నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్‌లో వరల్డ్‌ స్కిల్స్ లియోన్ 2024లో భారత్ మెరుపులు:16 పతకాలు, ఉత్తమ నైపుణ్య పతకాలు”


నైపుణ్య పరీక్షల్లో 4 కాంస్య పతకాలు, 12 ఉత్తమ నైపుణ్య పతకాల గెలుపు


పేస్ట్రీలు, కేకుల తయారీ, పరిశ్రమ 4.0 (టీమ్ స్కిల్), హోటల్ రిసెప్షన్, పునరుత్పాదక ఇందనంలో కాంస్య పతకాలు


వరల్డ్ స్కిల్స్ పోటీలలో భారత్ తరఫున ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబర్చి,

‘బెస్ట్ అఫ్ నేషన్’ అవార్డు పొందిన అశ్విత పోలిస్


3డీ ప్రింటింగ్, వెబ్ టెక్నాలజీ వంటి ఆవిష్కరణ-ఆధారిత రంగాల్లో దూకుడును ప్రదర్శించిన భారత్

క్యాబినెట్ మేకింగ్, కుకింగ్ రంగాల్లో వెల్లివిరిసిన వృత్తి నైపుణ్యత

Posted On: 16 SEP 2024 4:27PM by PIB Hyderabad

 ఫ్రాన్స్‌లోని లియోన్‌లో జరిగిన వరల్డ్ స్కిల్స్ 2024లో ప్రతిష్ఠాత్మక కాంస్య పతకాలను గెలుచుకోవడం ద్వారా భారతదేశం ప్రపంచ వేదికపై అద్భుతమైన ముద్ర వేసిందిఅశ్విత పోలీస్ పేస్ట్రీకేకుల తయారీలో పతకం సాధించగాఇండస్ట్రీ 4.0- ధ్రుమిల్‌ కుమార్ ధీరేంద్రకుమార్ గాంధీసత్యజిత్ బాలకృష్ణన్హోటల్ రిసెప్షన్జోతిర్ ఆదిత్య కృష్ణప్రియ రవికుమార్పునరుత్పాదక ఇంధనంఅమరేష్ కుమార్ సాహు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారువీరితో పాటు భారతీయ ప్రతినిధి బృందం 12 ఉత్తమ నైపుణ్యతా పతకాలు కూడా సంపాదించివారి అసాధారణ నైపుణ్యాలువివిధ వృత్తుల్లో ఉత్తమ పని తీరుకు నిదర్శనంగా నిలిచారు.

పేస్ట్రీకేకులుచాక్లెట్ల తయారీలో పోటీ చేసిన అశ్విత పోలిస్,  టీమ్ ఇండియా నుండి అత్యుత్తమ పోటీదారుగా బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డును కూడా గెలుచుకున్నారుఆమె చిన్నతనం నుంచీ చాక్లెట్లు తయారుచేయడం నేర్చుకుందిటీవీ షోల ద్వారా స్ఫూర్తిని పొందిన అశ్వితకుకింగ్ లో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించారుతెలంగాణలోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ విద్యార్థినిషెఫ్ వినేష్ జానీ మార్గదర్శకత్వంలో ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారుఅశ్విత విజయంప్రపంచ వేదికపై భారతీయ పాకశాస్త్ర ప్రతిభకు పెరుగుతున్న ప్రాముఖ్యతను సూచించడంతోపాటుదేశవ్యాప్తంగా ఔత్సాహిక షెఫ్‌లకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ స్కిల్స్ లియోన్ 2024లో భారతదేశ పతకాలుఇతర పతకాల సంఖ్య పట్టిక ....

Link  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2055378

70 కంటే ఎక్కువ దేశాలు వరల్డ్‌స్కిల్స్ లియోన్ 2024లో పాల్గొనగావిభిన్న నైపుణ్యాల విభాగాలలో 1400 మందికి పైగా పోటీ పడ్డారుభారతీయ పోటీదారులు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు తమ ప్రతిభనుఆవిష్కరణలను ప్రదర్శించి ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచారుచైనాజపాన్కొరియాసింగపూర్జర్మనీబ్రెజిల్ఆస్ట్రేలియాకొలంబియాడెన్మార్క్ఫ్రాన్స్యూకేదక్షిణాఫ్రికాస్విట్జర్లాండ్యుఎస్ఏ మొదలైన దేశాలతో భారతదేశం 52 నైపుణ్యాలలో పోటీ పడింది.

మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటమే కాకుండాపతకాలు కూడా సాధించినందుకు భారతీయ బృందం ఆనందిస్తోందిఈ గుర్తింపు తెచ్చిన ఆనందంతోపాటుదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వాళ్లు మరింత గర్విస్తున్నారుమార్గదర్శనం చేసిన సీనియర్లకూశిక్షకులకూ వారు కృతజ్ఞతలు తెలిపారునైపుణ్యం ప్రాముఖ్యతను వారి జీవితాలనీవృత్తి మార్గాలను మార్చడంలో దాని పాత్రనీవిజేతలు ప్రముఖంగా ప్రస్తావించారుఎంతో కష్టపడి సాధించుకున్న విజయంవారిలో ఆనందోత్సాహాలను నింపిందితెలంగాణ నుంచి వచ్చిన అశ్విత పోలిస్ పేస్ట్రీకేకులుస్వీట్ల విభాగంలో 21 దేశాలతో పోటీ పడి, కాంస్య పతకాన్ని గెలుచుకున్నదిఅశ్విత తన ఆనందాన్ని పంచుకుంటూ "నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం.. పతకం సాధించడం... నా కల నిజమైందిప్రయాణంలో సవాళ్లున్నా తగిన ప్రతిఫలం రివార్డు రూపంలో దక్కింది అని అన్నారు

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా భారతదేశాన్ని కొత్త నైపుణ్యాల దిశగా తీసుకునిపోవడం గర్వంగా ఉందని ‘పరిశ్రమ- 4.0’ బృందం వ్యాఖ్యానించిందిఅంతర్జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం మంచిదేనంటూ హోటల్ రిసెప్షన్రెన్యూవబుల్ ఎనర్జీ పోటీదారులు అన్నారు.

టీమ్ ఇండియాను చూపిన ప్రతిభ గురించి మాట్లాడుతూ..“లియోన్‌లో వారిని ప్రత్యక్షంగా చూసినందుకుఇంత విపరీతమైన ఒత్తిడిలో ఈ స్థాయిలో ప్రదర్శన చేయడం అంత తేలికైన పని కాదని నేను చెప్పగలనుసాంకేతిక ఖచ్చితత్వండెలివరీలో మెళకువఅవసరమైన ఫోకస్ అన్నీ శాశ్వతమైన గుర్తును మిగిల్చాయిఅని నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్రశ్రీ జయంత్ చౌదరి ప్రశంసించారు. "వరల్డ్ స్కిల్స్ 2024లో అసాధారణ విజయాలు సాధించినందుకు టీమ్ ఇండియాని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానుఇది మన దేశానికి ఎనలేని గర్వకారణంకాంస్య పతకాలుఅత్యుత్తమ నైపుణ్య పతకాలను సాధించడం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదునైపుణ్యాల పరంగా భారతదేశ ప్రాధాన్యతకు ఇది నిదర్శనంఈ యువ పోటీదారులు తమ వ్యక్తిగత ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా నైపుణ్యాల అభివృద్ధిలో ప్రపంచ శ్రేష్ఠతను సాధించడంలో భారతదేశానికి అంకితభావం ఉందని నిరూపించారువారి విజయం మన గౌరవ ప్రధానమంత్రి కుశల్వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తుందిప్రపంచ వేదికగా భారతదేశాభివృద్ధిని శాసించే నైపుణ్యాలను మరింత మంది యువతకు అందించాలన్న మా ఆలోచనలకు ఇది ఊతమిస్తున్నది’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.

వరల్డ్ స్కిల్స్ 2024లో భారత బృందం సాధించిన విజయంప్రపంచంలోనే నిపుణ దేశంగా భారతదేశానికి గుర్తింపు రావడానికి ఇది తొలి మెట్టుపేస్ట్రీకేకుల తయారీ రంగంలో పేరున్న ఫ్రాన్స్‌లోభారతదేశం కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ఒక అసాధారణ విజయంఇది కలినరీ ఆర్ట్స్ లో పెరుగుతున్న భారత్ నైపుణ్యాన్ని సూచిస్తుందిఈ వృత్తికి చెందిన నిపుణ దేశాల్లో ఒక దేశంగాభారతీయ ప్రతిభభుజం భుజం కలిపి నిలబడగలదని రుజువు చేస్తుంది.

