గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశాన్ని స్వచ్ఛంగా చేసేందుకూ, పచ్చదనంతో నింపేందుకు ఉద్దేశించిన ఉద్యమం: ‘‘స్వచ్ఛతా హీ సేవ 2024’’ కోసం నడుంకట్టిన గనుల శాఖ

Posted On: 13 SEP 2024 1:22PM by PIB Hyderabad

స్వచ్ఛ్ భారత్ ను ఆవిష్కరించాలన్న భారత ప్రభుత్వ దృష్టి కోణానికి అనుగుణంగా ‘‘స్వచ్ఛతా హీ సేవ (ఎస్‌హెచ్ఎస్)  ప్రచార ఉద్యమం 2024’’ను గనుల మంత్రిత్వ శాఖ  ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభించనుందిఈ ప్రచార ఉద్యమం వచ్చే నెల 2 (2024 అక్టోబరు 2)  పూర్తి కానుంది.

మంత్రిత్వ శాఖ తన వివిధ విభాగాలలోక్షేత్ర కార్యాలయాలలో అనేక కార్యక్రమాలను చేపట్టాలనిఅందుకు కొన్ని పథకాలను సిద్ధం చేసింది. ఆయా కార్యక్రమాల్లో స్వచ్ఛతా నిర్వహణదేహ దృఢత్వంపర్యావరణ సంబంధిత స్థిరత్వం ప్రధానంగా సాగే కార్యకలాపాలు, ‘‘తల్లి పేరిట ఒక మొక్క ను నాటే కార్యక్రమం’’ (‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’) వంటివి కలసి న్నాయి. మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోగనుల తవ్వకం జరిగే ప్రాంతాల్లో ఆరుబయ జాగాలలోమరీ ముఖ్యంగా శుభ్రపరచడం కఠినతరంగా ఉండే ప్రాంతాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటూ ఈ పరిశుభ్రత ప్రధాన కార్యక్రమాలను విరివిగా చేపట్టనున్నారు.

‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ కార్యక్రమంలో భాగంగా  100 మొక్కలను గనుల శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్కాంతారావు న్యూ ఢిల్లీ లో 2024 సెప్టెంబర్ 16 న నాటివాటికి నీళ్లు పోస్తారు.  ఉద్యోగులుపౌరులు వారికి సూచించినటువంటి ప్రదేశాల్లో మొక్కలను నాటి తద్వారా పర్యావరణ లక్ష్యాల సాధనకు అనువుగా పచ్చదనం విస్తీర్ణాన్ని పెంపు చేసేలా వారిని ఈ కార్యక్రమం ప్రోత్సహించనుంది.  మంత్రిత్వ శాఖ ఉద్యోగులందరితో పాటు మంత్రిత్వ శాఖ క్షేత్ర కార్యాలయాల సిబ్బంది స్వచ్ఛ పరిసరాల నిబద్ధతను బలపరచడానికి స్వచ్ఛత ప్రతిజ్ఞ పాఠాన్ని కూడా ఈ నెల 17న  స్వీకరించనున్నారు

 

 

ఈ ప్రచార ఉద్యమం స్వచ్ఛత గురించిశారీరక ఆరోగ్యం గురించి ప్రచారం చేస్తూపెద్ద పరుగు పందేలు (మారథన్స్), సుదీర్ఘ కాలినడక పోటీలు (వాకథన్స్), సైకిల్ తొక్కుతూ సుదూరం ప్రయాణించే పోటీల (సైక్లథాన్స్లోబడి పిల్లలనుపౌరులనుస్థానికులను పాలుపంచుకొనేటట్లు ప్రోత్సహించనున్నారు.  పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తారు.  ఈ శిబిరాలను ‘సఫాయి మిత్ర సురక్ష శిబిర్’ అనే పేరుతో పిలుస్తారు.  ఈ శిబిరాల్లో ఆరోగ్య పరీక్షల నిర్వహణపిపిఇ కిట్ల పంపిణీ తో పాటు సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి మార్గదర్శనాన్ని అందించనున్నారు.  ట్రాన్స్‌ ఫర్మేషన్ ఆఫ్ క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ (సిటియులు ) కార్యక్రమంలో స్థానికులను పాలుపంచుకొనేలా వారిని ప్రోత్సహించడంలోనిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను శుభ్రపరచి వాటిని నివాసయోగ్యంగా తీర్చిదిద్దే పనుల్లో కూడా మంత్రిత్వశాఖ ముందువరుసలో నిలవనుంది

పర్యావరణ సంరక్షణ పట్ల చైతన్యాన్ని పెంచడానికి మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు జియో-హెరిటేజ్ఇంకా జియో-టూరిజమ్ స్థలాలను సందర్శించిఆయా చోట్లలో పరిశుభ్రతనుబాధ్యతాయుత పర్యటనను ప్రోత్సహించనున్నారు. ఈ ప్రచార ఉద్యమంలో పోస్టర్లను తయారుచేసే పోటీలువ్యాస రచనఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛత ఉద్యమంలో యువతీ యువకుల ప్రమేయాన్ని చాటి చెప్పేందుకు పాఠశాల సంబంధిత కార్యకలాపాలు సైతం చోటు చేసుకోనున్నాయి. అక్టోబరు , ఈ ప్రచార ఉద్యమం కొనసాగినన్ని రోజులు స్వచ్ఛతకు పారిశుధ్య కార్మికులు అందించిన ప్రధాన సేవలకు గాను వారిని సన్మానించనున్నారు.


 

ఎస్‌హెచ్ఎస్ 2024 కాలంలో చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలలో పునరుద్ధరించిన గని ప్రాంతాల సుందరీకరణ ఒక భాగంగా ఉండబోతోందిఆరు స్థలాలను గుర్తించి హరిత హారాలను ఏర్పాటు చేయడానికి బోలెడన్ని మొక్కలను నాటనున్నారు.  ఖనిజాల వెలికితీత పూర్తి అయిన చోట్ల ప్రజా ఉద్యానవనాలువినోద ప్రదేశాలుఇంకా పండ్ల తోటలుగా మార్చనున్నారుఉపయోగించని శిలల నమూనాలనుఅల్యూమినియం తుక్కును వాడుతూ శిల్పాలనుకళా స్వరూపాలను సిద్ధం చేసి వాటిని ‘వ్యర్థం నుంచి ఉత్తమం కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు.

స్వచ్ఛమైనపచ్చదనంతో నిండిన భారతదేశం కోసం ఉద్దేశించిన ఈ ప్రచార ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకోవాలని పౌరులకు గనుల శాఖ పిలుపు ఇస్తోంది. ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ కార్యక్రమం సువిశాల స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో భాగంగా పర్యావరణ స్థిరత్వానికి మంత్రిత్వశాఖ వాగ్దానాన్ని ప్రతిధ్వనింప చేయనుంది.

 

***


(Release ID: 2055139) Visitor Counter : 51