నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వరల్డ్ స్కిల్స్ 2024: ఫ్రాన్సులో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ
నైపుణ్య పోటీలో పాల్గొనేందుకు లియోన్‌కు చేరుకున్న 60 మంది సభ్యుల భారత బృందం
వరల్డ్ స్కిల్స్ 2024 పోటీకి భారత్ పంపుతున్న అతిపెద్ద బృందం ఇదే
ఈ అంతర్జాతీయ పోటీలో 52 నైపుణ్యాలలో పోటీ పడనున్న 70కి పైగా దేశాలు, ప్రాంతాలు
సెప్టెంబర్ 10-15 వరకు యూరోఎక్స్పో లియోన్ లో జరిగే ఈ పోటీలో పాల్గోనున్న 1,300 మంది నిపుణులతో పాటు 1,400 మంది పోటీదారులు
వరల్డ్ స్కిల్స్ 2024లో 2.5 లక్షల మంది ప్రేక్షకులు పాల్గొనే అవకాశం
దేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చాలనే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా
ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొంటున్న భారతదేశం
Posted On:
07 SEP 2024 8:23PM by PIB Hyderabad
నిపుణులు ఈ శిక్షణను అందించారు.
పోటీదారులకు అందించిన కఠోరమైన శిక్షణలో టయోటా కిర్లోస్కర్, మారుతీ, లింకన్ ఎలక్ట్రిక్, అనేక ఇతర ప్రముఖ సంస్థలు మద్దతు అందించాయి. ఇండస్ట్రీ 4.0లో ఫెస్టో ఇండియా నుండి ఫ్యాషన్ టెక్నాలజీలో నిఫ్ట్, ఢిల్లీ వరకు, బ్రిక్ లేయింగ్, కాంక్రీట్ నిర్మాణంలో ఎల్ అండ్ టీ, ఇలా వివిధ పారిశ్రామిక దిగ్గజాలు తమ నైపుణ్యాన్ని రంగరించి ఈ ఈవెంట్ లోని పోటీదారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి.
వెల్డింగ్, ప్లంబింగ్, హీటింగ్ వంటి పురుషాధిక్య రంగాలలో మహిళలు పోటీ పడుతుండడం ఈ సంవత్సరం ప్రత్యేకత. మిజోరం నుండి జమ్మూ, కాశ్మీర్ వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు, అండమాన్, నికోబార్ ద్వీప ప్రాంతాలతో సహా సుదూర మూలలతో సహా ప్రతి ప్రాంతం నుండి పాల్గొనే వారితో ఈ బృందం భారతదేశ అద్భుతమైన వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.
వరల్డ్ స్కిల్స్ కాంపిటిషన్- నిర్మాణం, తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సృజనాత్మక కళలతో సహా వివిధ రంగాల నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. పోటీదారులు, సాధారణంగా 23 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ కఠినమైన పరీక్షలలో పాల్గొంటారు. సమకాలీన పరిశ్రమ ప్రమాణాలను ప్రతిబింబించే పనులను పూర్తి చేస్తారు. మొట్టమొదటిసారిగా, అంతర్జాతీయ శిక్షకులను మన దేశానికి ఆహ్వానించారు. అంతర్జాతీయ దృక్పథం, కఠినమైన శిక్షణ కోసం పోటీదారులను స్విట్జర్లాండ్‌తో పాటు దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రియా, థాయిలాండ్, దుబాయ్ వంటి దేశాలకు కూడా పంపారు.
భారత బృందం ఈ నెల 1-3 తేదీల మధ్య న్యూ ఢిల్లీలో యోగా శిక్షణ, మానసిక బలాన్ని మెరుగుపరచడానికి మానసిక పరీక్షలు, పోషకాహార సలహాలు, అనేక ఇతర మార్గదర్శకాలను కలిగి ఉన్న చివరి దశ శిక్షణలో పాల్గొంది.
(Release ID: 2053014)
Visitor Counter : 73