అదనంగావరల్డ్ స్కిల్స్ 2024లో రెన్యూవబుల్ ఎనర్జీఇండస్ట్రీ 4.0లో భారతదేశం విజయం దేశాన్ని అత్యాధునికభవిష్యత్తుకేంద్రీకృత రంగాలలో పెరుగుతున్న శక్తిగా నిలబెట్టింది.

వరల్డ్ స్కిల్స్ 2024లో భారతదేశం 12 అత్యుత్తమ నైపుణ్య పతకాలను సాధించడం వల్లమెకట్రానిక్స్సైబర్ సెక్యూరిటీ నుంచి జ్యువెలరీబ్యూటీ థెరపీ వరకుసంప్రదాయ లేదా పురోగామి నైపుణ్యాల పరంగా భారతదేశానికి ఒక గుర్తింపు లభిస్తుంది.

నైపుణ్యం, ఆవిష్కరణలకు అవకాశం ఉన్న 3డీ ప్రింటింగ్వెబ్ టెక్నాలజీఅలాగే క్యాబినెట్ మేకింగ్ (చెక్క వస్తువుల తయారీ)పాకశాస్త్ర రంగాల్లో భారతదేశపు నాయకత్వాన్ని స్పష్టం చేశాయి.  ఈ విజయాలు ప్రపంచ వేదికపై ఆవిష్కరణలుస్థిరమైన అభ్యాసాలుసాంకేతిక నైపుణ్యానికి కేంద్రంగా భారతదేశపు స్థాయిని బలోపేతం చేస్తున్నాయికీలకమైన ప్రపంచ పరిశ్రమలలో భారత్ పురోగమనంలో ఉందనడానికి ఇవన్నీ నిదర్శనం.

వరల్డ్ స్కిల్స్ 2024లో భారతీయ పోటీదారుల విజయం వారి ప్రయాణంలో వారు పొందిన కఠినమైన తయారీపరిశ్రమ మద్దతుకు నిదర్శనంపాల్గొన్న ప్రతివారు పరిశ్రమ నిపుణులుసలహాదారులువివిధ రంగాలలో సంస్థలు అందించిన అత్యుత్తమ-తరగతి మౌలిక సదుపాయాల మద్దతుతో విస్తృతమైన శిక్షణ పొందారు.

నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ), నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి), పరిశ్రమ భాగస్వాములతో పాటుప్రపంచ స్థాయి శిక్షణ కార్యక్రమాలుసన్నాహక పోటీలలో పోటీదారులను సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించిందిఈ సహకార ప్రయత్నం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పాల్గొనేవారికి బాగా ఉపకరిస్తుందిచివరికి లియోన్‌లో వారి అద్భుతమైన పనితీరుకు మంచి అవకాశం ఇచ్చింది.

లవ్వోన్ అకాడమీలీలా హోటల్స్నామ్‌టెక్సిటీటీసి భువనేశ్వర్టయోటా కిర్లోస్కర్మారుతీఇరాజ్ ఎవల్యూషన్ డిజైన్ కంపెనీసీవీ రామన్ గ్లోబల్ యూనివర్సిటీవెల్‌కమ్ హోటల్స్లింకన్ ఎలక్ట్రిక్ఫెస్టో ఇండియానిఫ్ట్ఎల్ అండ్ టీ నుండి అమూల్యమైన మద్దతు లభించిందిఈ మార్గదర్శకత్వంసాంకేతిక నైపుణ్యం రెండింటిలోనూపాల్గొనే వారికి ప్రయోగాత్మక అనుభవంప్రపంచ పోకడలపై లోతైన అవగాహనను అందించిందిఈ భాగస్వామ్యాలు భారతదేశ నైపుణ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశాయియువ ప్రతిభావంతులు అంతర్జాతీయ వేదికలపై రాణించడానికి వీలు కల్పించాయి.

 

***


(Release ID: 2055863) Visitor Counter : 50