967 మధ్య ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి..
-
లా కమిషన్: 170వ నివేదిక (1999): అయిదేళ్లలో లోక్‌సభతో పాటు అన్ని శాసనసభలకు ఒకే ఎన్నికలు.
-
పార్లమెంటరీ కమిటీ 79వ నివేదిక (2015): రెండు దశల్లో ఏకకాల ఎన్నికలకు సంబంధించిన పద్ధతులపై సూచన.
-
శ్రీ రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ రాజకీయ పార్టీలు, నిపుణులతో సహా భాగస్వాములందరితో విస్తృతంగా చేపట్టిన సంప్రదింపులు
-
ఈ నివేదిక అందుబాటులో ఉంటుంది: https://onoe.gov.in
-
దేశంలో ఏకకాల ఎన్నికలకు విస్తృత మద్దతు ఉందని ఈ అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి.
సిఫార్సులు, ముందుకెళ్లే మార్గం:
-
రెండు దశల్లో అమలు.
-
మొదటి దశ: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి.
-
రెండో దశ: సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను (పంచాయతీ, మునిసిపాలిటీలు) నిర్వహించాలి.
-
అన్ని ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా.
-
దేశవ్యాప్తంగా సవివరమైన చర్చలను ప్రారంభిస్తాం.
-
అమలు కోసం ఒక గ్రూపును ఏర్పాటు చేయాలి.
****
(Release ID: 2056569)
Visitor Counter : 56