వ్యవసాయ మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ లో జరిగిన ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌధరి
స్వచ్ఛతా హీ సేవా - 2024: అధిక శాతం వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం
కార్యాలయాల్లో ‘స్వచ్ఛత ప్రతిజ్ఞ’ స్వీకరణ-మొక్కలను పెంచే కార్యక్రమం
వివిధ సెక్షన్‌లలో కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది స్వచ్ఛత పర్యవేక్షణ
Posted On:
18 SEP 2024 2:08PM by PIB Hyderabad
‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ (‘‘తల్లి పేరిట ఒక మొక్కను నాటడం’’) కార్యక్రమాన్ని నిన్నటి రోజున హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ లో నిర్వహించగా, కేంద్ర వ్యవసాయ - రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది కృషి భవన్ లో వివిధ సెక్షన్ లలో కలియదిరుగుతూ స్వచ్ఛత సంబంధి కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయనే అంశంపై దృష్టి సారించారు. బీరువాల పైన పెట్టిన/బీరువాలకు బయట వదలి వేసిన కాగితాలు/ ఫైళ్ళు/ పుస్తకాలు వంటివి పరిశీలించి, అలాంటివాటిపై తగిన చర్యలను తీసుకోవాలంటూ ఆయా సెక్షన్ ల అధికారులను ఆయన ఆదేశించారు. ఉపయోగంలో లేని కార్యాలయ సామగ్రిని/వాడకుండా ఉన్న వస్తువులను వెనువెంటనే వదలించుకోవలసిందిగా కూడా ఆయన సూచించారు.
విభాగంలోని అధికారులు ఈ రోజున స్వచ్ఛత ప్రతిజ్ఞ పాఠాన్ని స్వీకరించేటట్లు కూడా వ్యవసాయం, రైతుల సంక్షేమం విభాగ కార్యదర్శి శ్రద్ధ తీసుకొన్నారు.
‘స్వచ్ఛతా హీ సేవా-2024’ (ఎస్‌హెచ్ఎస్-2024) ప్రచార ఉద్యమానికి తాగునీరు, పారిశుధ్యం విభాగంతో పాటు గృహ నిర్మాణం -పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 17 అక్టోబరు 1 మధ్యకాలం లో నాయకత్వం వహించనున్నాయి. ‘స్వభావ్ స్వచ్ఛతా - సంస్కార్ స్వచ్ఛతా’ అంశాలు ఈ ఉద్యమానికి ఇతివృత్తంగా ఉన్నాయి. అక్టోబరు 2 న ‘స్వచ్ఛ్ భారత్ దివస్’గా పాటించనున్నారు.
ఈ ప్రచార ఉద్యమంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ విభాగం చురుకుగా పాల్గొంటోంది. ‘స్వచ్ఛతా హీ సేవా-2024’ ప్రచార ఉద్యమ కాలంలో దేశవ్యాప్తంగా ఈ విభాగానికి చెందిన అన్ని సబార్డినేట్ కార్యాలయాలు/అనుబంధ కార్యాలయాలు/స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు/ ప్రభుత్వ రంగ సంస్థలు/క్షేత్ర కార్యాలయాలు కలసికట్టుగా సుమారు 600 స్వచ్ఛత సంబంధిత కార్యకలాపాలను చేపట్టనున్నాయి.
ఈ ప్రచార ఉద్యమం ప్రారంభ దినాన వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. స్వచ్ఛత ప్రతిజ్ఞ ను పూనిన కార్యాలయాలలో స్మాల్ ఫార్మర్స్ ఎగ్రి బిజినెస్ కన్సార్షియమ్, డైరెక్టరేట్ ఆఫ్ కేశూనట్ ఎండ్ కొకొవా డెవలప్‌మెంట్; నేషనల్ హార్టికల్చర్ బోర్డు; కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్; నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్; డైరెక్టరేట్ ఆఫ్ షుగర్‌కేన్ డెవలప్‌మెంట్; డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్; డైరెక్టరేట్ ఆఫ్ రైస్ డెవలప్‌మెంట్; ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ఆథారిటి; చౌధరి చరణ్ సింగ్ వ్యవసాయ మార్కెటింగ్ విషయాల జాతీయ సంస్థ; డైరెక్టరేట్ ఆఫ్ జూట్ డెవలప్‌మెంట్; నార్తర్న్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రయినింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్; డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారన్ టీన్ అండ్ స్టోరేజ్ లతో పాటు నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎగ్రీకల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ లు ఉన్నాయి.
ఈ కార్యక్రమాలకు తోడు ‘ఏక్ పేడ్ మా కే నామ్/ మొక్కల పెంపకం సంబంధిత కార్యకలాపాల’ను అమలుపరచిన కార్యాలయాలలో డైరెక్టరేట్ ఆఫ్ ఎరీకనట్ అండ్ స్పైసెస్ డెవలప్‌మెంట్ (కాలికట్); డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్‌పెక్షన్ (ఫరీదాబాద్); మహలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్‌కాస్ట్ సెంటర్; నేషనల్ సీడ్ రిసర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (వారాణసీ); డైరెక్టరేట్ ఆఫ్ కేశూనట్ అండ్ కొకొవా డెవలప్‌మెంట్; నేషనల్ హార్టీకల్చర్ బోర్డ్; కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్; డైరెక్టరేట్ ఆఫ్ షుగర్‌కేన్ డెవలప్‌మెంట్; డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్; డైరెక్టరేట్ ఆఫ్ రైస్ డెవలప్‌మెంట్; చౌధరి చరణ్ సింగ్ వ్యవసాయ మార్కెటింగ్ విషయాల జాతీయ సంస్థ; సెంట్రల్ అగ్‌మార్క్ లేబరేటరీ; డైరెక్టరేట్ ఆఫ్ కాటన్ డెవలప్‌మెంట్; నార్తర్న్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్ టిట్యూట్; డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారన్ టీన్ అండ్ స్టోరేజ్; ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ ఆథారిటి; నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎగ్రీకల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ లతో పాటు స్మాల్ ఫార్మర్స్ అగ్రో కన్సార్షియమ్ లు ఉన్నాయి.
***
(Release ID: 2056244)
Visitor Counter : 48