కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జూలైలో ఈఎస్ఐ పథకం కింద 22.53 లక్షల కొత్త కార్మికుల నమోదు


కొత్త రిజిస్ట్రేషన్లలో 10.84 లక్షల మంది 25 ఏళ్ల లోపు యువ ఉద్యోగులే

ఈఎస్ఐ పథకంలో 4.65 లక్షల మహిళా ఉద్యోగులు

జూలైలో నమోదు చేసుకున్న 56,467 కొత్త సంస్థలు

కొత్తగా నమోదైన 71 మంది ట్రాన్స్ జెండర్ ఉద్యోగులు

प्रविष्टि तिथि: 13 SEP 2024 7:07PM by PIB Hyderabad

గత జూలైలో కొత్తగా 22.53 లక్షల మంది ఉద్యోగులు చేరినట్లు ఈఎస్ఐసీ తాత్కాలిక డేటా వెల్లడించింది.
ఎక్కువ మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు  జూలైలో కొత్తగా 56,476 సంస్థలను
ఈఎస్ఐ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. అంతే కాకుండా, 2023 జూలైతో పోలిస్తే నికర రిజిస్ట్రేషన్లలో 13.32 శాతం వృద్ధి నమోదైందని వార్షిక విశ్లేషణలో తేలింది.
వివరాలు పట్టికలో.... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2054685

డేటా ప్రకారం,జులై లో నమోదైన మొత్తం 22.53 లక్షల మంది ఉద్యోగుల్లో 10.84 లక్షల మంది అంటే మొత్తం రిజిస్ట్రేషన్లలో దాదాపు 48 శాతం మంది 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
అలాగే, ఉద్యోగుల జాబితా లింగ వారీ విశ్లేషణ ప్రకారం జూలైలో మహిళా సభ్యుల నికర నమోదు 4.65 లక్షలు.  మొత్తం 71 మంది ట్రాన్స్ జెండర్  ఉద్యోగులు కూడా ఈఎస్ఐ పథకం కింద నమోదు చేసుకోవడాన్ని బట్టి చూస్తే ఈఎస్ఐ కార్పొరేషన్ తన ప్రయోజనాలను సమాజంలోని ప్రతి వర్గానికి అందించడానికి చేస్తున్న కృషి తెలుస్తుంది.  
డేటా రూపకల్పన అనేది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ఇవి తాత్కాలిక లెక్కలు.

 

***


(रिलीज़ आईडी: 2055129) आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Manipuri , English , Urdu