మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
'రంగీన్ మచ్లీ యాప్ ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
Posted On:
12 SEP 2024 7:19PM by PIB Hyderabad
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ ఈరోజు భువనేశ్వర్‌లోని ఐసిఏఆర్ -సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (ఐసిఏఆర్-సిఐఎఫ్ఏ)లో "రంగీన్ మచ్లి" మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) మద్దతుతో ఐసిఏఆర్-సిఐఎఫ్ఏ ఈ యాప్ ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ అలంకార మత్స్య రంగంలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించారు. అభిరుచి గలవారు, అక్వేరియం దుకాణ యజమానులు, చేపల పెంపకందారులకు కీలకమైన వనరులను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ తన ప్రసంగంలో, అలంకార మత్స్య రంగం పట్ల పెరుగుతున్న ప్రాముఖ్యతను వివరించారు. మంత్రిత్వ శాఖ దాని అభివృద్ధికి బలమైన ప్రాధాన్యతనిస్తోందని, ఉపాధిని కల్పన, ఆర్థిక వ్యవస్థకు దోహదపడే రంగం సామర్థ్యాన్ని గుర్తించిందని పేర్కొన్నారు. దేశంలో అక్వేరియం అభిరుచిని మరింత విస్తృతంగా ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.
ప్రసిద్ధ అలంకార చేప జాతులకు సంబంధించిన సమాచారాన్ని "రంగీన్ మచ్లి" యాప్ ఎనిమిది భారతీయ భాషలలో అందిస్తుంది, విస్తృత స్థాయిలో ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. అభిరుచి గలవారు చేపల సంరక్షణపై మార్గదర్శకత్వం కోరుతున్నా లేదా రైతులు తమ జాతులను వైవిధ్యపరచాలని చూస్తున్నా, యాప్ సంరక్షణ, పెంపకం, నిర్వహణ పద్ధతులపై సమగ్ర వివరాలను అందిస్తుంది. దాని ముఖ్య లక్షణాలలో ఒకటి "అక్వేరియం షాప్‌లను కనుగొనండి" సాధనం. దీని ద్వారా సమీపంలోని అక్వేరియం దుకాణాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది. అలంకారమైన చేపలు, అక్వేరియం సంబంధిత ఉత్పత్తులకు విశ్వసనీయమైన వనరులతో వినియోగదారులను కనెక్ట్ చేస్తుంది.
దీనితో పాటు అలంకార చేపల పరిశ్రమలో కొత్తగా వచ్చిన వారికి, నిపుణులకి యాప్‌లో విద్యా మాడ్యూల్స్ ఉన్నాయి. "అక్వేరియం కేర్ లో మౌలిక విషయాలు" అనే మాడ్యూల్, అక్వేరియంల రకాలు, చేపలు, నీటి వడపోత, లైటింగ్, ఫీడింగ్, రోజువారీ నిర్వహణ వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది, అయితే "అలంకార ఆక్వాకల్చర్" మాడ్యూల్ వివిధ అలంకారమైన చేపల పెంపకంపై దృష్టి పెడుతుంది. యాప్‌ను ఈ లింక్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు https://play.google.com/store/apps/details?id=com.ornamentalfish
****
(Release ID: 2054460)
Visitor Counter : 102