రాష్ట్రపతి సచివాలయం
మిలాద్-ఉన్-నబి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి
Posted On:
15 SEP 2024 6:15PM by PIB Hyderabad
మిలాద్-ఉన్-నబి కి ముందు రోజు న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రజలకు సందేశాన్ని ఇస్తూ:
‘‘మిలాద్-ఉన్-నబి గా జరుపుకొనే ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా, నేను నా తోటి పౌరులు అందరికీ, ప్రత్యేకించి మన ముస్లిం సోదర సోదరీమణులకు, నా స్నేహపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ప్రేమ, ఇంకా సోదరత్వం భావనలను బలపరచుకొనే టట్లుగా మనకు ప్రవక్త మహమ్మద్ స్ఫూర్తిని అందించారు. సంఘంలో సమానత్వానికీ, శాంతి-సామరస్యాలకూ ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ చెప్పారు. ఇతరుల పట్ల దయతో ఉండాలనీ, మానవజాతికి సేవ చేస్తూ ఉండాలనీ ప్రజలను ఆయన ఉత్తేజపరిచారు.
పవిత్ర గ్రంథం ఖురాను- ధర్మపరాయణ బోధలను మనం తలదాల్చి, ఒక శాంతియుక్త సమాజాన్ని నిర్మించడానికి సంకల్పించుకొందాం రండి ” అని పేర్కొన్నారు.
(Release ID: 2055309)
Visitor Counter : 46