గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పరిశుభ్రతను పెంపొందించడం, అపరిష్కృత అంశాల పరిష్కారానికి అక్టోబరు 2-31 మధ్య గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణాభివృద్ధి విభాగం ప్రత్యేక కార్యక్రమం 4.0
Posted On:
12 SEP 2024 6:31PM by PIB Hyderabad
స్వచ్ఛతను తప్పనిసరి చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో అపరిష్కృత అంశాలను తగ్గించే లక్ష్యాలతో అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక కార్యాచరణ 4.0 అమలుకు పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్ పీజీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణాభివృద్ధి విభాగం తన పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థలకు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్టోబరు 2 నుంచి 31 వరకూ స్వచ్ఛత, అపరిష్కృత విషయాల పరిష్కారానికి సంబంధించిన అంశాలు వాటిలో ఉన్నాయి.
గతేడాది గ్రామీణాభివృద్ధి విభాగం ప్రత్యేక కార్యాచరణ 3.0 (2023 అక్టోబరు 2 - 31) ద్వారా పలు కార్యకలాపాలు చేపట్టింది. వాటిలో భాగంగా అపరిష్కృతంగా ఉన్న ఎంపీలు, రాష్ట్ర ప్రభు త్వాలు, పీఎంఓ కార్యాలయం చేసిన సిఫారసులు, ప్రజా ఫిర్యాదులు, ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లు, ఐఎంసీ విషయాల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.
కార్యక్రమం పూర్తయ్యేసరికి పీఎంఓ, రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాలు; ఐఎంసీ విషయాల్లో ఆ శాఖ 100 శాతం పరిష్కారాన్ని సాధించగలిగింది. కాగా, ఎంపీ నిర్దేశాల్లో 97.6%, ప్రజా ఫిర్యాదుల్లో 95.7%, ప్రజా ఫిర్యాదు అప్పీళ్లలో 94.2% పరిష్కారమయ్యాయి. కార్యాలయ స్థలాన్ని, ఉమ్మడి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం; కార్యాలయ గదుల నిర్వహణ కోసం ఈ అవకాశాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ సద్వినియోగం చేసుకుంది. ఈ కార్యాచరణ ద్వారా సాధించిన విజయాలను డీఏఆర్పీజీకి చెందిన ఎస్సీడీపీఎం పోర్టల్ లో కూడా అందుబాటులో ఉంచారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా చేసిన కృషిని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేశారు. ఈ కార్యాచరణను ప్రచారం చేయడానికి కూడా దానిని ఉపయోగించారు.
ప్రత్యేక కార్యాచరణ 3.0 ద్వారా చేపట్టిన చర్యలు దాని తర్వాత 2023 నవంబరు నుంచి 2024 ఆగస్టు వరకూ కొనసాగాయి. ఈ సమయంలో అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారంలో సాధించిన ముఖ్యమైన విజయాలిలా ఉన్నాయి:
పరిష్కృతమైన ఎంపీల నిర్దేశాలు – 30
పరిష్కృతమైన ఐఎంసీ నిర్దేశాలు – 36
పరిష్కృతమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాలు – 23
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం – 7,17,860
ప్రజా ఫిర్యాదుల అప్పీళ్ల పరిష్కారం – 2646
సమకూరిన ఆదాయం – ₹ 6,67,060
వచ్చే అక్టోబర్ 2 నుంచి 31 వరకు చేపట్టనున్న స్వచ్ఛత కార్యాచరణ 4.0కు గ్రామీణాభివృద్ధి శాఖ సన్నద్ధమవుతోంది. పరిశుభ్రతను మరింత సంస్థాగతం చేయడంతో పాటు ఆ శాఖ, దాని పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థల్లో అపరిష్కృత విషయాలను తగ్గించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
***
(Release ID: 2054441)
Visitor Counter : 68