ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆహార భద్రతాధికార సదస్సు 2024 గుర్తు, కరపత్రాలను ఆవిష్కరించిన కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జే పీ నడ్డా


వరల్డ్ ఫుడ్ ఇండియా 2024తో పాటు జిఎఫ్ఆర్ఎస్ 2024 సదస్సును నిర్వహించనున్న ఎఫ్ఎస్ఎస్ఏఐ

ఈనెల 19 నుంచి 21వరకు భారత్ మండపం వేదికగా జరగనున్న సదస్సు

ఆహార భద్రతాధికార సంస్థలు, ప్రమాద అంచనాధికార సంస్థలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు సహా 30 అంతర్జాతీయ సంస్థల నుంచి 70కి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు: జే పీ నడ్డా

“కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్‌ పరిధిలో ప్రమాణాలను నిర్దేశించే ప్రక్రియలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంపై సదస్సు దృష్టి సారిస్తుంది.

సురక్షిత ఆహారం, వాణిజ్యం, నియంత్రణ వంటి ఈ ప్రాంత ప్రత్యేక సవాళ్లను

చర్చించడానికి ఆసియా దేశాల కోసం ప్రత్యేక వేదికను అందిస్తుంది.”

“ అందరికీ సురక్షిత ఆహారాన్నీ, పోషకాహారాన్నీ అందించడం కోసం- సూక్ష్మజీవుల నిరోధకతను తగ్గించడం,
ప్రత్యామ్నాయ ఆహారాల, పోషకాహార మందుల నియంత్రణ, ఆహారాన్ని సురక్షిత విధానాల్లో అందించడం,

అవశేషాల, కలుషితాల పర్యవేక్షణ వ్యవస్థలు, ఆహార పరీక్షల్లో అధునాతన విధానాలు, సురక్షిత ఆహారంపై పశుగ్రాస ప్రభావం అలాగే క్రీడల్లో ఆహార భద్రత- వంటి కీలక అంశాలపై దృష్టి సారించనున్న జిఎఫ్ఆర్ఎస్ 2వ సదస్సు"

Posted On: 17 SEP 2024 5:14PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు నిర్మాణ్ భవన్‌లో ప్రపంచ ఆహార భద్రతాధికా సదస్సు (గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్- జీఎఫ్ఆర్ఎస్2024 గుర్తునుకరపత్రాలను ఆవిష్కరించారుఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించే వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 ఈవెంట్‌తో పాటు ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐనిర్వహించే ఈ సదస్సు సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది.

ప్రపంచ వేదికగా సురక్షిత ఆహార ప్రాముఖ్యతను వివరించిన కేంద్ర ఆరోగ్య మంత్రి, "ఆహార భద్రత చాలాకాలంగా అంతర్జాతీయ ప్రయత్నాలకు కేంద్రంగా ఉన్నప్పటికీప్రపంచ జనాభా ఆరోగ్యంశ్రేయస్సు కోసం సురక్షిత ఆహారానికీ అంతే ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందిఅని పేర్కొన్నారు. ఆహార చక్రంలో- సురక్షిత ఆహార వ్యవస్థలనునియంత్రణ విధానాలను బలోపేతం చేయడం కోసంపరస్పర అభిప్రాయాలను పంచుకునేందుకు కోసం ఆహార నియంత్రణ సంస్థల ప్రపంచస్థాయి వేదిక ఏర్పాటు ఈ సదస్సు ద్వారా సాధ్యమవుతుందన్నారు.


 

ప్రపంచస్థాయిలో సురక్షిత ఆహారంనాణ్యత నిర్ధారణ కోసం పరిజ్ఞానాన్ని అందరితో పంచుకోవడం అత్యంత ముఖ్యమని శ్రీ జె పి నడ్డా పేర్కొన్నారు. పెరుగుతున్న ముప్పుసాంకేతిక పురోగతులను ఎదుర్కోవడానికీ, అలాగే మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికీసురక్షిత ఆహారంనియంత్రణ వ్యవస్థలో దీనిని నిరంతరం అనుసరించాల్సిన అవసరముందని చెప్పారు.

