రక్షణ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        మయన్మార్‌లో మానవతాపూర్వక సహాయం, వైపరీత్య సహాయ చర్యలకు భారత నౌకాదళం సిద్ధం - యాగి తుపాను
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                15 SEP 2024 8:28PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                మయన్మార్‌లో సంభవించిన తీవ్ర తుపాను, అనంతర ఆకస్మిక వరదల కారణంగా అతలాకుతలమైన ప్రాంతాల్లో మానవతాపూర్వక సహాయం, వైపరీత్య సహాయ చర్యలు (హెచ్ఏడిఆర్) చేపట్టేందుకు భారత నౌకాదళం వేగంగా ఏర్పాట్లు ప్రారంభించింది. దక్షిణ చైనా సముద్రం నుంచి వచ్చిన యాగి తుపాను కారణంగా  మయన్మార్‌లోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
తూర్పు నౌకాదళ కమాండ్ తనకు అనుబంధంగా ఉన్న తూర్పు నౌకాదళ స్థావరం, స్థావరంలోని ఆహార పదార్ధాల నిల్వ యార్డ్ (బివివై), మెటీరియల్ ఆర్గనైజేషన్, ఐఎన్హెచ్ఎస్ కల్యాణి సహకారంతో విశాఖపట్టణం నుంచి యాంగాన్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న నౌకల్లోకి రాత్రికి రాత్రే సహాయ సామగ్రి లోడింగ్‌ను పూర్తి చేసింది. ఆ సహాయ సామగ్రిలో హెచ్ఏడిఆర్ గేర్లు, మంచినీరు, ఆహార పదార్థాలు, ఔషధాలు ఉన్నరాయి. అతి తక్కువ వ్యవధిలోనే  మానవతాపూర్వక సహాయం అందించగల నౌకాదళ  సామర్థ్యానికి, వేగానికి ఇది దర్పణం పడుతోంది.
 
***
                
                
                
                
                
                (Release ID: 2055304)
                Visitor Counter : 111