హోం మంత్రిత్వ శాఖ

7వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సును ఈరోజు ఢిల్లీ లో ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

Posted On: 13 SEP 2024 8:15PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా రెండు రోజుల జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు - 2024 ను ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీనికి ముందు అమరవీరుల స్థూపం వద్ద కేంద్ర హోంమంత్రి పుష్పగుచ్ఛం ఉంచి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డిజిఎస్ పి/ఐజిఎస్ పి) వార్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ఎన్ సిఆర్ బి అభివృద్ధి చేసిన డిజిఎస్ పి/ఐజిఎస్ పి సమావేశ సిఫార్సుల డ్యాష్ బోర్డును కేంద్ర హోంమంత్రి
ప్రారంభించారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో జాతీయ భద్రతా సవాళ్లకు పరిష్కార మార్గాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సీఏపీఎఫ్ లు, సీపీవోల పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి రోడ్ మ్యాప్ ను రూపొందిస్తారు.
డిజిఎస్పి / ఐజిఎస్ పి సమావేశం సందర్భంగా జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు నిర్వహించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భావించారు. ప్రధాన జాతీయ భద్రతా సవాళ్లకు పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో జాతీయ భద్రతా సవాళ్లను నిర్వహించే సీనియర్ పోలీసు నాయకత్వం, అత్యాధునిక సాంకేతిక స్థాయిలో పనిచేస్తున్న యువ పోలీసు అధికారులు, ప్రత్యేక రంగాల డొమైన్ నిపుణుల మధ్య చర్చల ద్వారా ఈ లక్ష్యం సాధించాలని నిర్ణయించారు. డీజీఎస్ పి/ఐజీఎస్ పి కాన్ఫరెన్స్-2020 సందర్భంగా విస్తృత భాగస్వామ్యం కోసం హైబ్రిడ్ పద్ధతిలో సదస్సును నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్దేశించారు.

భౌతిక, దృశ్య మాధ్యమాలను మేళవించి జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 750 మందికి పైగా అధికారులు హాజరవుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్నఈ సదస్సుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ బండి సంజయ్ కుమార్, హోంశాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, జాతీయ భద్రతా ఏజెన్సీల అదనపు / డిప్యూటీ అధికారులు, సిఎపిఎఫ్, సిపిఒల అధిపతులు హాజరవుతున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీఎస్ పి లతో పాటు అత్యాధునిక సాంకేతిక స్థాయిలో పనిచేస్తున్న యువ పోలీసు అధికారులు, ప్రత్యేక రంగాలకు చెందిన డొమైన్ నిపుణులు ఆయా రాష్ట్రాల రాజధానుల నుంచి
దృశ్యమాధ్యమ విధానంలో సదస్సులో పాల్గొన్నారు.

 

*****



(Release ID: 2055128) Visitor Counter : 6