 

ఆహార భద్రతాధికార వ్యవస్థ, ప్రమాద అంచనా సంస్థలుపరిశోధనా సంస్థలువిశ్వవిద్యాలయాలు సహా 30 అంతర్జాతీయ సంస్థలుదాదాపు 5,000 మంది ప్రతినిధులు70కి పైగా దేశాల నుంచి ఈ 2వ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొంటారుదాదాపు 1.5 లక్షల మంది వీడియో అనుసంధానం ద్వారా ఈ సదస్సులో పాల్గొననున్నారువ్యూహాలుసహకార మార్గాల గురించి సదస్సులో ప్రధానంగా చర్చిస్తా. ఆహార భద్రతాధికార వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలపై కూడా చర్చించనున్నా” అని ఆయన తెలిపారు.

 

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ), వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీజాయింట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్యూఎస్ఏ వంటి సంస్థలు దీనిలో పాలుపంచుకుంటాయిసదస్సులో కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ సెక్రటేరియట్ తరపున దాని చైర్‌పర్సన్వైస్-ఛైర్‌పర్సన్కార్యదర్శి ప్రాతినిధ్యం వహిస్తారుడబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వీడియో అనుసంధానం ద్వారా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు.

వాణిజ్య శాఖఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఎఫ్‌పీఐ), వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖవ్యవసాయ సంబంధశుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఏపీఈడీఏ), సముద్ర సంబంధ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపీఈడీఏఅలాగే ఎగుమతుల తనిఖీ మండలి (ఈఐసీసహా జాతీయ వాటాదారులు సురక్షిత ఆహార ప్రమాణాల అభివృద్ధిలో భారత్ నిబద్ధతను వివరించడం ద్వారా ఎన్ఏబీసీబీ సదస్సులో క్రియాశీల పాత్ర పోషించనున్నారు.

శ్రీ నడ్డా మాట్లాడుతూ “రోమ్‌ నగరానికి బయట తొలిసారిగా భారతదేశం ప్రాంతీయ ఫుడ్ రెగ్యులేటర్స్ సదస్సుకు అతిధ్యమివ్వడం గర్వించదగ్గ విషయంకోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్‌ పరిధిలో ప్రమాణాలను నిర్దేశించే ప్రక్రియలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంపై సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుందిసురక్షిత ఆహారంవాణిజ్యం అలాగే నియంత్రణ వంటి ఈ ప్రాంత ప్రత్యేక సవాళ్లను చర్చించడానికి ఇది ఆసియా దేశాలకు ఒక ప్రత్యేక వేదికను అందిస్తుంది.” అన్నారు.

సూక్ష్మజీవుల నిరోధకతను (ఏఎమ్ఆర్తగ్గించడంప్రత్యామ్నాయ ఆహారాలుపోషకాహార మందులునియంత్రణభద్రతా విధానాల్లో ఆహార సరఫరాఅందరికీ సురక్షిత ఆహారంపోషకాహారాన్ని అందేలా చేయడంఅవశేషకలుషితాల పర్యవేక్షణ వ్యవస్థలుఆహార పరీక్షల్లో ఆధునిక విశ్లేషణలుసురక్షిత ఆహారంఆరోగ్యంపై పశువుల దాణా ప్రభావంఅలాగే క్రీడలుపోషణ వంటి కీలకమైన అంశాలపై జీఎఫ్ఆర్ఎస్ 2వ సదస్సు దృష్టి సారిస్తుంది.” అని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. “సురక్షిత ఆహారం అందేలా చర్యలు చేపట్టడంచట్టాల అమలుపై అవగాహనను పెంచడంఉత్తమ పద్ధతులను పంచుకోవడంఅలాగే సురక్షిత ఆహారం అందించడానికి ఇతర దేశాలతో కలిసి పనిచేయడంఐక్య వేదికల ఏర్పాటుకు ఈ సదస్సు సహాయపడుతుంది” అని ఆయన తెలిపారు.


