ఉక్కు మంత్రిత్వ శాఖ
ఎన్ఎమ్‌డిసి కి ‘రాజ్ భాషా కీర్తి పురస్కార్ 2023-2024’ ప్రదానం
Posted On:
18 SEP 2024 3:42PM by PIB Hyderabad
ప్రతిష్ఠాత్మక ‘రాజభాషా కీర్తి పురస్కార్’ ను 2023-2024 సంవత్సరానికి గాను ‘సీ’ ప్రాంతం సంస్థల కేటగిరీలో ఎన్ఎమ్‌డీసీకి ఇచ్చారు. భారతదేశంలో అతి పెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు సంస్థగానే కాక నవరత్న హోదాను కూడా కలిగి ఉన్న ప్రభుత్వ రంగ వ్యాపార సంస్థగా ఎన్ఎమ్‌డీసీ ప్రసిద్ధికెక్కింది. హోం మంత్రిత్వ శాఖలోని అధికార భాషా విభాగం న్యూఢిల్లీలో నిర్వహించిన హిందీ దివస్ వేడుక 2024 నాలుగో అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనంలో భాగంగా ఈ అవార్డును అందజేశారు. అధికార భాషా విధానాన్ని ప్రభావవంతంగా అమలుపరిచినందుకు రెండో బహుమతితో ఎన్ఎమ్‌డీసీని సన్మానించారు.
పురస్కారాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ చేతుల మీదుగా, ఎన్ఎమ్‌డీసీ పక్షాన ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ (సిబ్బంది-పరిపాలన) శ్రీమతి జి. ప్రియదర్శిని స్వీకరించారు. రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్య సభ సభ్యుడు శ్రీ సుధాంశు త్రివేదీ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్ఎమ్‌డిసి, సిఎమ్డి (అదనపు బాధ్యత) శ్రీ అమితావ ముఖర్జీ మాట్లాడుతూ, ‘‘హిందీ భాషను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడంలో, అధికార భాష విధానం అమలు పరంగా రాణించడంలో ఎన్ఎమ్‌డిసి నిరంతరాయంగా చాటుకొంటున్న నిబద్ధతను ఈ గుర్తింపు స్పష్టం చేస్తున్నది. మా సంస్థ కార్యకలాపాలలో జాతీయ భాష వాడకానికి పెద్ద పీట వేయడానికి, జాతీయ భాషకు గౌరవాన్ని ఇనుమడింపచేయడానికి మేం చేస్తున్న ప్రయత్నాలను చూసుకొని గర్వ పడుతున్నాం’’ అన్నారు.
హిందీ ని ప్రోత్సహించడంలో ఎన్ఎమ్‌డిసి నిరంతరాయంగా విజేత గా నిలుస్తోంది. ఇప్పటి వరకు అనేక రాజభాష పురస్కారాలు ఈ సంస్థను వరించాయి. ఈ కేటగిరీ లో పెద్ద పీట అనదగ్గ ఉక్కు మంత్రిత్వ శాఖ అందించే ‘ఇస్పాత్ రాజభాష సమ్మాన్’ తో పాటు, తెలంగాణాలోని హైదరాబాద్ లో గల పిఎస్ఇ లకు అధికార భాష అమలు సంఘం తాలూకు అవార్డు కూడా ఎన్ఎమ్ డీసీకి దక్కడంతో, కంపెనీ పడుతున్న ప్రయాసలకు మాన్యత లభించినట్లయింది.
***
(Release ID: 2056241)
Visitor Counter : 62