కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోస్టాఫీసుల నుంచి ఎగుమతి సేవలు అందుబాటులోకి జీఎస్టీ రిఫండ్, చెల్లింపు సర్దుబాట్లు

Posted On: 17 SEP 2024 7:22PM by PIB Hyderabad

తపాలా శాఖ దేశవ్యాప్తంగా వాణిజ్య ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర (డిఎన్కేపేరుతో ఒక ఎగుమతుల విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తన సేవలను గణనీయంగా మెరుగుపరచుకోవాలని సంకల్పించిందిదేశవ్యాప్తంగా ఉన్న 1,000కి పైగా డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రాలు ఎగుమతిదారులకు విభిన్న శ్రేణుల్లో సేవలు అందించడానికి సిద్ధం అవుతున్నాయిఎగుమతికి సంబంధించిన పోస్టల్ బిల్లు ఇ-ఫైలింగ్సెల్ఫ్-బుకింగ్ఎలక్ట్రానిక్ విధానంలో కస్టమ్స్ అనుమతులుపార్శిల్ చేయడంఉచితంగా ఇంటికి వచ్చి తీసుకుపోవడంరవాణా వస్తువుల వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడంవస్తువుల సంఖ్యను బట్టి తగ్గింపులతో సహా అనేక రకాల సేవలను ఈ కేంద్రాలు అందించనున్నాయిచేదోడుగా ఉండడంఎగుమతిదారులకు మార్గదర్శకంగా ఉండడం ఈ సేవలలో కొన్ని ముఖ్య అంశాలు.

మరొక ప్రధాన పరిణామండాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర (డీఎన్కేపోర్టల్ మధ్య ఏకీకరణ ఇప్పుడు ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్‌వే (ఐస్ గేట్), ఇండియన్ కస్టమ్స్ఈడిఐ సిస్టమ్ (ఐసిఈఎస్), పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పిఎఫ్ఎంఎస్), ఎగుమతి డేటా ప్రాసెసింగ్‌ర్బ నియంత్రణ వ్యవస్థ(ఈడిపిఎంఎస్)తో విజయవంతంగా పూర్తయిందిఈ ఏకీకరణ ఐజీఎస్టీ రిఫండ్ ను యాంత్రికంగా చేయడానికి డిఎన్కేకస్టమ్స్పిఎఫ్ఎంఎస్ వ్యవస్థల మధ్య సమాచార ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తుందిఈడిపిఎంఎస్ లోకి డేటా ప్రవాహం అధీకృత డీలర్లు (డీ బ్యాంకులుఎలక్ట్రానిక్ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్లను (-బిఆర్సిజారీ చేయడాన్ని సులభతరం చేస్తుందిఎగుమతిదారులు వారి ఎగుమతి లావాదేవీలుచెల్లింపులపై మెరుగైన పారదర్శకతను పొందుతారుతద్వారా నిర్ణయాలు తీసుకోవడం సుళువు అవుతుంది.

డిఎన్కే పోర్టల్‌ను ఉపయోగించే ఎగుమతిదారులు తప్పనిసరిగా ఐస్గేట్ పోర్టల్‌లో తమ ఏడి కోడ్‌ను నమోదు చేయాలిసకాలంలో ఐజిఎస్టీ రిఫండులను బ్యాంకుల ఈ-బిఆర్సీ సౌకర్యాన్ని పొందేలా చేయడానికి ఖచ్చితమైన బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలిబ్యాంక్ వివరాలను ధ్రువీకరించడానికిరీఫండ్ల ప్రత్యక్ష క్రెడిట్‌ను సులభతరం చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ముఖ్యం.

తపాలా వ్యవస్థ ద్వారా ఎగుమతులను సులభతరం చేయడంలో ఈ ఏకీకరణ ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చుముఖ్యంగా మారుమూలచిన్న ప్రాంతాల నుండిభారతీయ ఎగుమతిదారులకు సులభంగా వ్యాపారం చేయడానికి దోహదపడుతుందికేంద్ర ప్రభుత్వ పథకాలైన ఓడిఓపి (ఒక జిల్లాఒక ఉత్పత్తి)తో ప్రత్యక్షంగా అమలవుతోందిజిఐ ట్యాగ్ చేసిన ఉత్పత్తులుమేక్ ఇన్ ఇండియా మొదలైన వాటిని ప్రచారం చేయడం ఎగుమతులను పెంచుతాయి.  

****


(Release ID: 2056252) Visitor Counter : 103


Read this release in: Tamil , English , Urdu , Hindi