 

పోషకాహారంపై అవగాహన పెంచడానికి చిరుధాన్యాలతో చేసే వంటకాలపై "ఫ్లేవర్స్ ఆఫ్ శ్రీ అన్నా సెహత్ ఔర్ స్వాద్ కే సంగ్అనే కార్యక్రమం 13 ధారావాహికలుగా దూరదర్శన్‌లో ప్రసారం కానుందిదీనిని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించనున్నారు.

సదస్సు ముఖ్యాంశాలలో- భారత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ పని తీరును అంచనా వేసే స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (ఎస్ఎఫ్ఎస్ఐ2024 విడుదల చేయడంసులభతర వ్యాపార నిర్వహణ గురించి చర్చించడానికి సీనియర్ ప్రభుత్వ అధికారులతో పాటు ప్రధాన ఆహార కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల సమావేశంపౌష్టికాహారానికి ప్రాప్యతను మెరుగుపరచడం అలాగే సురక్షిత ఆహారం కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు భూటాన్అర్జెంటీనాన్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు ఉన్నాయి.

 

జీఎఫ్ఆర్ఎస్ 2వ సదస్సులోని అత్యంత ముఖ్యాంశాలలో ఫుడ్ సేఫ్టీ పద్ధతులు అలాగే సమాచారాన్ని పంచుకునే పద్ధతులను మార్చే లక్ష్యంతో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించడం ఒకటిదీనిలో భాగంగా ప్రత్యేకించి ఆహార దిగుమతుల తిరస్కరణ నివేదికల సమాచారం (ఎఫ్ఐఆర్ఏకోసం కొత్త వెబ్‌సైట్ ప్రారంభించడంఆహార దిగుమతుల అంగీకార వ్యవస్థ 2.0 (ఎఫ్ఐసిఎస్ 2.0) ఆవిష్కరణ కూడా జరగనుంది. ‘ఎఫ్ఐఆర్ఏ’ అనేది భారత సరిహద్దుల్లో ఆహార దిగుమతి తిరస్కరణల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి రూపొందించిన వెబ్ సైట్. ఇది సాధారణ ప్రజలకుఅలాగే సంబంధిత దేశంలోని ఆహార భద్రత ప్రాధికార సంస్థల సమాచారం కోసం ఉపయోగపడుతుంది.

వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శకత కోసంఅధునాతన ఫీచర్లుయాంత్రీకరణఇతర సంబంధిత వెబ్ సైట్ల ఏకీకరణతో పూర్తి పరిష్కారాన్ని అందించడం ద్వారా మునుపటి వ్యవస్థల్లోని పరిమితులను పరిష్కరించే ఆహార దిగుమతుల సమ్మతిని తెలియజేసే అధునాతన వ్యవస్థే- ఈ ఎఫ్ఐసిఎస్ 2.0.  భారత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా పనితీరును అంచనా వేసే వార్షిక నివేదిక హార భద్రతా సూచిక (ఎస్ఎఫ్ఎస్ఐ2024 ను ఈ సదస్సులో విడుదల చేయనున్నారు.

గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సదస్సులో అంతర్జాతీయ సంస్థలశాస్త్రవేత్తల కీలక ప్రసంగాలుఫుడ్ రెగ్యులేటర్‌లతో సాంకేతికచర్చా కార్యక్రమాలుజాతీయఅంతర్జాతీయ వాటాదారులతో పరస్పర సంభాషణలు, అలాగే ప్రస్తుతపెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడానికిపరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంసురక్షిత ఆహారం కోసం సమతుల్య విధానాలను రూపొందించడం కోసం ద్వైపాక్షికబహుపాక్షిక సమావేశాలు సహా విభిన్న శ్రేణి కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

 

శ్రీ అపూర్వ చంద్రఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శిఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్‌పర్సన్శ్రీ జికమల వర్ధనరావుసీఈఓఎఫ్ఎస్ఎస్ఏఐ, శ్రీ నిఖిల్ గజరాజ్ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిశ్రీ యూ.ఎస్ధ్యాని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 2056273) Visitor Counter : 68